Ducati Company
-
చిరుత లాంటి వేగం ఈ బైక్ సొంత - ధర ఎంతో తెలుసా?
Ducati Panigale V4R: భారతదేశంలో సరసమైన బైకులు మాత్రమే కాకుండా అత్యంత ఖరీదైన బైకులు కూడా అమ్ముడవుతున్నాయన్న సంగతి అందరికి తెలిసిందే. ఇందులో కవాసకి, డుకాటి మొదలైన బ్రాండ్ బైకులు ఉన్నాయి. తాజాగా డుకాటి ఇండియన్ మార్కెట్లో సరికొత్త ఖరీదైన బైకును లాంచ్ చేసింది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డుకాటి విడుదల చేసిన బైక్ పేరు 'పానిగలె వి4 ఆర్' (Panigale V4 R). దీని ధర అక్షరాలా రూ. 69.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా మరింత ఎక్కువ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇందులోని 998 సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్ 215 bhp పవర్ అందిస్తుంది. 2019 నుండి కంపెనీ భారతదేశంలో V4R విక్రయించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ లేటెస్ట్ బైక్ రేస్ టీమ్‌ల కోసం అందించే కొన్ని ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున గన్ డ్రిల్డ్, పిస్టన్ వంటి వాటిని పొందుతుంది. (ఇదీ చదవండి: ప్రత్యర్థుల పని పట్టడానికి వస్తున్న హ్యుందాయ్ ఎక్స్టర్ - ఫస్ట్ యూనిట్ చూసారా!) ఇది ట్రాక్-ఓరియెంటెడ్ సూపర్‌బైక్ అయినందున ఎలక్ట్రానిక్స్ సూట్‌తో వస్తుంది. వీటిలో కొత్త 'ట్రాక్ ఈవో' మోడ్, రీకాలిబ్రేటెడ్ డుకాటీ ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ బై వైర్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ EVO2 సిస్టమ్‌లు ఉన్నాయి. రైడర్ ఎంచుకోవడానికి ఫుల్, హై, మీడియం, లో అనే నాలుగు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ బైక్ ముందు భాగంలో 1 అనే నెంబర్ ఉండటం చూడవచ్చు. ఇది వరల్డ్ సూపర్‌బైక్‌లలో డుకాటి ఆధిపత్యాన్ని చూపించడానికి ఉపయోగపడుతుంది. ఈ బైక్ కూడా సీబీయు (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా అమ్ముడవుతాయి. ఇప్పటికే భారత్‌కు ఐదు యూనిట్లు వచ్చాయని, అవన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపింది. -
బైక్ కొనుగోలుదారులకు షాక్.. డుకాటీ ధరలు పెరగనున్నాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓ వైపు కొత్త సంవత్సరం వస్తుండగా, మరో వైపు ఆటో మొబైల్ రంగ సంస్థలు క్రమంగా తమ వాహనాల ధరలను పెంచుతూ పోతున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఇటాలియన్ సూపర్ బైక్స్ తయారీ సంస్థ డుకాటీ కూడా చేరింది. తమ అన్ని మోడళ్ల బైక్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఎంత శాతం సవరిస్తుందన్న విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. “ముడిసరుకు, ఉత్పత్తి, రవాణాలకు సంబంధించిన ఖర్చులు గణనీయంగా పెరిగాయి. కొంతకాలంగా కంపెనీ ఈ భారాన్ని భరిస్తూ వస్తోంది. అయితే వీటిని అధిగమించేందుకు, ప్రస్తుతం ధరలను సవరించాలని నిర్ణయించుకున్నట్లు” అని డుకాటీ తెలిపింది. అలాగే గ్లోబల్ మార్కెట్లోకి విడుదలయ్యే అన్ని బైక్‌లను భారత్‌కు తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
Ducati: డుకాటీ నుంచి రెండు కొత్త బైకులు
న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్ బైకుల తయారీ సంస్థ డుకాటీ గురువారం స్ట్రీట్‌ఫైటర్ వీ4, వీ4 ఎస్ మోడళ్ల కొత్త వెర్షన్ బైకులను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధరలు ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద వరుసగా రూ.19.99 లక్షలు, రూ.22.99 లక్షలుగా ఉన్నాయి. ఈ రెండింటిలోనూ బీఎస్ 6 ప్రమాణాలను కలిగిన ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 208 హెచ్‌పీ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయగలదు. ఆరు స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగి ఉన్నాయి. వీటిలో వీ4 మోడల్ బైక్ రెడ్ కలర్ ఆప్షన్లో లభిస్తుంది. అదే వీ4ఎస్ మాత్రం రెడ్‌తో పాటు డార్క్ స్టీల్త్ కలర్ ఆప్షన్లతో వస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని డుకాటీ డీలర్‌షిప్‌ల వద్ద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ ఆంక్షల ఎత్తివేత తర్వాత డెలివరీలు మొదలుకానున్నాయి. కొత్త వెర్షన్ బైకులు... లగ్జరీ మోటార్ సైకిళ్ల పట్ల ఆసక్తి కలిగిన వారి మన్ననలను పొందుతాయని డుకాటీ భారత విభాగపు ఎండీ బిపుల్ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: గూగుల్ క్రోమ్ యాప్‌తో జర జాగ్రత్త! -
మార్కెట్లోకి డుకాటీ
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన సూపర్ బైక్ తయారీ సంస్థ డుకాటీ.. ‘హైపర్ మోటార్డ్ 950’ పేరుతో అధునాతన ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బైక్ 937 సీసీ ట్విన్ సిలెండర్ ఇంజిన్‌తో విడుదల కాగా.. ధర రూ.11.99 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా డుకాటి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సెర్గీ కానోవాస్ మాట్లాడుతూ.. ‘ప్రత్యేకించి యువత కోసం రూపొందిన బైక్ ఇది. స్పోర్ట్స్ ఫీచర్స్ కలిగి, నిర్భయంగా నడపగిలిగే సూపర్ బైక్‌గా మార్కెట్లోకి ప్రవేశించింది’ అన్నారాయన. హైదరాబాద్, ముంబై, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్, కొచ్చి, కోల్కత్తా, చెన్నైలలోని డుకాటీ డీలర్షిప్స్ వద్ద బుకింగ్స్ ప్రారంభమైనట్లు తెలిపారు. -
డుకాటి స్క్రాంబ్లర్.. 2 కొత్త వేరియంట్స్
ధరలు రూ.7.5 లక్షల నుంచి... న్యూఢిల్లీ : ప్రముఖ ఇటాలియన్ సూపర్ బైక్స్ తయారీ కంపెనీ డుకాటి తన స్క్రాంబ్లర్ మోడల్లో రెండు కొత్త వేరియంట్లను ఆవిష్కరించింది. స్క్రాంబ్లర్ క్లాసిక్, ఫుల్ థ్రోటిల్ అనే ఈ వేరియంట్ల ధరలు రూ.7.5 లక్షల (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) నుంచి ఉంటాయని కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌లో డుకాటి షోరూమ్ డుకాటి కంపెనీ హైదరాబాద్‌లో కొత్త షోరూమ్‌ను ఏర్పాటుచేయనుంది. అలాగే భారత్‌లో కార్యకలాపాల విస్తరణపై దృష్టికేంద్రీకరించింది. ఏడాది చివరకు కొత్తగా 5 షోరూమ్‌లను ప్రారంభించాలని, వాటి సంఖ్యను 2016 నాటికి 13కు పెంచుకోవాలని భావిస్తోంది. అలాగే రూ.6.5 లక్షలు-రూ.40 లక్షల ధర శ్రేణిలో ఉన్న పది మోడళ్లకు చెందిన బైక్‌లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.