hero company
-
Hero Super Splendor Canvas Black Edition: అదిరిపోయే లుక్స్, డిజైన్‌తో
సాక్షి, ముంబై: హీరో కంపెనీ స్ప్లెండర్ మోడల్లో ఒక సూపర్ బైక్‌ను లాంచ్ చేసింది. సూపర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ను మార్కెట్లో ప్రవేశ పెట్టింది. రెండు వేరియంట్లలోలభించనున్న వీటి ధరలను కంపెనీ ప్రకటించింది. బేస్ డ్రమ్ సెల్ఫ్-కాస్ట్ వేరియంట్ ధరను రూ. 77,430 (ఎక్స్-షోరూమ్)గానూ, డిస్క్ సెల్ఫ్-కాస్ట్ వేరియంట్ ధరను రూ. 81,330 (ఎక్స్-షోరూమ్)గా ఉంచింది. హీరో సూపర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్ ఫీచర్లు, ఇంజన్ ప్రీమియం బోల్డ్ డిజైన్ , అప్డేటెడ్ టెక్నాలజీతో, కొత్త హీరో సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. లీటరుకు 60-68 కిలీమీటర్ల సెగ్మెంట్లో అత్యుత్తమ మైలేజీతో 13 శాతం వరకు మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని హీరో వెల్లడించింది. డిస్క్ బ్రేక్, కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS)ఎంపికతో వస్తుంది. డిజి-అనలాగ్ క్లస్టర్, ఇంటిగ్రేటెడ్ USB ఛార్జర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఉన్నాయి. 5 సంవత్సరాల వారంటీతో పాటు, గ్రాఫిక్స్‌తో కస్టమర్లు కస్టమైజ్ చేసుకునే చాన్స్ కూడాఉంది. ఈ బైక్‌లోని 125cc, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7500 RPM వద్ద 10.7 HP , 6000 RPM వద్ద 10.6 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అధునాతన ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఇంజన్‌తో పాటు, వెట్ మల్టీ ప్లేట్ క్లచ్, సరికొత్త 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ని అందించింది. చదవండి: 2022 Volvo XC40 Electric SUV: వోల్వో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు లాంచ్, సూపర్ లగ్జరీ ఎస్‌యూవీలకు పోటీ! -
అదిరిపోయిన హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్.. రేంజ్?
భారతదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే ద్విచక్ర వాహనం ఏదైనా ఉంది అంటే అది హీరో స్ప్లెండర్ అని చెప్పుకోవచ్చు. ఇతర బైకులతో పోలిస్తే ఈ బైక్ ధర, నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. అందుకే సామాన్య ప్రజానీకం దీనిని ఎక్కువగా కొనడానికి ఇష్ట పడతారు. అయితే, పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు ద్విచక్ర వాహనాలను బయటకు తీయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, సామాన్య ప్రజానీకం వీటి నుంచి బయట పడేలా ఒక కంపెనీ హీరో స్ప్లెండర్ బైక్ కోసం ఈవీ కన్వర్షన్ కిట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. తమకు ఇష్టమైన బైకులో ఈ ఎలక్ట్రిక్ కిట్ ఇన్స్టాల్ చేయడం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కిట్‌కు ఆర్టీఓ ఆమోదం కూడా లభించింది. మహారాష్ట్రలోని థానే కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రిక్ వాహన స్టార్టప్ కంపెనీ గోగోఏ1 ఇటీవల దీనిని లాంఛ్ చేసింది, దీని ధర రూ.35,000. అయితే, అసలుతో పాటు రూ.6,300 జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా, బ్యాటరీ ఖర్చును విడిగా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈవీ కన్వర్షన్ కిట్, బ్యాటరీ ధర కలిపితే ధర రూ.95,000. హీరో స్ప్లెండర్ బైకుతో పాటు దీనిని కొనడానికి అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కంపెనీ తన కిట్‌పై 3 సంవత్సరాల వారెంటీని కూడా అందిస్తోంది. ఈ గోగోఎ1 ఎలక్ట్రిక్ కిట్ సహాయంతో హీరో స్ప్లెండర్ బైక్ 151 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలదు అని సమాచారం. ప్రస్తుతం, భారతదేశంలోని ప్రముఖ కంపెనీలు ఇటువంటి ఎలక్ట్రిక్ బైకులను ఇంకా లాంఛ్ చేయలేదు. (చదవండి: సూపర్ ఐడియా బాసూ.. అద్దె కోసం హెలికాప్టర్‌గా టాటా నానో కారు!) -
హీరో మోటోకార్ప్ దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22) తొలి త్రైమాసికంలో ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1 (ఏప్రిల్-జూన్)లో నికర లాభం నాలుగు రెట్లు పైగా ఎగసి రూ. 256 కోట్లను తాకింది. గతేడాది(2020-21) ఇదే కాలంలో రూ.58 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,969 కోట్ల నుంచి రూ.5,508 కోట్లకు జంప్‌చేసింది. ఇక స్టాండెలోన్ నికర లాభం రూ. 61 కోట్ల నుంచి రూ. 865 కోట్లకు దూసుకెళ్లింది. ఈ కాలంలో 10.25 లక్షల వాహనాలను విక్రయించింది. హీరో మోటో షేరు ఎన్ఎస్ఈలో దాదాపు యథధాతధంగారూ. 2,788 వద్ద ముగిసింది. -
వాళ్ల పెళ్లి ఏకంగా పది రోజుల సెలవులిచ్చింది!
