splendor Series
-
Hero Super Splendor XTEC: ఎక్కువ మైలేజ్, అప్డేటెడ్ ఫీచర్స్.. ధర ఎంతంటే?
భారతీయ మార్కెట్లో హీరో మోటోకార్ప్ ఉగాది పండుగకు ముందే సూపర్ స్ప్లెండర్ XTEC బైక్ విడుదల చేసింది. ఇది డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్ అనే రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 83,368, రూ. 87,268 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ఇప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీతో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. ఇందులో ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్, ఫోన్ బ్యాటరీ లెవెల్ వంటి వాటిని తెలుసుసుకోవచ్చు. ఇది 125 సీసీ విభాగంలో విడుదలైన కొత్త బైక్. హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.84 బీహెచ్‌పి పవర్, 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ 68 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. హీరో మోటోకార్ప్ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ ఎల్ఈడీ హెడ్‌లైట్, విజర్, డ్యూయల్-టోన్ స్ట్రిప్స్ వంటి వాటిని పొందటమే కాకుండా, గ్లోస్ బ్లాక్, క్యాండీ బ్లేజింగ్ రెడ్, మాట్ యాక్సిస్ గ్రే కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. -
Hero Super Splendor Canvas Black Edition: అదిరిపోయే లుక్స్, డిజైన్‌తో
సాక్షి, ముంబై: హీరో కంపెనీ స్ప్లెండర్ మోడల్లో ఒక సూపర్ బైక్‌ను లాంచ్ చేసింది. సూపర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ను మార్కెట్లో ప్రవేశ పెట్టింది. రెండు వేరియంట్లలోలభించనున్న వీటి ధరలను కంపెనీ ప్రకటించింది. బేస్ డ్రమ్ సెల్ఫ్-కాస్ట్ వేరియంట్ ధరను రూ. 77,430 (ఎక్స్-షోరూమ్)గానూ, డిస్క్ సెల్ఫ్-కాస్ట్ వేరియంట్ ధరను రూ. 81,330 (ఎక్స్-షోరూమ్)గా ఉంచింది. హీరో సూపర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్ ఫీచర్లు, ఇంజన్ ప్రీమియం బోల్డ్ డిజైన్ , అప్డేటెడ్ టెక్నాలజీతో, కొత్త హీరో సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. లీటరుకు 60-68 కిలీమీటర్ల సెగ్మెంట్లో అత్యుత్తమ మైలేజీతో 13 శాతం వరకు మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని హీరో వెల్లడించింది. డిస్క్ బ్రేక్, కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS)ఎంపికతో వస్తుంది. డిజి-అనలాగ్ క్లస్టర్, ఇంటిగ్రేటెడ్ USB ఛార్జర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఉన్నాయి. 5 సంవత్సరాల వారంటీతో పాటు, గ్రాఫిక్స్‌తో కస్టమర్లు కస్టమైజ్ చేసుకునే చాన్స్ కూడాఉంది. ఈ బైక్‌లోని 125cc, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7500 RPM వద్ద 10.7 HP , 6000 RPM వద్ద 10.6 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అధునాతన ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఇంజన్‌తో పాటు, వెట్ మల్టీ ప్లేట్ క్లచ్, సరికొత్త 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ని అందించింది. చదవండి: 2022 Volvo XC40 Electric SUV: వోల్వో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు లాంచ్, సూపర్ లగ్జరీ ఎస్‌యూవీలకు పోటీ! -
హైటెక్ ఫీచర్లతో హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ విడుదల చేసింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.72,900 ఉంది. 97.2 సీసీ ఇంజన్, పేటెంటెడ్ ఐ3ఎస్ టెక్నాలజీ, బ్లూటూత్ కనెక్టివిటీతో పూర్తి డిజిటల్ మీటర్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, లో ఫ్యూయల్ ఇండికేటర్, ఇంటిగ్రేటెడ్ యూఎస్బీ చార్జర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, స్టాప్–స్టార్ట్ సిస్టమ్, ఎల్ఈడీ హై ఇంటెన్సిటీ పొజిషన్ ల్యాంప్, ప్రత్యేక గ్రాఫిక్స్‌తో ఇది రూపుదిద్దుకుంది. అయిదేళ్ల వారంటీ ఉంది. చదవండి: ఇంత ధర అంటే కష్టం బాస్.. పైగా ప్రమాదాలు కూడానూ.. -
