ఆకలి రాజ్యం
►పెరిగిన ముడిసరుకుల ధరలు
►అర్హులకు అందని సబ్సిడీలు
►రుణమాఫీ మాయ
►అప్పుల బాధతో బలవన్మరణాలు
►నేత కార్మికుల జీవన్మరణ సమస్య
ఇది ఒక రెడ్డమ్మ, నారాయణమ్మకే కాదు. జిల్లాలోని అనేక మంది నేతన్నల పరిస్థితి ఇది. అప్పుల ఊబిలో కూరుకుపోయి బయట పడే మార్గం కనిపించక ఆత్మహత్య కు పాల్పడుతున్నారు. ప్రధానంగా ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో చేనేత రంగం కుదేలైపోయింది. మగ్గాల్లో తయారు చేయాల్సిన వస్త్రాలను పవర్ లూమ్స్‌లో నేస్తున్నారు. ఈ కారణంగా ఉత్పత్తి భారీగా వచ్చి నేత వస్త్రాలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. జిల్లాలో ఆరునెలల కాలంలో పది మందికి పైగా నేతకార్మికులు అప్పులబాధతో బలవన్మరణాలకు పాల్పడ్డారు.
మదనపల్లె సిటీః పెరిగిన ముడిపట్టు ధరలు, గిట్టుబాటు అందించని చీరలు నేతన్నల పాలిట శాపంగా మారుతున్నా యి. పట్టుచీరకు వాడే వార్పు కిలో రూ.2800 నుంచి రూ 4,800 జరీ ధర రూ.2600 నుంచి రూ.3200కు పెరిగింది. గతంలో చైనా నుంచి సిల్క్ వచ్చేది. తద్వారా రేషం ధరలు అందుబాటులో ఉండేవి. ప్రభుత్వం చైనా సిల్క్‌ను నిషేధించింది. దీనికితోడు స్థానిక పట్టు రైతులను ప్రోత్సహించకపోవడంతో పట్టుగూళ్ల ఉత్పత్తి తగ్గింది. ఈ కారణంగా రేషం ధరలు విపరీతంగా పెరిగాయి. ఇంత ఖర్చు పెట్టి చీరలను నేసినా సరైన మార్కెట్ లేక గిట్టుబాటు ధర లభించడం లేదు. కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి దుస్థితి ఏర్పడింది. దీంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మరి కొందరు వలస పోతున్నారు.
వేలల్లో నేత కార్మికులు
జిల్లాలో మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె, పుత్తూరు, తంబళ్లపల్లె, బి.కొత్తకోట, నగిరి, రొంపిచర్ల, కలకడ, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, నగరి, నారా యణవనం, పెనుమూరు తదితర ప్రాంతాల్లో చేనేత మగ్గాలపై ఆధారపడి వేలాదిమంది జీవనం సాగిస్తున్నారు. నీరుగట్టువారిపల్లెలోనే 40 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు.
రుణమాఫీ మాయ
చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని టీడీపీ ప్రకటించింది. రెండేన్నళ్లు పూర్తవుతున్నా సగానికిపైగా రుణమాఫీ కాలేదు. దీంతో పాటు బ్యాంకర్లు రుణాలు అందజేయడం లేదు.