ఆలస్యంగా స్పందించిన స్కూల్ యాజమాన్యం
మెదక్: తమ పాఠశాల బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనపై తుప్రాన్ కాకతీయ టెక్నో స్కూల్ యాజమాన్యం ఆలస్యంగా స్పందించింది. స్కూల్కు సంబంధించిన ఫోన్లన్నీ స్విచ్చాఫ్ చేసి ఉన్నాయి. కాకతీయ స్కూల్ గ్రూపునకు చెందిన 96662 22288 నంబరుకు ఫోన్ చేస్తే తమకు సంబంధం లేదని చెబుతున్నారు.
తుప్రాన్ బ్రాంచ్‌ను తమ వెబ్‌సైట్‌లో ఫ్రాంచైజ్ స్కూల్‌గా కాకతీయ స్కూల్స్ గ్రూపు పేర్కొంది. మరోవైపు అజ్ఞాతంలోకి కాకతీయ గ్రూప్ చైర్మన్ సీతారాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయింది. ఈ వార్త ప్రసారం కాగానే ఆయన సాక్షి' టీవీకి ఫోన్ చేసి మాట్లాడారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద కాపలా లేని రైల్వే గేటు దాటుతుండగా కాకతీయ టెక్నో స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొంది. ఈ దుర్ఘటనలో 18 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్, క్లీనర్ కూడా మృతి చెందారు.