తెలుగు గడ్డపై హీరో మోటర్ కార్ప్ గిన్నీస్ రికార్డ్
World's Largest Motorcycle Logo: ప్రపంచంలోనే అతి పెద్ద బైకుల తయారీ సంస్థగా పేరొందిన హీరో మోటర్ కార్ప్ మరో రికార్డు సాధించింది. ఆ కంపెనీకి చెందిన 100 మంది సిబ్బంది 90 రోజుల పాటు శ్రమించి హీరో పేరును గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కించారు. తెలుగు నేలను వేదికగా హీరో సంస్థ ఈ ఘనత సాధించింది. చిత్తూరులో హోండా కంపెనీ నుంచి హీరో విడిపోయి పదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని హీరో అరుదైన కార్యక్రమం చేపట్టింది. దీనికి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాను వేదికగా చేసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మోటర్ సైకిల్ లోగోను ఏర్పాటు చేసి గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. గిన్నీస్ రికార్డ్ చిత్తూరులో ఉన్న హీరో మోటార్ కార్ప్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో స్ప్లెండర్ ప్లస్ బైకులను హీరో లోగో ఆకారంలో ఏర్పాటు చేసింది. ఫ్యాక్టరీ సమీపంలో నేలను చదును చేశారు. ఆ తర్వాత హీరో లోగో ఆకారంలో రోజుకు కొన్ని బైకులను పార్క్ చేశారు. దీని కోసం హీరోకు చెందిన వంద మంది సిబ్బంది 90 రోజుల పాటు నిర్విరామంగా పని చేశారు. ఈ లోగో ఆకారంలో 1845 బైకులను నిలిపి ఉంచారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని షూట్ చేసి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డుకు పంపించారు. అన్ని వివరాలు పరిశీలించిన అనంతరం లార్జెస్ట్ మోటార్ సైకిల్ లోగోగా గిన్నీస్ గుర్తించింది. పదికోట్ల బైకులు హీరో కంపెనీ నుంచి పది కోట్ల బైకులు అమ్మడంతో పాటు హీరో పదేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టినట్టు హీరో మోటార్ కార్ప్ గ్లోబల్‌హెడ్ మాలో ఏ మాసన్ తెలిపారు. ఈ లోగో ఏర్పాటుకు సంబంధించిన వీడియోను ఆగస్టు 9న హీరో రిలీజ్ చేసింది. - సాక్షి, వెబ్‌డెస్క్ What happens when 100 brilliant minds come together? A world record is made. With 90 days of planning and 300 hours of dedication. Watch the video to know more. pic.twitter.com/QAdK4CijUO — Hero MotoCorp (@HeroMotoCorp) August 10, 2021 -
హీరో కొత్త వ్యూహం, రాయల్ ఎన్ఫీల్డ్కు టఫ్ ఫైట్!
మిడిల్ వెయిట్ బైక్ సెగ్మెంట్లో మార్కెట్ రారాజుగా ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీగా సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగుతోంది హీరో మోటర్ కార్ప్. దీని కోసం విదేశీ కంపెనీలతో జట్టు కట్టింది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని మరిపించేలా కొత్త బైక్‌ను డిజైన్ చేసే పనిలో తలామునకలై ఉన్నారు హీరో టీం మెంబర్స్. సాక్షి, వెబ్‌డెస్క్: ఇండియాలో బైక్ మార్కెట్లో హీరోదే అగ్ర స్థానం. హీరో గ్రూపు నుంచి వచ్చిన స్ల్పెండర్, ప్యాషన్ బైకులదే మార్కెట్లో హవా. అయితే దేశంలో నంబర్ వన్ మోటార్ బైక్ బ్రాండ్‌గా ఉన్నప్పటికీ హీరో బలమంతా ఎంట్రీ లెవల్, 100 సీసీ నుంచి 120 సీసీ బైకుల వరకే ఉంటోంది. అంతకు మించి స్పోర్ట్స్, మిడిల్ వెయిట్ సెగ్మెంట్లో హీరోకు పట్టు చిక్కడం లేదు. దశాబ్ధాల తరబడి ప్రయత్నాలు చేస్తోన్నా నిలదొక్కుకోలేక పోతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ మరోవైపు రీలాంచ్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ ఇరగదీస్తోంది. 350 సీసీ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్, థండర్ బర్డ్ మోడళ్ల అమ్మకాలు జోరు మీదున్నాయి. 350 సీసీ మిడిల్ వెయిట్ విభాగంలో 90 శాతం మార్కెట్ రాయల్ ఎన్ఫీల్డ్దే. దీంతో 350 సెగ్మెంట్లో వాటా కోసం హీరో కొత్త ప్రయత్నాలు చేస్తోంది. హార్లే డేవిడ్సన్ అమెరికాకు చెందిన ప్రీమియం బైకుల తయారీ కంపెనీ హర్లే డేవిడ్సన్తో జట్టు కట్టింది హీరో మోటర్ కార్ప్. గతంలో హర్లే డేవిడ్సన్ ఇండియా మార్కెట్లోకి వచ్చినా గట్టిగా నిలదొక్కుకోలేక పోయింది. దేశంలో అక్కడక్కడ తప్ప పెద్దగా అమ్మకాలు లేవు. పనులు మొదలయ్యాయి రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా మిడిల్‌వెయిట్ విభాగంలో 350 సీసీ ఇంజన్ సామర్థ్యంతో కొత్త బైకును మార్కెట్లోకి తెచ్చేందుకు హార్లే డేవిడ్సన్, హీరో కంపెనీలు చేతులు కలిపాయి. ‘ 350 సెగ్మెంట్లో బైకు తయారీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే బైకు ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని హీరో మోటర్ కార్ప్ ఫైనాన్షియల్ ఛీఫ్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా ‘మనీ కంట్రోల్’కి వెల్లడించారు. ధరపై ఆసక్తి ఎంట్రీలెవల్ బైక్ మార్కెట్లో హీరో మోటర్ కార్ప్ది అగ్రస్థానమైతే, ప్రీమియం బైకులు మాత్రమే తయారు చేయడం హార్లే డేవిడ్సన్ ప్రత్యేకత. మరీ ఈ రెండు కంపెనీల కలయికలో వస్తోన్న మిడిల్ వెయిట్ సెగ్మెంట్ బైక్ ధర ఎంత ఉండవచ్చనేది మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి. -
హీరో స్ల్పెండర్ ప్లస్, కొత్త వెర్షన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన పాపులర్ మోడల్ స్ల్పెండర్ ప్లస్‌ను బీఎస్-6 వెర్షన్ ఇంజీన్‌తో లాంచ్ చేసింది. దేశీయంగా త్వరలో అమలుకానున్న కొత్త ఉద్గార నిబంధనల నేపథ్యంలో ఈ బైక్‌ను శుక్రవారం విడుదల చేసింది. ధర రూ .59,600 నుండి ప్రారంభమవుతుంది. దీంతో పాటు బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా రెండు స్కూటర్లను కూడా తీసుకొచ్చింది. డెస్టినీ 125, మాస్ట్రో ఎడ్జ్ 125 పేరుతో తీసుకొచ్చిన వీటి ధరలను వరుసగా రూ .64,310 , రూ .67,950 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ) ప్రారంభమవుతుందని హీరో మోటోకార్ప్ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించామని హీరో మోటోకార్ప్ హెడ్ (గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్) మాలో లే మాసన్ అన్నారు. జైపూర్‌లోని ఆర్అండ్డీ హబ్ - సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (సిఐటి) వద్ద వీటిని పూర్తిగా దేశీయంగా డిజైన్ చేసి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. -
టాప్ సెల్లింగ్ టూవీలర్గా హోండా యాక్టివా
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది తొలి అర్ధ భాగ ంలో అత్యధికంగా అమ్ముడుపోయిన టూవీలర్గా హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ)కు చెందిన ‘యాక్టివా’ అవతరించింది. ఇది వరకు ఈ రికార్డు హీరో మోటోకార్ప్‌కు చెందిన స్ల్పెండర్ సిరీస్ పేరిట ఉండేది. అలాగే గత 17 ఏళ్లలో అత్యధికంగా అమ్ముడుపోయిన టూవీలర్లలో బైక్స్‌దే ఆధిపత్యం. కాగా ఇప్పుడు హోండా యాక్టివా, బైక్స్ దూకుడుకు కళ్లెం వేసింది. సియామ్ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది తొలి ఆరు నెలలో (జనవరి-జూన్) యాక్టివా టూవీలర్స్ విక్రయాలు 13,38,015 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో హీరో స్ల్పెండర్ సిరీస్ వాహన విక్రయాలు 12,33,725 యూనిట్లుగా ఉన్నాయి.కాగా హెచ్ఎంఎస్ఐ.. తన యాక్టివా శ్రేణిలో యాక్టివా 3జీ, యాక్టివా 125, యాక్టివా ఐ అనే మూడు వాహనాలను వినియోగదారులకు అందిస్తోంది. ఇక హీరో కంపెనీ తన స్ల్పెండర్ సిరీస్‌లో భాగంగా సూపర్ స్ల్పెండర్, స్ల్పెండర్ ప్లస్, స్ల్పెండర్ ప్రొ, స్ల్పెండర్ ప్రొ క్లాసిక్, స్ల్పెండర్ ఐస్మార్ట్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.