హీరో మోటోకార్ప్ దూకుడు | Brokerages Take On Hero MotoCorp's Q1 Results | Sakshi
Sakshi News home page

హీరో మోటోకార్ప్ దూకుడు

Published Fri, Aug 13 2021 3:01 PM | Last Updated on Fri, Aug 13 2021 4:59 PM

Brokerages Take On Hero MotoCorp's Q1 Results - Sakshi

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22) తొలి త్రైమాసికంలో ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1 (ఏప్రిల్‌-జూన్)లో నికర లాభం నాలుగు రెట్లు పైగా ఎగసి రూ. 256 కోట్లను తాకింది. గతేడాది(2020-21) ఇదే కాలంలో రూ.58 కోట్లు మాత్రమే ఆర్జించింది.

మొత్తం ఆదాయం సైతం రూ. 2,969 కోట్ల నుంచి రూ.5,508 కోట్లకు జంప్‌చేసింది. ఇక స్టాండెలోన్‌ నికర లాభం రూ. 61 కోట్ల నుంచి రూ. 865 కోట్లకు దూసుకెళ్లింది. ఈ కాలంలో 10.25 లక్షల వాహనాలను విక్రయించింది. హీరో మోటో షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు యథధాతధంగారూ. 2,788 వద్ద ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement