
ధోనిచెంతకు చేరిన ‘హార్లీ’!
రాంచీ: కెప్టెన్ ధోనికి ప్రియాతి ప్రియమైన బైక్ హార్లీ డేవిడ్‌సన్ తిరిగి అతని చెంతకు చేరింది. బైక్‌లంటే పడిచచ్చే ధోని ఇష్టంగా కొనుక్కున్న హార్లీ.. కొన్నాళ్ల క్రితం రిపేర్‌కు రావడంతో కోల్‌కతాలోని ఓ షెడ్డుకు పంపించాడు.
మెకానిక్ దాన్ని బాగు చేసినా.. బిజీ క్రికెట్ షెడ్యూలు కారణంగా దాన్ని తిరిగి తెచ్చుకునే సమయం ధోనికి లేకపోయిందట. తాజాగా గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరం కావడంతో తగినంత సమయం దొరికింది. వెంటనే హార్లీ బైక్‌ను తెప్పించేసుకుని రాంచీలో చక్కర్లు కొడుతున్నాడు