Honda Unicorn Lunched: హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందుతున్న యునికార్న్ బైకు అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ బైక్ ధర, డిజైన్, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర
దేశీయ విఫణిలో విడుదలైన 2023 హోండా యూనికార్న్ ధర రూ. 1,09,800. ఈ బైక్ మునుపటి మోడల్ ధర రూ. 1,05,718 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అంటే ఈ అప్డేటెడ్ బైక్ ధర మునుపటి కంటే కూడా రూ. 4,082 ఎక్కువ. ఈ బైక్ కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్స్ పొందింది.
ఈ అప్డేటెడ్ బైక్ డిజైన్ & ఫీచర్స్ అన్నీ దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. ఈ బైక్ సీటు ఎత్తు 715 మిమీ, మొత్తం బరువు 140 కేజీల వరకు ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు, కావున లాంగ్ రైడ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ మైలేజ్ అందించే బైకుల జాబితాలో హోండా యూనికార్న్ కూడా ఒకటి కావడం విశేషం.
(ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా ఇకనైనా శ్రద్ద పెట్టండి - నెట్టింట్లో మహిళ ట్వీట్ వైరల్!)
ఇంజిన్ & వారంటీ
అప్డేటెడ్ హోండా యూనికార్న్ బైకులో 162.7 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 ఆర్‌పిఎమ్ వద్ద 12.9 bhp పవర్, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 14 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. అంతే కాకుండా ఈ బైక్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ కలిగి డ్రమ్ బ్రేక్స్ కూడా పొందుతుంది.
(ఇదీ చదవండి: ఎట్టకేలకు మార్కెట్లో విడుదలైన హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వి - ధర ఎంతో తెలుసా?)
హోండా కంపెనీ కొత్త యునికార్న్ కోసం స్పెషల్ వారంటీ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే మూడు సంవత్సరాల వారంటీ మాత్రమే కాకుండా ఏడు సంవత్సరాల ఎక్స్టెండెడ్ వారంటీ కూడా అందిస్తుంది. మొత్తం మీద ఈ బైక్ కొనుగోలుపైన 10 సంవత్సరాల వారంటీ కవరేజ్ పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment