న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్ బైకుల తయారీ సంస్థ డుకాటీ గురువారం స్ట్రీట్‌ఫైటర్ వీ4, వీ4 ఎస్ మోడళ్ల కొత్త వెర్షన్ బైకులను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధరలు ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద వరుసగా రూ.19.99 లక్షలు, రూ.22.99 లక్షలుగా ఉన్నాయి. ఈ రెండింటిలోనూ బీఎస్ 6 ప్రమాణాలను కలిగిన ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 208 హెచ్‌పీ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయగలదు. ఆరు స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలిగి ఉన్నాయి. వీటిలో వీ4 మోడల్ బైక్ రెడ్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది.
అదే వీ4ఎస్ మాత్రం రెడ్‌తో పాటు డార్క్ స్టీల్త్ కలర్ ఆప్షన్లతో వస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని డుకాటీ డీలర్‌షిప్‌ల వద్ద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్ ఆంక్షల ఎత్తివేత తర్వాత డెలివరీలు మొదలుకానున్నాయి. కొత్త వెర్షన్ బైకులు... లగ్జరీ మోటార్ సైకిళ్ల పట్ల ఆసక్తి కలిగిన వారి మన్ననలను పొందుతాయని డుకాటీ భారత విభాగపు ఎండీ బిపుల్ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment