Harley Davidson bike
-
గత నెలలో విడుదలైంది.. అప్పుడే కొత్త ధరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హార్లే డేవిడ్సన్ ఎక్స్440 ధరను అన్ని వేరియంట్లలో రూ.10,500 పెంచినట్లు హీరో మోటోకార్ప్ బుధవారం ప్రకటించింది. ఎక్స్‌షోరూంలో పరిచయ ఆఫర్లో రూ.2.29–2.69 లక్షల ధరలో కంపెనీ ఈ మోడల్‌ను గత నెలలో ఆవిష్కరించింది. తాజా సవరణతో ప్రస్తుతం ఈ ధర రూ.2.39 లక్షల నుంచి ప్రారంభం. కొత్త ధర ఆగస్ట్ 4 నుంచి అమలులోకి రానుందని కంపెనీ వెల్లడించింది. 2023 నుంచి ఎక్స్440 డెలివరీలు ఉంటాయని వివరించింది. -
హార్లే-డేవిడ్సన్ లవర్స్‌కు భారీ షాక్, ఏకంగా పదివేలు!
Harley Davidson X440:హార్లే-డేవిడ్సన్ లవర్స్‌కు భారీ షాక్. హీరో మోటోకార్ప్ హార్లే-డేవిడ్సన్ బైక్స్ లేటెస్ట్ బైక్ ధరలను భారీగా పెంచేసింది. ఏకంగా 10,500 మేర ధరలను పెంచింది. ఈ పెరుగుదల అన్ని వేరియంట్లకు వర్తిస్తుందని హీరో మోటోకార్ప్ ధృవీకరించింది. ధర పెంపు తర్వాత, హార్లే-డేవిడ్సన్ ఎక్స్440 బైక్ ధర రూ. 2,39,500 నుండి ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ప్రస్తుత ప్రారంభ ధర ఆగస్టు 3 వరకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 5,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బైక్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు హీరో మోటోకార్ప్ గత నెలలో విడుదల చేసిన హార్లే డేవిడ్సన్ ఎక్స్440 కొత్త ధరను ప్రకటించింది. కంపెనీ ప్రయోగ ధరతో పోలిస్తే రూ.10,500 ఖరీదు ఎక్కువ. ఇది 2,29,000 ప్రారంభ ధరతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. (టికెట్ల ధరలకు ‘రెక్కలు’: ప్రయాణీకులకు ఇక చుక్కలే!) హీరో మోటోకార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా మాట్లాడుతూ, హార్లీ-డేవిడ్సన్ ఎక్స్ 440 ప్రారంభించినప్పటి నుంచి మంచి ఆదరణ లభించిందనీ, ఆన్లైన్ బుకింగ్‌ల తదుపరి విండోకు వర్తించే కొత్త ధరను ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. హీరో మోటో భాగస్వామ్యంతో, అమెరికా ప్రీమియం ఆటోమొబైల్ హార్లే-డేవిడ్సన్ భారత మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను అందుబాటులోకి తెస్తోంది. డిమాండ్కనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ ధృవీకరించింది.సెప్టెంబర్‌లో భారతదేశంలోని రాజస్థాన్‌లోని నీమ్రానాలోని వారి గార్డెన్ ఫ్యాక్టరీలో హార్లే-డేవిడ్సన్ X440 ఉత్పత్తిని ప్రారంభిస్తారు. బుకింగ్ తేదీల ఆధారంగా అక్టోబర్ 2023లో కస్టమర్ డెలివరీలు ప్రారంభమవుతాయి. కాగా హార్లే-డేవిడ్సన్ ఎక్స్ 440 సెగ్మెంట్లో అత్యంత సరసమైన బైక్‌గా చెప్పవచ్చు. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా హెచ్నెస్ CB350, బెనెల్లీ ఇంపీరియాలే 400 వంటి ఇతర ప్రసిద్ధ మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. -
ఈ బైక్ ధర తెలిస్తే ఎగిరి గంతేస్తారు? మరీ ఇంత తక్కువా!
Harley Davidson X440: భారతీయ మార్కెట్లో 'హార్లే డేవిడ్సన్' (Harley Davidson) బైకులు ఎంత ఖరీదైనవో అందరికి తెలుసు. అయితే ఇప్పుడు కంపెనీ కనీవినీ ఎరుగని రీతిలో చాలా తక్కువ ధరకే ఎక్స్440 (X440) బైక్ లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & వేరియంట్స్ హార్లే డేవిడ్సన్ ఎక్స్440 మొత్తం మూడు వేరియంట్లలో విడుదలైంది. అవి 'డెనిమ్, వివిడ్, ఎస్' వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ. 2.29 లక్షలు, రూ. 2.49 లక్షలు, రూ.2.69 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ బైక్ ధర ఎవర్ గ్రీన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కంటే కేవలం రూ. 35,000 ఎక్కువ. డిజైన్ & ఫీచర్స్ హార్లే డేవిడ్సన్ ఎక్స్440 డిజైన్ పరంగా చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. బేస్ వేరియంట్ వైర్-స్పోక్ రిమ్స్, మినిమల్ బ్యాడ్జింగ్ కలిగి ఉంటుంది. మిడ్ వేరియంట్ అల్లాయ్ వీల్స్ కలిగి డ్యూయల్-టోన్ పెయింట్ ఆప్షన్లతో వస్తుంది. చివరగా టాప్ వేరియంట్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, మెషిన్డ్ ఇంజన్ కూలింగ్ ఫిన్స్, 3D బ్యాడ్జింగ్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీతో కలర్ TFT డాష్, నావిగేషన్ మొదలైన వాటిని పొందుతుంది. (ఇదీ చదవండి: ఆస్తులమ్మినా ఈ ఒక్క వైన్ బాటిల్ కొనలేరు.. ధర ఎన్ని కోట్లంటే?) ఇంజిన్ వివరాలు ఎక్స్440 ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ 440 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి 6,000 rpm వద్ద 27 hp పవర్ & 4,000 rpm వద్ద 38 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ వంటివి ఇండియన్ రోడ్లకు సరిపోయే విధంగా ఉంటాయి. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) ప్రత్యర్థులు నిజానికి భారతీయ మార్కెట్లో హార్లే డేవిడ్సన్ ఇంత తక్కువ ధరకు ఎప్పుడు బైక్ చేయలేదు. కావున దేశీయ విఫణిలో తక్కువ ధరకు లభించే ఏకైన హార్లే డేవిడ్సన్ బైక్ ఎక్స్440 కావడం విశేషం. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైకుకి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. -
రూ. 3.93 లక్షలకే హ్యార్లీ డేవిడ్సన్ ఎక్స్350 బైక్
ప్రముఖ లగ్జరీ బైక్ మేకర్ హ్యార్లీ డేవిడ్సన్ ఎట్టకేలకు X350 మోటార్‌సైకిల్ విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ప్రస్తుతం కేవలం చైనా మార్కెట్లో మాత్రమే అమ్మకానికి ఉంటుంది. దీని ధర 33,388 యువాన్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 3.93 లక్షలు. చైనా మార్కెట్లో విజయం పొందిన తరువాత ఇండియా, బ్రెజిల్, థాయ్‌లాండ్ మార్కెట్లలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ బైక్ 353 సీసీ, ట్విన్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి 34 బిహెచ్పి పవర్, 31 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో హ్యార్లీ డేవిడ్సన్ బైకులు చెప్పుకోదగ్గవి. అయితే ఇప్పుడు విడుదలైన ఎక్స్350 తక్కువ ధరతో లభించే మొదటి బైక్ అవుతుంది. ఈ లేటెస్ట్ బైక్ ముందు వైపు 41 మిమీ యుఎస్డి ఫోర్క్స్, వెనుక వైపు మోనో షాక్, ట్రెల్లిస్ ఫ్రేమ్, ట్విన్ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్‌లు పొందుతుంది. (ఇదీ చదవండి: సింగిల్ ఛార్జ్.. 490 కి.మీ రేంజ్: కొత్త 'హ్యుందాయ్ కోన' వచ్చేస్తోంది) ఈ కొత్త బైక్ 13.5 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉండటం వల్ల లాంగ్ రైడింగ్‌కి కూడా అనుకూలంగా ఉంటుంది. ముందు, వెనుక వైపు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. అదే సమయంలో జాయ్‌ఫుల్ ఆరెంజ్, షైనింగ్ సిల్వర్, షాడో బ్లాక్ అనే మూడు కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. -
హ్యార్లీ డేవిడ్సన్ కొత్త బైకులు.. మునుపెన్నడూ చూడని కొత్త డిజైన్‌తో
పాపులర్ అమెరికన్ బైక్ తయారీ కంపెనీ హార్లే-డేవిడ్సన్, చైనీస్ దిగ్గజం కియాన్‌జియాంగ్ మోటార్‌సైకిల్‌తో ఏర్పరచుకున్న భాగస్వామ్యంతో తక్కువ సామర్థ్యం కలిగిన బైక్ మోడల్ అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలో భాగంగా పుట్టుకొచ్చిన X350 రేపు (మార్చి 10) మార్కెట్లో విడుదలకానుంది. హార్లే-డేవిడ్సన్ చైనీస్ మార్కెట్లో ఎక్స్350 బైకుతో పాటు, ఎక్స్500 బైకుని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ బైకులో (ఎక్స్500) ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఈ బైకుల్లో వి-ట్విన్ ఇంజిన్ లేకపోవడం గమనార్హం. దీని స్థానంలో లిక్విడ్-కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అమర్చారు. ఈ బైకుల డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది. నియో రెట్రో రోడ్‌స్టర్ స్టైలింగ్ ఇప్పుడు చూడవచ్చు. ఎల్ఈడీ లైటింగ్స్, యుఎస్డీ ఫోర్క్, ఆఫ్సెట్ మోనోషాక్ సెటప్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్ వంటివి అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా చిన్న డిజిటల్ ఇన్సెట్తో అనలాగ్ స్పీడోమీటర్ కూడా అందుబాటులో ఉంటుంది. రెండు బైక్‌లు హార్లే డేవిడ్సన్ అంతర్జాతీయ లైనప్‌లో జాబితా చేయబడ్డాయి. కావున భవిష్యత్తులో ఇతర దేశాల్లో కూడా విక్రయించబడే అవకాశం ఉంది, ప్రస్తుతం ఈ కొత్త బైకులు చైనీస్ మార్కెట్లో మాత్రమే విడుదలవుతాయి, భారతదేశంలో ఈ బైకుల లాంచ్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్..హీరో-హార్లే బైక్ వచ్చేస్తోంది
న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్, ప్రీమియం మోటర్‌సైకిల్స్ సంస్థ హార్లే–డేవిడ్సన్ సంయుక్తంగా రూపొందించే బైక్ రాబోయే రెండేళ్లలో మార్కెట్లోకి రానుంది. ప్రీమియం సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు హీరో దీన్ని ప్రవేశపెట్టనుంది. హీరో మోటోకార్ప్ సీఎఫ్‌వో నిరంజన్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. ప్రీమియం ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టం చేసుకుంటున్నామని, ఏటా ఈ విభాగంలో కొత్త మోడల్స్ ప్రవేశపెట్టనున్నామని ఆయన పేర్కొన్నారు. భారత మార్కెట్లో హార్లే–డేవిడ్సన్ వాహనలకు సంబంధించి 2020 అక్టోబర్‌లో ఇరు సంస్థలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం హార్లే–డేవిడ్సన్ బ్రాండ్ పేరిట హీరో మోటోకార్ప్ భారత్‌లో ప్రీమియం మోటర్‌సైకిళ్ల అభివృద్ధి, విక్రయాలు చేపట్టనుంది. అలాగే ఆయా బైక్‌లకు అవసరమైన సర్వీసింగ్, విడిభాగాల సరఫరా కూడా హీరో చేపట్టనుంది. 100–110సీసీ బడ్జెట్ బైక్‌ల విభాగంలో ఆధిపత్యం ఉన్న హీరో .. 160సీసీ ఆ పై విభాగాల్లోనూ అమ్మకాలను పెంచుకోవడం ద్వారా లాభదాయకతను మెరుగుపర్చుకునే యోచనలో ఉంది. గడిచిన కొద్ది త్రైమాసికాలుగా విడిభాగాలు, యాక్సెసరీలు, మర్చండైజ్ (పీఏఎం) వ్యాపార వృద్ధిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు గుప్తా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పీఏఎం వ్యాపార ఆదాయం 45 శాతం వృద్ధి చెంది రూ. 2,300 కోట్లుగా నమోదైనట్లు వివరించారు. -
దుమ్మురేపాడు.. నెటిజన్లచే చివాట్లు తిన్నాడు
న్యూఢిల్లీ: టీమిండియా యువ పేసర్ నవ్‌దీప్ సైనీ ట్విటర్ వేదికగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. తాజాగా అతను చేసిన ట్వీట్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. సైనీ.. తన హార్లీ డేవిడ్సన్ బైక్‌పై షర్ట్ లేకుండా కూర్చొని ఓ మట్టి రోడ్డులో దుమ్మురేపుతున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. భయాన్ని చూడాలంటే నాతో పాటు బైక్ మీద కూర్చోండి అంటూ క్యాప్షన్ జోడించాడు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఆ స్టంట్ చూసిన కొందరు సైనీని మెచ్చుకోగా మరికొందరు తీవ్రంగా దుయ్యబట్టారు. Accompany me on my bike to feel the fear @harleydavidson pic.twitter.com/iosa8wS2ya — Navdeep Saini (@navdeepsaini96) May 30, 2021 క్రికెటర్ అయి ఉండి ఇంత బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తావా? అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా.. కుర్రాళ్లు నిన్న ఆదర్శంగా తీసుకొని ప్రమాదాలు గురైతే బాధ్యులెవరని మరికొందరు మండిపడ్డారు. టీమిండియాకు ఎంపికై రెండేళ్లు కూడా కాలేదు.. కాస్త ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిదని మరికొందరు చివాట్లు పెట్టారు. మరికొందరు స్పందిస్తూ.. ఎవరైనా సాధారణ యువకులు ఇలా చేస్తే ఊరుకుంటారా?' అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. కాగా, కొందరు నెటిజన్లు మాత్రం స్టంట్ అదిరిపోయిందంటూ సైనీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అతని సిక్స్ ప్యాక్ బాడీ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, గతేడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన సైనీ.. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అతను.. అక్కడ కూడా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. తాజా ఇంగ్లండ్ పర్యటనలో కూడా సైనీకి మొండి చెయ్యే ఎదురైంది. చదవండి: టీమిండియా ఆ 42 రోజులు ఏం చేస్తుంది..? -
డ్డగ్...డ్డగ్...డ్ఢగ్.....రాయల్ ఎన్ఫీల్డ్!
‘దేవుడిని బైక్ ఇవ్వమని అడిగాను. ఇవ్వకపోయేసరికి బైక్ దొంగిలించి క్షమాపణ అడిగాను’ అన్నాడట ఒక దొంగ. ఆ దొంగగోల మనకెందుకుగానీ, యువ హృదయాలను కామ్‌గా, క్లాసిక్‌గా దోచుకోవడానికి మోటర్‌బైక్ కంపెనీలు కాంపిటీషన్‌కు కాలు దువ్వుతున్నాయి స్పోర్టీ, రేసింగ్, టూర్ బైక్ కావచ్చు. మోడ్రన్, క్లాసిక్ బైక్ కావచ్చు....ఇప్పుడు మోటర్ కంపెనీల ప్రధాన టార్గెట్ యూత్! రేస్ మొదలైంది.... పోటీ గురించి మాట్లాడుకునే ముందు పోటీ ఎవరితో, దాని బలం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. మోటర్‌బైక్ కంపెనీలు ‘సై’ మోటర్ సైకిల్స్‌ను ‘లైఫ్‌స్టైల్’గా మార్చిన ఘనత రాయల్ది. మిడిల్‌వెయిట్ మోటర్‌సైకిల్ సెగ్మెంట్లో లీడింగ్ ప్లేయర్ అయిన ‘రాయల్’ మెనేజ్మెంట్ స్కూళ్లలో ‘కేస్ స్టడీ’ అయింది. తిరుగులేని విజయానికి ఒక మోడల్‌గా నిలిచింది. ‘రాయల్’ ఏకచ్ఛత్రాధిపత్యానికి గండికొట్టడానికి దేశీయ,విదేశీ మోటర్‌బైక్ కంపెనీలు ‘సై’ అంటున్నాయి. రకరకాల ఎక్సైటింగ్ మోడల్స్‌తో ‘యూత్ టార్గెట్’గా బరిలోకి దిగాయి. దిగుతున్నాయి రాజకీయాల్లో వినిపించే ‘పొత్తులు’ ‘టై–అప్’లు మోటర్‌సైకిల్ సెగ్మెంట్లో కనిపిస్తున్నాయి. ఎడతెగని చర్చల తరువాత ప్రఖ్యాత అమెరికన్ మోటర్‌సైకిల్ తయారీదారు హార్లే–డెవిడ్సన్ లార్జెస్ట్ టు వీలర్ మేకర్ ‘హీరో మోటో కోర్ప్’తో ఒక అవగాహనకు వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ బలమైన కోటలోకి ప్రవేశించడానికి అప్రకటిత వ్యూహాలతో ముందుకు వస్తున్నాయి కంపెనీలు. లోకల్ పాట్నర్షిప్లతో బజాజ్–ట్రయంప్, హీరో–హార్లే, టీవిఎస్–నొర్టన్...మొదలైనవి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటి ఇవ్వనున్నాయి. టాక్టికల్ మూవ్లో భాగంగా కొన్ని కంపెనీలు ధరలను కాస్తో కూస్తో తగ్గిస్తూ యూత్‌ను ఎట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. రాయల్‌తో పోటీ పడేందుకు హోండా కంపెనీ ‘హైనెస్’ను ప్రవేశపెట్టింది. విదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ‘హోండా రెబెల్’ మోడల్‌తో దీన్ని రూపొందించారు. మిడ్‌సైజ్ మార్కెట్‌ను టార్గెట్‌గా చేసుకొని డిలక్స్, డిలక్స్ ప్రొ వెరియంట్లలో వచ్చిన ‘హైనెస్’ సార్మ్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ కలిగిన బైక్. ఇక బజాజ్–ట్రయంప్ జోడి 400 నుండి 800 సీసీ ఇంజన్ సామర్థ్యం ఉన్న మిడిల్ కెపాసిటీ మోటర్ సైకిల్స్‌ను అభివృద్ధి చేస్తుంది. దేశీయ మోటర్‌బైక్ తయారీ దిగ్గజం ‘మహీంద్ర అండ్ మహీంద్ర’ జావా బ్రాండ్‌ను యుద్దంలో సరికొత్త ఆయుధంగా చేసుకుంది. చెక్ రిపబ్లిక్ బ్రాండ్ ‘జావా’ హవా ఒకప్పుడు మనదేశంలో బాగానే నడిచిందికాని ఆ తరువాత ఆశించిన ఫలితాలు రాకపోడంతో జావగారిపోయి ఇండియన్ మార్కెట్ నుంచి జారిపోయింది. సినిమా ఇంటర్యూ్యలలో ఒక సంభాషణ తరచుగా వింటుంటాం... ‘ఇరవై సంవత్సరాల క్రితం మీరు తీసిన సినిమా చూశానండీ. ఇప్పటికీ కొత్తగా ఉందంటే నమ్మండి. మరి కమర్శియల్‌గా ఎందుకు సక్సెస్ కాలేదు!’ ‘చాలా అడ్వాన్స్డ్గా తీసిన సినిమా కావడం వల్లే సక్సెస్ కాలేదు. ఈ టైమ్‌లో తీసి ఉంటే కచ్చితంగా హిట్టు కొట్టి ఉండేది’ ఇది కాస్తో కూస్తో ఆనాటి ‘జావా’కు కూడా వర్తిస్తుంది. అందుకే మహీంద్ర ‘జావా’ బ్రాండ్‌ను దేశీయంగా సొంతం చేసుకుంది. కేటిఎం390 అడ్వెంచర్‌ను దృష్టిలో పెట్టుకొని రంగంలోకి దిగుతున్న బజాజ్–హిస్కివర్న మోడల్ డిజిటల్ ఇన్స్ట్ర్మెంట్ క్లస్టర్, ఆల్–లెడ్ లైటింగ్ సెటప్, వైర్–స్పోక్డ్ వీల్స్‌తో రోడ్ఫ్రెండ్లీ డిజైన్‌తో రూపొందించారు. ఐకానిక్ బీయండబ్ల్యూ ఆర్5 నుంచి టెక్నాలజీ, విజువల్ మోటర్‌సైకిల్ ఎసెన్షియల్స్‌ను స్ఫూర్తి పొంది రూపుదిద్దుకున్న ‘బీయండబ్ల్యూ ఆర్18 క్లాసిక్’లో రెయిన్, రోల్ అండ్ రాక్...ఎలాంటి రైడింగ్ కండిషన్స్‌లోనైనా ధైర్యం ఇచ్చే 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. స్టెప్డ్–అప్ సీట్, రైజ్డ్ విండ్‌స్క్రీన్, ఆల్–లెడ్ లైటింగ్ సెటప్, బ్లూటూత్–ఎనేబుల్డ్ టీఎఫ్టి ఇన్స్ట్ర్మెంట్ కన్సోల్...ఐ క్యాచింగ్ బాడీగ్రాఫిక్స్తో బరిలోకి దిగింది టీవిఎస్–అపాచీ ఆర్ఆర్ 310. అలయెన్స్‌లు, అవగాహనలు, టై–అప్లు, సృజనాత్మక ఆలోచనతో ఏ బండి ‘యూత్’ గుండెల్లో స్టాండవుతుందో వేచిచూద్దాం. -
ముచ్చటైన బండి.. సరదా తీర్చేనండి !
నాగపూర్: అత్యంత ఖరీదైన హార్లీ డేవిడ్సన్ బైక్ అంటే ముచ్చటపడని వారు ఉంటారా? ఒక్కసారైనా దానిపై కూర్చోవాలని ఆశ పడుతుంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే్డ సైతం ఆ ముచ్చట తీర్చుకున్నారు. నిత్యం విధి నిర్వహణలో తీరిక లేకుండా గడిపే ఆయన తన సొంత ఊరు మహారాష్ట్రలోని నాగపూర్‌లో హార్లీ డేవిడ్సన్ బైక్‌పై కాసేపు కూర్చొని సరదా పడ్డారు. సీవీఓ 2020 అనే ఈ లిమిటెడ్ ఎడిషన్ బండి భారతీయ జనతా పార్టీ నాయకుడు సోన్బా ముసాలే కుమారుడికి చెందినది. అయితే, యజమాని ఎవరనే విషయం జస్టిస్ బాబ్డేకు తెలియదు. నాగపూర్‌లోని ఓ వాహన డీలర్ ఈ బైక్‌ను జస్టిస్ బాబ్డేకు చూపేందుకు తీసుకొచ్చారు. తన పదవీ విరమణ తర్వాత ఇలాంటి బైక్‌ను కొనుక్కోవాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా జస్టిస్ బాబ్డే చెప్పారు. మోటార్ సైకిళ్లంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. -
లగ్జరీ బైక్‌పై చీఫ్ జస్టిస్; ఫోటోలు వైరల్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే బైక్‌పై చక్కర్లు కొడుతున్నారు. నాగ్‌పూర్‌లో లగ్జరీ బైక్ హార్లే డెవిడ్సన్పై రయ్ రయ్ అంటూ షికారు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పుడూ కేసులు, తీర్పులు అంటూ బిజీగా ఉండే చీఫ్ జస్టిస్ ఇలా కనిపించడంతో నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు. ‘ఎంత కూల్‌గా ఉన్నారు మై లార్డ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చీఫ్ జస్టిస్ మాస్క్ పెట్టుకోకపోవడాన్ని కొంతమంది ఆక్షేపించారు. ‘సార్.. హార్లే డేవిడ్సన్పై అడుగు పెట్టారు. వేగవంతమైన న్యాయం కోసమేనని ఆశిస్తున్నాం’ అంటూ పలువురు వ్యాఖ్యానించారు. కాగా, ఎస్ఏ బాబ్డేకు బైకులు నడపడం చాలా ఇష్టమని ఇంతకు ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన వద్ద ఓ బుల్లెట్ బైక్ కూడా ఉందని పేర్కొన్నారు. (‘ప్రధాని ప్రశంసించారు.. అది చాలు’) కాగా శరద్ అరవింద్ నవంబర్ 18, 2019న సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తన కెరీర్లో ఎన్నో కీలకమైన కేసుల్లో ఆయన పనిచేశారు. వివాదాస్పద అయోధ్య భూవివాదం కేసులో నవంబర్ 9,2019 నాటి తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు అయిదురుగు రాజ్యాంగ ధర్మాసనంలో అరవింద్ బాబ్డే ఒకరు. మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయి నేతృత్వం వహించిన ఇందులో జస్టిస్‌లు శరద్ అరవింద్ బాబ్డే, అశోక్ భూషణ్, డీవై చంద్రచూడ్, ఎస్ అబ్దుల్ నజీర్ సభ్యులుగా ఉన్నారు. వీటిలో ఢిల్లీ కాలుష్యం కూడా ఉంది. 2016లో దేశ రాజధాని చుట్టుపక్కలా పటాసుల అమ్మకాలను నిలిపివేస్తూ సుప్రీం తీర్పునిచ్చిన ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌లో ఆయన ఒకరు. ఇదిలా ఉండగా 2019లో బైక్‌ను టెస్ట్ రైడింగ్ చేస్తున్నప్పుడు బాబ్డే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇది హై-ఎండ్ హార్లే డేవిడ్సన్ బైక్ అని తెలుస్తోంది. అతను బైక్ మీద నుంచి పడటంతో అతని కాలుకు భారీగా దెబ్బ తగిలింది. ఈ ప్రమాదం అతన్ని కోర్టు విధులతో పాటు సుప్రీంకోర్టు కొలీజియం సమావేశాలకు దూరంగా ఉంచింది. (చైనాతో తాడోపేడో: సిలిండర్లు నిల్వ చేసుకోండి ) That's the Chief Justice of India on a weekend in Nagpur! Justice Bobde, My Lord 😃😃😃😃😃 pic.twitter.com/hYGlq2muUC — Payal Mehta/પાયલ મેહતા/ पायल मेहता/ পাযেল মেহতা (@payalmehta100) June 28, 2020 Chief Justice of India SA Bobde trying out Harley Davidson. (Harley Davidson Limited edition CVO 2020) @harleydavidson #SupremeCourt pic.twitter.com/6bDv0g4n2P — Bar & Bench (@barandbench) June 28, 2020 #ChiefJustice of India Justice Sharad Arvind Bobde can not hide his love for #motorbikes specially when he is in Nagpur . Last year Justice Bobde fell off while testing @harleydavidson which fractured his ankle . pic.twitter.com/01JuEkZpra — Pradeep Rai (@pradeepraiindia) June 29, 2020 -
ఇదేం బాదుడు..ఫేస్బుక్ స్టోరీ వైరల్
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన మోటారు వాహన చట్టం-2019 జనాలను బెంబేలెత్తిస్తోన్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ నూతన చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చట్టం పేరు చెప్పి సామాన్యుల జేబు గుల్ల చేస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోవడం లేదని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో నూతన చట్టం పేరు చెప్పి.. అధికారులు వాహనదారులను ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారో తెలిపే సంఘటన ఒకటి దేశ రాజధానిలో చోటు చేసుకుంది. రాఘవ్ స్వాతి పృథి అనే వ్యక్తి తన ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. రాఘవ్ స్వాతి పృథి కొద్ది రోజుల క్రితమే హార్లీ డేవిడ్సన్ రోడ్ గ్లైడ్ బైక్‌ని కొన్నాడు. ఈ బండి ప్రత్యేకత ఏంటంటే.. దీనిలో ఆడియో సిస్టం ఇన్‌బిల్ట్‌గానే వస్తుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన గురించి అతడి మాటల్లోనే.. ‘తిలక్ నగర్లో నేను నా బైక్‌పై తిరుగుతుండగా.. నా ఎదురుగా ఓ పోలీసు వాహనం వచ్చింది. అందులోంచి ఓ అధికారి దిగి నా బండిని ఆపమని చెప్పాడు. ఆ తర్వాత బండికి సంబంధించిన అన్ని పేపర్లు తీసుకుని నన్ను పోలీస్ స్టేషన్‌కు రమ్మన్నారు. బాధ్యత గల పౌరుడిగా నేను వారు చెప్పినట్లే చేశాను. పోలీస్ స్టేషన్‌లోనికి వెళ్లాక అధికారులు ఉన్నట్లుండి నా మీద అరవడం ప్రారంభించారు. బైక్‌లో లౌడ్ స్పీకర్లు పెట్టి రోడ్ల మీద తిరుగుతున్నావా అని ప్రశ్నిచారు. దాంతో నేను బైక్‌లో ఆడియో సిస్టం ఇన్‌బిల్ట్‌గా ఉంది. నేనేం మార్పులు చేయలేదు. ఇది బుల్లెట్ కాదు అని వివరించే ప్రయత్నం చేశాను. కానీ ఆ అధికారులు నా మాటలు పట్టించుకోలేదు. ఇది ఇల్లీగల్ బైక్.. దీన్ని నడపాలంటే పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. అప్పుడు నేను హార్లీ ఇండియా వెబ్సైట్లో బైక్‌కు సంబంధించిన వీడియో చూపించే ప్రయత్నం చేశాను. కానీ అది కూడా ఫలించలేదు. నన్ను చలానా కట్టాల్సిందిగా ఆదేశించారు’అన్నాడు. ‘ఇంతలో ఓ ట్రాఫిక్ అధికారి అక్కడకు వచ్చి సర్ ఈ బైక్‌కు అనుమతులున్నాయి. ఇది ఇల్లీగల్ కాదని నచ్చజేప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ అధికారులు అతడి మాట కూడా వినలేదు. చలానా కట్టాల్సిందే అన్నారు. నేను బండికి సంబంధించిన ప్రతి కాగితాన్ని వారికి చూపించాను. చలానా ఎందుకు కట్టాలని ప్రశ్నించాను. అందుకు వారు బైక్‌లో మ్యూజిక్ ప్లే చేసినందుకు అన్నారు. పోలీసులు నా బండి ఆపినప్పుడు నా బైక్‌లో నుంచి వస్తోన్న మ్యూజిక్ సౌండ్ కేవలం 30 శాతం మాత్రమే. దాంతో నేను బండిలో పెద్దగా మ్యూజిక్ ప్లే చేసి ఎవరికి ఇబ్బంది కలిగించలేదని స్పష్టం చేశాను. అప్పుడు అధికారులు నా బైక్ సౌండ్ పూర్తిగా పెంచి వీడియో తీసి ఇప్పుడు చలానా కట్టు అని ఆదేశించారు. నా బైక్‌కు సంబంధించి అన్ని పన్నులు చెల్లించాను. ట్రాన్స్‌పోర్టు డిపార్ట్మెంట్ వారి నిబంధనల మేరకు అన్ని కాగితాలను చూపించడమే కాక.. అన్ని ట్రాఫిక్ నియమాలను పాటించాను. అయినా పోలీసులు నన్ను చలానా కట్టాలని ఆదేశించారు’ అంటూ వాపోయాడు రాఘవ్. ‘నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా.. మీరే చెప్పండి. ఏ నేరం చేయని నన్ను రెండు గంటల పాటు ఎండలో నిల్చోబెట్టి.. అమర్యాదగా ప్రవిర్తంచారు. ఇదెక్కడి న్యాయం. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్న అంటే.. ఈ రోజు నాకు జరిగింది.. రేపు మీకు జరగవచ్చు. మనం ఒకిరికొకరం మద్దతిచ్చుకుని.. ఈ అన్యాయాన్ని ఎదిరించాల’ని చెప్పుకొచ్చాడు రాఘవ్. ప్రస్తుతం ఈ పోస్ట్ ఫేస్బుక్లో తెగ వైరలవుతోంది. భారీ సంఖ్యలో నెటిజనులు రాఘవ్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరి దీనిపై రవాణా శాఖ ఉన్నతాధికారులతో పాటు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. -
7 వేలు ఇచ్చి.. 7 లక్షల బైక్ కొట్టేశాడు!
హరియానా : బైక్ కొంటానని చెప్పి కొంత సొమ్ము అడ్వాన్స్ కూడా ఇచ్చాడు...టెస్ట్ రైడ్ చేస్తానని అడిగాడు. సరేలే ఎలాను అడ్వాన్స్ ఇచ్చాడు కదా అని టెస్ట్ రైడ్‌కు ఒప్పుకున్నాడు బైక్ యజమాని. టెస్ట్ రైడ్‌కని చెప్పి వెళ్లిన వాడు ఎంతకూ తిరిగి రాలేదు. దాంతో తాను మోసపోయానని తెలుసుకున్న బైక్ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. వివరాల ప్రకారం...గుర్గావ్కు చెందిన అజయ్ సింగ్ తన హార్లీ డేవిడ్సన్ బైక్‌ను విక్రయించాలనుకుని, అమ్మకాలు - కొనుగోళ్లు జరిపే ఒక ఆన్లైన్ సైట్లో ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసిన ఒక అపరిచిత వ్యక్తి అజయ్ సింగ్‌కు ఫోన్ చేసి తనను తాను ఆగ్రా రాహుల్ నగర్‌కు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. తాను మార్బుల్ బిజినెస్ చేస్తున్నానని, ఆన్లైన్ సైట్లో పెట్టిన హార్లీ డేవిడ్సన్ బైక్‌ను కొనాలనుకుంటున్నానని తెలిపాడు. అజయ్ సింగ్‌కు ఫోన్ చేసిన ప్రతి సారి మోటార్ బైక్‌ల గురించి బాగా తెలిసిన నిపుణుడిగా మాట్లాడేవాడు. అలా అతనిపై ఏ మాత్రం అనుమానం రాకుండా.. అజయ్‌సింగ్‌ను బుట్టలో వేసుకున్నాడు. ఏడు వేల రూపాయలు అడ్వాన్స్ కూడా చెల్లించాడు. అడ్వాన్స్ చెల్లించిన తర్వాత ఒకసారి బైక్‌ను స్వయంగా పరిశీలిస్తానని కోరాడు. అజయ్ సింగ్ అందుకు ఒప్పుకుని ఆ వ్యక్తిని గుర్గావ్లో ఉన్న హార్లీ డేవిడ్సన్ షోరూం వద్దకు రమ్మని చెప్పాడు. ఆ వ్యక్తి అజయ్ సింగ్‌ను కలిసిన తర్వాత ఇద్దరూ కాసేపు చర్చించుకుని బైక్ ఖరీదును 7 లక్షల రూపాయలుగా నిర్ణయించుకున్నారు. డబ్బు చెల్లించడానికి కంటే ముందు తాను ఒక సారి బైక్‌ను టెస్ట్ రైడ్ చేస్తానని అజయ్ సింగ్‌ను అడిగాడు. అందుకు అజయ్ సింగ్ ఒప్పుకుని బైక్ తాళాలను ఆ వ్యక్తికి ఇచ్చాడు. టెస్ట్ రైడ్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి ఎంతకి రాకపోయేసరికి అజయ్ సింగ్ అతని నంబర్‌కు కాల్ చేశాడు. కానీ ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది. దాంతో తాను మోసపోయానని తెలుసుకున్న అజయ్ సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. అజయ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు షోరూమ్ సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు. -
ప్రపంచంలోనే ఖరీదైన బైక్! కానీ..
భూగోళం మీద ఇప్పటిదాకా తయారుచేసినవాటిలో అత్యంత ఖరీదైన బైక్ ఇది. ధర మన కరెన్సీలో అక్షరాల 12కోట్ల రూపాయలు! ‘వజ్రవైఢూర్యములు పొదగబడిన కంఠాభరణములు... రత్నమాణిక్యములు కూర్చబడిన కంకణములు...’ అంటూ బ్రహ్మీ చెప్పిన డైలాగ్ తరహాలో ఈ బైక్‌కు.. 350 వజ్రాలు, బంగారు రేకులు, విలువైన రంగురాళ్లు తదితర హంగులన్నీ అద్దారు. ఈ అరుదైన సృష్టి మరెవరిదోకాదు.. ప్రఖ్యాత హార్లే డేవిడ్సన్ కంపెనీదే. సరే, బైక్ అంటే ప్రాణమించ్చే కొందరు.. రిస్క్ చేసైనా దీన్ని సొంతం చేసుకోవాలనుకుంటారు. కానీ అది సాధ్యమయ్యే పనికాదు. ఎందుకంటే.. హార్లే డేవిడ్సన్ బ్లూ ఎడిషన్ అనే పేరుతో రూపొందిన ఈ మోడల్‌ను.. ప్రఖ్యాత చేతి గడియారాల కంపెనీ ‘బుకెరర్’ ప్రత్యేకంగా తయారుచేయించింది. ఖరీదైన గడియారాలు రూపొందించే బుకెరర్.. అతిత్వరలోనే సరికొత్త వాచ్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఆ వాచ్ ప్రమోషన్ కోసం ఏకంగా బైక్‌ను వాడేసుకుందిలా. అఫ్కోర్స్, హార్లే డేవిడ్సన్ కంపెనీ కూడా తన ఖ్యాతికి తగ్గట్లుగా బ్లూ ఎడిషన్‌ను అత్యద్భుతంగా తయారుచేసిందనుకోండి. ఎప్పటికీ (రోడ్డుమీదికి) మార్కెట్లోకి రాదన్నమాటేగానీ.. ఆ ఠీవీ, లుక్కు సూపర్ కదా! (వీడియో కింద ఫొటో గ్యాలరీ చూడండి) -
ప్రపంచంలోనే ఖరీదైన బైక్.. ధర 12కోట్లు
-
వాణిజ్య యుద్ధ మేఘాలు!!
(సాక్షి, బిజినెస్ విభాగం):భారత్‌కు ఎగుమతి అవుతున్న హార్లీ డేవిడ్సన్ బైక్‌ల గురించి... సరిగ్గా నెల రోజుల కిందట వైట్ హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ‘‘ఈ మధ్యే ఒక దేశ ప్రధాన మంత్రి నాకు ఫోన్ చేసి.. మీ దేశం నుంచి దిగుమతి అవుతున్న హార్లీ డేవిడ్సన్ బైక్‌లపై సుంకాన్ని 100 శాతం నుంచి 50 శాతానికి తగ్గిస్తున్నామని చాలా గొప్పగా చెప్పారు. నిజంగా ఆయన గొప్ప వ్యక్తి. కాకపోతే, ఇక్కడ అమెరికాకు చేసిన మేలు ఏంటో నాకు అర్ధం కాలేదు. సుంకం తగ్గిస్తే మాకేంటి లాభం? ఇంకా మా కంపెనీల నుంచి 50 శాతం సుంకాన్ని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు కదా!!. దీనికి ప్రతీకారం తప్పదు’’ అంటూ ట్రంప్ కుండ బద్దలు కొట్టారు. చాలా దేశాలు అమెరికా ఎగుమతులపై భారీ సుంకాలు రాబడుతున్నాయని, తాము మాత్రం విదేశీ దిగుమతులకు ప్రోత్సాహకాల పేరుతో చాలా కోల్పోయామని నిప్పులు చెరిగారు. చైనా, భారత్‌లే కాదు... ఇక తమపై సుంకాలు విధిస్తున్న ఏ దేశాన్నీ వదలబోమంటూ వాణిజ్య యుద్ధానికి సంకేతాలిచ్చారు. ముందుగా తమ దేశంలోకి దిగుమతి అవుతున్న ఉక్కు ఉత్పత్తులపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం చొప్పున సుంకాలు విధిస్తూ ఆదేశాలు జారీచేసి ప్రపంచానికి షాక్ ఇచ్చారు. దీనితర్వాత ఇప్పుడు నేరుగా చైనా నుంచి దిగుమతి అయ్యే 60 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించడంతో పోరు తీవ్రమయింది. చైనా కూడా తక్షణం ప్రతీకార సుంకాలతో దూకింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య రేగిన ఈ చిచ్చు... ఇతర దేశాలను వణికిస్తోంది. చినికిచినికి గాలివానగా మారి తమనెక్కడ ముంచేస్తుందోనన్నది ఇతర దేశాల భయం. వాణిజ్య యుద్ధం అంటే..? ఒక దేశ వాణిజ్య ప్రయోజనాలను మరో దేశం దెబ్బతీయడాన్నే వాణిజ్య యుద్ధంగా చెప్పొచ్చు. యుద్ధాల్లో క్షిపణుల మాదిరే ఈ వాణిజ్య యుద్ధంలో ‘సుంకాల్ని’ ప్రయోగిస్తారు. ఇక్కడ అమెరికానే తీసుకుంటే... ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకం విధించడం వల్ల ఇప్పటివరకూ ఆ దేశానికి ఎగుమతులు చేస్తున్న చైనా, జపాన్, జర్మనీ, భారత్ ఇతరత్రా దేశాలపై భారం పడుతుంది. ఆయా దేశాల కంపెనీల లాభాలు హరించుకుపోతాయి. ఇతర మార్కెట్లను వెతుక్కోవాల్సి వస్తుంది. దీనికి ప్రతిగా ఇతర దేశాలు కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు విధిస్తాయి. వాణిజ్యం తీవ్రంగా దెబ్బతిని.. ఉద్యోగాల కోతలు... ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యే పరిస్థితికి దారితీస్తుంది. చైనాపై ఎందుకీ మంట...! ప్రపంచ వాణిజ్య మండలిలో (డబ్ల్యూటీఓ) సభ్యత్వం ఉన్న దేశాలు ఇష్టానుసారం మరో దేశంపై సుంకాలు వేయటానికి వీల్లేదు. అయితే, తయారీ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న చైనా... చౌక ఉత్పత్తులతో ఇతర దేశాల్ని ముంచేస్తోంది. దీంతో పలు దేశాలు యాంటీ డంపింగ్ సుంకాన్ని విధిస్తున్నాయి. దీనిపై చైనా డబ్ల్యూటీఓలో రచ్చ చేయడం వల్ల కొన్ని దేశాలు వెనక్కితగ్గాయి. ఇప్పుడు ట్రంప్ తమ వ్యాపార అవకాశాలు, ఉద్యోగాలను ఇతర దేశాలు తన్నుకుపోతున్నాయంటూ డబ్ల్యూటీఓ నుంచి వైదొలగుతామని కూడా హెచ్చరించడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. చైనాతో తమ వాణిజ్య లోటు 375 బిలియన్ డాలర్లకు పెరిగిపోయిందని.. దీనివల్ల ఏకంగా అమెరికాలో కల్పించాల్సిన 20 లక్షలకుపైగా ఉద్యోగాలను చైనా తన్నుకుపోయిందని ట్రంప్ సర్కారు దుమ్మెత్తిపోస్తోంది. వాణిజ్య బంధాల వల్ల అమెరికాకంటే చైనాయే అత్యధికంగా లబ్ధి పొందిందని లెక్కలతో సహా వివరించింది. డబ్ల్యూటీఓలో 2001లో చైనా చేరినప్పుడు ఆ దేశ జీడీపీ 1 ట్రిలియన్ డాలర్లు కాగా... ఇపుడది 12 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మరోపక్క, తమ ఆర్థిక వ్యవస్థ (ప్రస్తుతం 18 ట్రిలియన్ డాలర్లు) బలహీన పడిందని అమెరికా చెబుతోంది. కొన్నేళ్ల క్రితం 3.5 శాతం వృద్ధి రేటుండగా.. ఇపుడది 2 శాతానికి దిగజారిందని చైనాపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీనికి తోడు ఎన్నికల్లో ఇచ్చిన భారీ ఉద్యోగాల హామీ కూడా ఈ వాణిజ్య యుద్ధానికి ట్రంప్‌ను తెరతీసేలా చేసింది. సుంకాలు ఒక్కటే కాదు.. ప్రపంచ వాణిజ్యంలో అమెరికా, చైనాలదే అత్యధిక వాటా. కానీ ట్రంప్ చైనాతో పాటు అమెరికాకు అత్యధికంగా ఎగుమతులు చేసే యూరప్ దేశాలనూ లక్ష్యంగా చేసుకున్నారు. తమ సుంకాలకు ప్రతిగా యూరప్ దేశాలు గనుక సుంకాలు విధిస్తే... అక్కడి ఆటోమొబైల్ పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేస్తామని బెదిరించారు కూడా. ఎందుకంటే ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ ఇతరత్రా అనేక దిగ్గజ వాహన కంపెనీలకు అమెరికా అతిపెద్ద మార్కెట్. సుంకాలు విధిస్తే వాటి వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటాయి. దీనివల్ల ఆయా దేశాల్లో ఉద్యోగాలకు ముప్పు ఖాయం. సుంకాలతో పాటు ఇతర దేశాల వ్యాపార సంస్థలపైనా ట్రంప్ నేరుగా గురిపెట్టారు. ఇటీవలే అమెరికన్ చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్‌ను సింగపూర్‌కు చెందిన బ్రాడ్‌కామ్ కొనుగోలు చేసేందుకు సంబంధించిన ఒప్పందాన్ని ట్రంప్ అడ్డుకున్నారు. ఇదీ వాణిజ్య యుద్ధమే. దీనికి భద్రతపరమైన కారణాలను ట్రంప్ తెరపైకి తెచ్చారు. ఈ డీల్ విలువ 117 బిలియన్ డాలర్లు. ట్రంప్ దెబ్బతో ఒప్పందాన్ని ఇరు సంస్థలూ విరమించుకోవాల్సి వచ్చింది. ఈ డీల్ కుదిరితే చైనా టెలికం దిగ్గజంహువావేకు భారీగా లబ్ధి చేకూరుతుందనేది అమెరికా భయం. ఇకపై ఏం జరగొచ్చు? వాణిజ్య యుద్ధంలో విజేతలెవరూ ఉండరని.. క్షతగాత్రులే మిగులుతారనేది ప్రపంచ ఆర్థిక వేత్తల మాట. డబ్ల్యూటీఓలో ప్రధాన సభ్యులు యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్‌లు తామూ అమెరికా సుంకాలపై ప్రతిదాడి చేస్తామని చెప్పాయి. ట్రంప్ మొండి వైఖరికి ప్రతిగా ఇతర దేశాలూ ప్రతీకారానికి దిగితే మున్ముందు ఈ సమస్య తీవ్రమవుతుందని డబ్ల్యూటీఓ చీఫ్ రాబర్ట్ అజెవెడో హెచ్చరించారు. కాగా, వాణిజ్య యుద్ధానికి వెనుకాడబోమన్న చైనా కూడా 3 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై తాజాగా సుంకాన్ని విధించింది. మరోవంక ట్రంప్ ఇప్పుడు చేస్తున్నది ఆరంభమేనని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలోకి దిగుమతయ్యే యురేనియంపైనా సుంకాల పోటు ఉండొచ్చని భావిస్తున్నారు. చైనా కూడా అమెరికాపై మున్ముందు మరిన్ని ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. 2015లో అమెరికా కంపెనీ బోయింగ్‌తో చైనా ఎయిర్‌లైన్స్ కుదుర్చుకున్న 38 బిలియన్ డాలర్ల విమానాల కొనుగోలు ఆర్డర్లను రద్దు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా, వ్యవసాయం, టెక్నాలజీ ఇతరత్రా కీలక రంగాలకు చెందిన అమెరికా దిగుమతులపైనా చైనా సుంకాల మోత మోగిస్తుందనేది పరిశీలకుల అభిప్రాయం. భారత్‌పై ప్రభావం ఏంటి? అమెరికా సుంకాల ప్రభావం భారత్‌పై తక్కువే కానీ... అన్ని దేశాలూ అమెరికా పాటే పాడితే కచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థకు దెబ్బే. ఇప్పుడు భారత్ స్టీల్ ఎగుమతుల్లో అమెరికాకు వెళ్తున్నవి 2 శాతమే. అల్యూమినియం ఎగుమతులూ నామమాత్రమే. అయితే, ట్రంప్ సుంకాల ప్రకటన తర్వాత భారత్ లోహ కంపెనీల షేర్లు తీవ్ర కుదుపులకు గురవుతున్నాయి. ఇక ఎగుమతిదారులకు భారత్ అనేక సబ్సిడీ పథకాలను ఇస్తోందని.. ఇది పోటీతత్వాన్ని దెబ్బతీయడమేనని డబ్ల్యూటీఓకు కూడా అమెరికా ఫిర్యాదు చేసింది. ఐటీ ఇతరత్రా సేవల్లో అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాలాంటి అగ్రరాజ్యంతో తలపడితే భారత్‌కు తలనొప్పులు ఖాయం. అందుకే ఈ సుంకాలపై భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇక చైనాపై అమెరికా సుంకాల వల్ల మన కంపెనీలకు కొంత మేలు జరగొచ్చనేది నిపుణుల మాట. అయితే, భవిష్యత్తులో భారత్‌కూ ఇలాంటి చిక్కులొస్తే పరిస్థితి ఏంటన్నది మన వ్యాపార సంస్థలకు గుబులు పుట్టిస్తోంది. -
హార్లీ డేవిడ్సన్ బైక్ దొంగ దొరికాడు..
హైదరాబాద్ : ట్రయిల్ రన్ అంటూ ఖరీదైన ..హార్లీ డేవిడ్సన్ బైక్‌తో ఉడాయించిన దొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. అతడిని ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు ఓఎన్జీసీలో సబ్ మెరైన్ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. అతడిని ముంబై నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ సాగర్ సొసైటీ చౌరస్తాలో ఉన్న హార్లీ డేవిడ్సన్ షోరూంకు మంగళవారం ఆధునిక దుస్తుల్లో వచ్చిన ఓ యువకుడు ....టెస్ట్ డ్రైవ్ అంటూ ఆ బైక్‌తో పరారైన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-23లో తన నివాసమని పేరు సయ్యద్ తాహెర్ అని పరిచయం చేసుకున్న ఆ యువకుడు కొత్తగా వచ్చిన రూ.6 లక్షల విలువైన హార్లే డేవిడ్సన్ స్ట్రీట్-750 మోడల్ బైక్ కావాలంటూ బేరమాడాడు. తనతోపాటు తెచ్చిన క్రెడిట్ కార్డులను చూపించాడు. ట్రయల్ వేస్తానని బైక్‌తో బయటకు వెళ్లిన తాహెర్ మూడు గంటలు గడిచినా తిరిగి రాకపోయేసరికి అనుమానం వచ్చిన షోరూం నిర్వాహకులు అతడు ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో షోరూం మేనేజర్ షీలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు...నాలుగు బృందాలుగా ఏర్పడి బైక్ దొంగను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో కేఈ బంధువుకు తీవ్ర గాయాలు
కర్నూలు : కర్నూలు జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సమీప బంధువు అయిన నందీష్గౌడ్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. రూ.18 లక్షల విలువజేసే హార్లే డేవిడ్సన్ బైక్‌పై నందీష్ డోన్ నుంచి కర్నూలుకు వెళ్తుండగా వెల్దుర్తి సమీపంలో అదుపుతప్పి పడిపోయినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో అతని కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కాగా..సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా శుక్రవారం వెల్దుర్తి ప్రాంతంలోనే కేఈ కృష్ణమూర్తి కార్యక్రమం కూడా ఉండడం గమనార్హం. -
ఇక ఇండియాలోనే పూర్తి అసెంబ్లింగ్
-
ముచ్చట తీర్చుకున్న ధోని
-
ధోనిచెంతకు చేరిన ‘హార్లీ’!
రాంచీ: కెప్టెన్ ధోనికి ప్రియాతి ప్రియమైన బైక్ హార్లీ డేవిడ్సన్ తిరిగి అతని చెంతకు చేరింది. బైక్‌లంటే పడిచచ్చే ధోని ఇష్టంగా కొనుక్కున్న హార్లీ.. కొన్నాళ్ల క్రితం రిపేర్‌కు రావడంతో కోల్‌కతాలోని ఓ షెడ్డుకు పంపించాడు. మెకానిక్ దాన్ని బాగు చేసినా.. బిజీ క్రికెట్ షెడ్యూలు కారణంగా దాన్ని తిరిగి తెచ్చుకునే సమయం ధోనికి లేకపోయిందట. తాజాగా గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరం కావడంతో తగినంత సమయం దొరికింది. వెంటనే హార్లీ బైక్‌ను తెప్పించేసుకుని రాంచీలో చక్కర్లు కొడుతున్నాడు