‘పెళ్లి కుదిరింది. ఓ పదిహేను రోజులు సెలవి’మ్మంటేనే కొరకొరా చూసే బాస్లున్న కాలమిది. పైగా ‘వారం సరిపోతుందిలే’ అంటూ సలహాతో కూడిన ఆర్డరూ సరేసరి. ఇక రక్త సంబధీకులు కాని వారి పెళ్లికి సెలవంటే అంతెత్తున లేచి ‘గయ్’మనడం మామూలే. అలాంటిది మనం అభిమానించే నటీనటులో, గాయనీ గాయకులో, ఆటగాళ్లో వృత్తి నుంచి రిటైరవుతున్నారనో, లేక పెళ్లి చేసుకుంటున్నారనో లీవ్ అడిగితే? ఇంకేముంది ఉద్యోగానికి నీళ్లొదిలేసుకోవడమే అంటారా! నిజమే కానీ.. మేమిస్తాం అంటోంది జపాన్‌లోని హిరోరో కంపెనీ. టోక్యోలో ఉంటుందిది. టీవీ యాడ్సు, మ్యూజిక్ వీడియోలూ చేస్తుంటుంది. ఇటీవల ఈ సంస్థ అధిపతి షిజెన్ సురుమి తన ఉద్యోగుల కోసం కొత్త పద్ధతిలో సెలవులివ్వనున్నట్లు ప్రకటించాడు. దీనికి ‘ఓషి వెకేషన్ సిస్టమ్’ అని పేరు పెట్టాడు. దీని ప్రకారం కంపెనీలోని ఉద్యోగి తనకు ఇష్టమైన గాయనీ గాయకుల పెళ్లి లేదా రిటైర్మెంట్కు సెలవు తీసుకోవచ్చు. అది కూడా ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా పది రోజులు. ఒకవేళ సదరు ఉద్యోగికి ఒకరికంటే ఎక్కువ అభిమాన గాయనీ గాయకులు ఉన్నా ఈ లీవ్ వర్తిస్తుంది. అయితే, ఇలాంటప్పుడు సెలవుల సంఖ్య మూడు రోజులకు మించదు. సురుమి ఈ పద్ధతిని ప్రవేశపెట్టడానికి రెండు సంఘటనలు కారణం. ఓ రోజు ఆఫీసులో ఉద్యోగి ఒకరు పనిలో అన్యమనస్కంగా ఉండడం గమనించాడు సురుమి. ఆరా తీస్తే ఆ రోజు సదరు ఉద్యోగి అభిమానించే పాప్ గాయని, డబ్బింగ్ కళాకారిణి పెళ్లి చేసుకుంటోందని తేలింది. మరో రోజు ఇంకో ఉద్యోగి సైతం పనిపై తగిన శ్రద్ధ పెట్టకపోవడం సురుమి గుర్తించాడు. దానికి కారణం అతనికిష్టమైన పాప్ గాయని ఆ రోజు రిటైర్ అవుతుండడమే. దీనితో బాగా ఆలోచించిన సురుమి కొత్త రకం లీవులకు తెరతీశాడు. సాధారణంగా జపాన్‌లో పాప్ మ్యూజిక్ ప్రదర్శనలకు, బ్యాండ్లకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. అందులో పాటలు పాడుతూ అభినయించే గాయక నటీనటులను ఆరాధించేవాళ్లూ ఎక్కువే. తనది మ్యూజిక్కు సంబంధించిన కంపెనీ కావడం, తన ఉద్యోగుల్లోనూ అనేక మందికి పాప్ మ్యూజిక్ సింగర్లంటే విపరీతమైన అభిమానం ఉండడంతో సురుమి ఈ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం అభిమాన పాప్ సింగర్ల పెళ్లికే కాదు, వారి రిటైర్మెంట్కూ, ఏదైనా మ్యూజిక్ బ్యాండ్‌లోని సభ్యులు విడిపోయి మరో జట్టుగా ఏర్పడినప్పుడూ సెలవు ఇస్తారన్నమాట. ఈ కొత్త సెలవు విధానంలో ఇంకో సౌకర్యమూ ఉంది. ఎవరైనా ఉద్యోగి తనకు లభించిన పది రోజుల సెలవులను తనకు అనుకూలమైన సమయాల్లో వినియోగించుకోవచ్చు. అయితే, అదీ పాప్ మ్యూజిక్ ప్రదర్శనలు చూడ్డానికి మాత్రమే వాడుకోవాలి. చదవండి: మీ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే కూల్‌డ్రింక్ ప్రిజర్వేటివ్ -
తెలంగాణలోనే ‘హీరో’ యుూనిట్!
హైదరాబాద్: ప్రపంచ అగ్రశ్రేణి పరిశ్రమ ‘హీరో’ సంస్థ ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్‌ను తెలంగాణలోనే ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. హైదరాబాద్ శివారులోని రావిరాలలో ఈ యుూనిట్ను ఏర్పాటు చేస్తామని, వాటికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే, రావిరాలలో భూమిని కేటాయించే అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. రూ.1,250 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 15 లక్షల వాహనాల తయారీ సామర్థ్యంతో పరిశ్రమను ఏర్పాటు చేయడానికి హీరో సంస్థ నిర్ణయించుకుంది. అయితే ఈ పరిశ్రమను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వాహనాల డీలరుగా ఉన్న టీడీపీ నేత ఒకరు హీరో సంస్థ ఉన్నతస్థాయి వ్యక్తులపై ఒత్తిడి తెస్తున్నట్టుగా సమాచారం. అయితే తెలంగాణలోనే ఏర్పాటు చేయడానికి హీరో సానుకూలంగా ఉన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వ కీలకనేత ఒకరు వెల్లడించారు.