
భారతదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే ద్విచక్ర వాహనం ఏదైనా ఉంది అంటే అది హీరో స్ప్లెండర్ అని చెప్పుకోవచ్చు. ఇతర బైకులతో పోలిస్తే ఈ బైక్ ధర, నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. అందుకే సామాన్య ప్రజానీకం దీనిని ఎక్కువగా కొనడానికి ఇష్ట పడతారు. అయితే, పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు ద్విచక్ర వాహనాలను బయటకు తీయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, సామాన్య ప్రజానీకం వీటి నుంచి బయట పడేలా ఒక కంపెనీ హీరో స్ప్లెండర్ బైక్ కోసం ఈవీ కన్వర్షన్ కిట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
తమకు ఇష్టమైన బైకులో ఈ ఎలక్ట్రిక్ కిట్ ఇన్స్టాల్ చేయడం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కిట్‌కు ఆర్టీఓ ఆమోదం కూడా లభించింది. మహారాష్ట్రలోని థానే కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రిక్ వాహన స్టార్టప్ కంపెనీ గోగోఏ1 ఇటీవల దీనిని లాంఛ్ చేసింది, దీని ధర రూ.35,000. అయితే, అసలుతో పాటు రూ.6,300 జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా, బ్యాటరీ ఖర్చును విడిగా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈవీ కన్వర్షన్ కిట్, బ్యాటరీ ధర కలిపితే ధర రూ.95,000. హీరో స్ప్లెండర్ బైకుతో పాటు దీనిని కొనడానికి అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కంపెనీ తన కిట్‌పై 3 సంవత్సరాల వారెంటీని కూడా అందిస్తోంది. ఈ గోగోఎ1 ఎలక్ట్రిక్ కిట్ సహాయంతో హీరో స్ప్లెండర్ బైక్ 151 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలదు అని సమాచారం. ప్రస్తుతం, భారతదేశంలోని ప్రముఖ కంపెనీలు ఇటువంటి ఎలక్ట్రిక్ బైకులను ఇంకా లాంఛ్ చేయలేదు.
(చదవండి: సూపర్ ఐడియా బాసూ.. అద్దె కోసం హెలికాప్టర్‌గా టాటా నానో కారు!)
Comments
Please login to add a commentAdd a comment