Hero Glamour Xtec Bike: Hero MotoCorp Launched Glamour Xtec Bike In India, Check Price, Features - Sakshi

Glamour Xtec: బైక్ ను లాంచ్ చేసిన హీరో మోటోకార్ప్

Jul 20 2021 7:16 PM | Updated on Jul 20 2021 7:39 PM

Hero MotoCorp launched New Glamour Xtec Affordable Bike - Sakshi

ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ నేడు(జూలై 20) తన గ్లామర్ ఎక్స్ టెక్ బైక్ ను లాంఛ్ చేసింది. హీరో గ్లామర్ ఎక్స్ టెక్ బైక్ రెండు విభిన్న ఆప్షన్ లలో లభిస్తుంది. ఒకటి డ్రమ్ వేరియంట్ అయితే, మరొకటి డిస్క్ వేరియంట్. డ్రమ్ వేరియంట్ ₹78,900కు, డిస్క్ వేరియంట్ ₹.83,700(ఎక్స్ షోరూమ్, హైదరాబాద్) ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. 125 సీసీ కమ్యూటర్ మోటార్ సైకిల్ అనేక ఫీచర్లతో వచ్చింది. దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఇంటిగ్రేటెడ్ యుఎస్ బి ఛార్జర్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, బ్యాంక్ యాంగిల్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

ఇది ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ గేర్ పొజిషన్ ఇండికేటర్, రియల్ టైమ్ మైలేజీ వంటి సమాచారాన్ని చూపిస్తుంది. గ్లామర్ ఎక్స్ టెక్ లో హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్, ఫ్రంట్ 240 మీ.మీ డిస్క్ బ్రేకులు, వెడల్పియర్ రియర్ టైర్, 180 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. డిజైన్ పరంగా హీరో గ్లామర్ ఎక్స్ టెక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ తో వస్తుంది. హీరో గ్లామర్ ఎక్స్ టెక్ బైక్ 125 సీసీ బీఎస్-వీఐ ఎక్స్ సెన్స్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 7,500 ఆర్ పీఎమ్ వద్ద 10.7 బిహెచ్ పీ పవర్ ని, 6,000 ఆర్ పీఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement