ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరోమోటో కార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన మోటర్ సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్ - షోరూం ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు అక్టోబర్ 30 నుంచి అమల్లోకి రానున్నాయి.
అయితే, ఎంత శాతం మేర పెరుగుతుందనే అంశంపై పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వెహికల్స్‌కు మార్కెట్‌లో ఉన్న డిమాండ్, మోడల్స్ ఆధారంగా ఒక శాతం పెరిగే అవకాశం ఉందని సమాచారం. పెరిగిపోతున్న ధరలు, కాంపిటీషన్, ద్రవ్యోల్బణం కారణంగా వాహనాల ధరల్ని పెరుగుదలకు కారణమని హీరో మోటో కార్ప్ తన రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది.
పెరిగే ఎక్స్ షోరూం ధర ఎంతంటే?
ఇంతకుముందు, కొత్తగా ప్రారంభించిన ఫ్లాగ్‌షిప్ కరిజ్మా ఎక్స్‌ఎంఆర్ ప్రమోషనల్ ఆఫర్ ముగిసినందున అక్టోబర్ 1 నుండి ఎక్స్ షోరూం ధరను రూ.7,000కు (ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ.1,79,900) పెంచుతున్నట్లు ప్రకటించింది. హీరో కరిజ్మా ఎక్స్ ఎంఆర్ ప్రస్తుత బుకింగ్ విండో రూ.1,72,900 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది నేటితో ముగియనుంది. ఇకపై పెంచిన ధరలతో సేల్స్ నిర్వహిస్తామని హీరో కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
పెరుగుతున్న ఎగుమతులు
కాగా, హీరో మోటోకార్ప్ ఆగస్టు నెలలో మొత్తం వాహనాల అమ్మకాలు 6 శాతం పెరిగి 4,88,717 యూనిట్లుగా నమోదయ్యాయి. డొమెస్టిక్ సేల్స్ 4,50,740 యునిట్లుగా ఉండగా 2022 ఇదే ఆగస్టు నెలతో పోలిస్తే దేశీయ విక్రయాలు 5 శాతం వృద్ధితో 4,72,947 యూనిట్లుగా ఉన్నాయి. అయితే ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంలో 11,868 యూనిట్ల నుంచి 15,770 యూనిట్లకు పెరిగడం విశేషం.
చదవండి👉 హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మారుతీ గ్రాండ్ విటారా కార్లు!
Comments
Please login to add a commentAdd a comment