కోల్‌కతా: స్టూడెంట్‌ను పెళ్లాడిన మహిళా ప్రొఫెసర్ ఘటనలో ట్విస్ట్. క్లాస్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న మహిళా ప్రొఫెసర్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ యాజమానికి మెయిల్ పంపారు. యాజమాన్యం తీసుకునే నిర్ణయంపై ప్రొఫెసర్ భవిష్యత్ ఆధారపడడం చర్చాంశనీయంగా మారింది
పశ్చిమ బెంగాల్ నదియాలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీకి చెందిన హరిన్‌ఘటా టెక్నాలజీలో పాయల్ బెనర్జీ సైకాలజీ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రొఫెసర్ పాయల్ బెనర్జీ క్లాస్ రూంలోనే తన క్లాస్ విద్యారిని వివాహం చేసుకున్నారు. వివాహ తంతు ఎలా జరిగిందో అచ్చం విద్యార్థి, ప్రొఫెసర్‌ల ఉత్తుత్తి పెళ్లి అలాగే జరిగింది. అయితే ఆ పెళ్లి తంతులో ప్రొఫెసర్ పెళ్లి ఘట్టాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ నోటా ఈ నోటా చేరింది. చివరికి సైకాలజీ ప్రొఫెసర్ పాయల్ బెనర్జీపై చర్యలు తీసుకునే దాకా వెళ్లింది. పెళ్లితంతుపై యూనివర్సిటీ యాజమాన్యం విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగా సైకోడ్రామా ప్రాజెక్ట్‌లో భాగంగా తాము ఓ నాటకం ఆడామని, నాటకంలో భాగంగా ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నామని, అది నిజమైన పెళ్లి కాదని వివరణ ఇచ్చారు. దీనిని విద్యార్థులు,యూనివర్సిటీ సమ్మతితో ప్రదర్శించినట్లు చెప్పారు.
A lady Professor in MAKAUT is 'getting married' to her young student in the office. pic.twitter.com/coXaVGH7s7
— Abir Ghoshal (@abirghoshal) January 29, 2025
తన కెరీర్‌ను దెబ్బతీయడానికి, కించపరచడానికి ఉద్దేశపూర్వకంగా ఓ సహోద్యోగి నాటకంలోని ఒక భాగాన్ని లీక్ చేశారని ఆరోపించారు. అనంతరం బెనర్జీని సెలవుపై సాగనంపింది.
ఉత్తుత్తి పెళ్లి ఘటన జరిగిన నాటి నుంచి సెలవులో ఉన్న ప్రొఫెసర్ బెనర్జీ తాజాగా యాజమాన్యానికి తన రాజీనామా లేఖ పంపారు. అందులో, ‘నేను చేసుకుంది ఉత్తుత్తి పెళ్లే. కానీ దీనిపై నానా రాద్ధాంతం చేస్తున్నారు. సైకలాజికల్ డ్రామాలో భాగంగా క్లాస్ విద్యార్ధిని వివాహం చేసుకున్నాం. ఈ ఉత్తుత్తి పెళ్లి గురించి యాజమాన్యం నుంచి అనుమతి తీసుకున్నా. అయినా సరే నేనంటే గిట్టని వాళ్లే ఆ పెళ్లి వీడియోల్ని అడ్డం పెట్టుకుని నా పరువు, ప్రతిష్టను మంటగలుపుతున్నారు. వారి వల్ల నేను మానసిక ప్రశాంతను కోల్పోయా. విద్యార్థి పెళ్లి చేసుకుని తప్పు చేశా. ఇక నేను ప్రొఫెసర్‌గా కొనసాగలేను. నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పార్థ ప్రతిమ్ లాహిరి తెలిపారు. ