Ducati Panigale V4R: భారతదేశంలో సరసమైన బైకులు మాత్రమే కాకుండా అత్యంత ఖరీదైన బైకులు కూడా అమ్ముడవుతున్నాయన్న సంగతి అందరికి తెలిసిందే. ఇందులో కవాసకి, డుకాటి మొదలైన బ్రాండ్ బైకులు ఉన్నాయి. తాజాగా డుకాటి ఇండియన్ మార్కెట్లో సరికొత్త ఖరీదైన బైకును లాంచ్ చేసింది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
డుకాటి విడుదల చేసిన బైక్ పేరు 'పానిగలె వి4 ఆర్' (Panigale V4 R). దీని ధర అక్షరాలా రూ. 69.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా మరింత ఎక్కువ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇందులోని 998 సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్ 215 bhp పవర్ అందిస్తుంది. 2019 నుండి కంపెనీ భారతదేశంలో V4R విక్రయించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ లేటెస్ట్ బైక్ రేస్ టీమ్‌ల కోసం అందించే కొన్ని ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున గన్ డ్రిల్డ్, పిస్టన్ వంటి వాటిని పొందుతుంది.
(ఇదీ చదవండి: ప్రత్యర్థుల పని పట్టడానికి వస్తున్న హ్యుందాయ్ ఎక్స్‌టర్ - ఫస్ట్ యూనిట్ చూసారా!)
ఇది ట్రాక్-ఓరియెంటెడ్ సూపర్‌బైక్ అయినందున ఎలక్ట్రానిక్స్ సూట్‌తో వస్తుంది. వీటిలో కొత్త 'ట్రాక్ ఈవో' మోడ్, రీకాలిబ్రేటెడ్ డుకాటీ ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ బై వైర్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ EVO2 సిస్టమ్‌లు ఉన్నాయి. రైడర్ ఎంచుకోవడానికి ఫుల్, హై, మీడియం, లో అనే నాలుగు రైడింగ్ మోడ్స్ ఉంటాయి.
డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ బైక్ ముందు భాగంలో 1 అనే నెంబర్ ఉండటం చూడవచ్చు. ఇది వరల్డ్ సూపర్‌బైక్‌లలో డుకాటి ఆధిపత్యాన్ని చూపించడానికి ఉపయోగపడుతుంది. ఈ బైక్ కూడా సీబీయు (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా అమ్ముడవుతాయి. ఇప్పటికే భారత్‌కు ఐదు యూనిట్లు వచ్చాయని, అవన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment