ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. ఒకేరోజు (ఆగస్టు 9) ఏకంగా లక్ష యూనిట్ల బైక్లను రిటైల్ అమ్మకాలను జరిపింది. ఈ అరుదైన రికార్డు హీరో మోటోకార్ప్ కంపెనీ పదవ వార్షికోత్సవం జరగడం విశేషం. పండుగ సీజన్ లేని సమయంలో భారత్‌తో పాటు ఇతర దేశాల్లో హీరో బైక్లు రికార్డుస్థాయిలో రిటైల్ అమ్మకాలు జరిగినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా జరిగిన హీరో మోటార్స్ అమ్మకాల్లో ఎంట్రీ, డీలక్స్, ప్రీమియం బైక్ల సెగ్మెంట్లకు వీపరీతమైన డిమాండ్ కారణంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని కంపెనీ వెల్లడించింది. హీరో మోటోకార్ప్ కొత్తగా ప్రారంభించిన మాస్ట్రో ఎడ్జ్ 125, డెస్టినీ, ప్లెజర్ 110 తో సహా, తన స్కూటర్ల శ్రేణికి విపరీతమైన డిమాండ్‌తో ఆగస్టు 9న జరిగిన స్కూటర్ల అమ్మకాల్లో రోజువారీ సగటు కంటే రెట్టింపు అమ్మకాలు జరిగాయని కంపెనీ పేర్కొంది. ఈ వాహనాలతో పాటుగా ఇటీవల ప్రారంభించిన గ్లామర్ ఎక్స్‌టెక్, స్ప్లెండర్ మాట్టే గోల్డ్, ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ బైక్లను కూడా కస్టమర్లు గణనీయంగా కొనుగోలు చేశారని హీరో మోటోకార్ప్ తెలిపింది.
హీరో మోటోకార్ఫ్ 10 సంవత్సరాల ప్రయాణంలో ఈ అమ్మకాలు ఒక మైలురాయిగా నిలుస్తోందని హీరో మోటోకార్ప్ సేల్స్ & ఆఫ్-సేల్స్ హెడ్ నవీన్ చౌహాన్ అన్నారు. పండుగ సీజన్ లేని కాలంలో రికార్డు స్థాయిలో లక్ష హీరో బైక్ల రిటైల్ అమ్మకాలు జరిపిన కస్టమర్లకు అభినందనలను అందించారు. కస్టమర్లు తమపై చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలను తెలిపారు.
Hero MotoCorp: అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించిన హీరో మోటోకార్ప్..!
Published Mon, Aug 16 2021 7:54 PM | Last Updated on Mon, Aug 16 2021 7:58 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment