Hero Super Splendor Canvas Black Edition Launched: Check Indian Prices, Features - Sakshi
Sakshi News home page

Super Splendor Canvas Black Edition: కిల్లింగ్‌లుక్స్‌, అదిరిపోయే డిజైన్‌

Published Tue, Jul 26 2022 3:36 PM | Last Updated on Tue, Jul 26 2022 3:55 PM

Hero Super Splendor Canvas Black Edition Launched - Sakshi

సాక్షి, ముంబై:  హీరో  కంపెనీ స్ప్లెండర్‌ మోడల్‌లో ఒక  సూపర్‌ బైక్‌ను లాంచ్‌ చేసింది. సూపర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ను మార్కెట్లో ప్రవేశ పెట్టింది. రెండు వేరియంట్లలోలభించనున్న వీటి ధరలను కంపెనీ ప్రకటించింది. బేస్ డ్రమ్ సెల్ఫ్-కాస్ట్ వేరియంట్  ధరను  రూ. 77,430 (ఎక్స్-షోరూమ్)గానూ, డిస్క్ సెల్ఫ్-కాస్ట్ వేరియంట్ ధరను రూ. 81,330 (ఎక్స్-షోరూమ్)గా ఉంచింది.

హీరో  సూపర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ ఫీచర్లు, ఇంజన్‌
ప్రీమియం బోల్డ్ డిజైన్ , అప్‌డేటెడ్‌ టెక్నాలజీతో, కొత్త హీరో సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. లీటరుకు 60-68 కిలీమీటర్ల సెగ్మెంట్‌లో అత్యుత్తమ మైలేజీతో 13 శాతం వరకు మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని  హీరో వెల్లడించింది. డిస్క్ బ్రేక్,  కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS)ఎంపికతో వస్తుంది. 

డిజి-అనలాగ్ క్లస్టర్, ఇంటిగ్రేటెడ్ USB ఛార్జర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఉన్నాయి. 5 సంవత్సరాల వారంటీతో పాటు, గ్రాఫిక్స్‌తో  కస్టమర్‌లు  కస్టమైజ్‌ చేసుకునే చాన్స్‌ కూడాఉంది. ఈ బైక్‌లోని 125cc, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌  7500 RPM వద్ద 10.7 HP ,  6000 RPM వద్ద 10.6 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది.  అధునాతన ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఇంజన్‌తో పాటు,  వెట్ మల్టీ ప్లేట్ క్లచ్, సరికొత్త 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ని  అందించింది.

చదవండి: 2022 Volvo XC40 Electric SUV: వోల్వో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు లాంచ్‌, సూపర్‌ లగ్జరీ ఎస్‌యూవీలకు పోటీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement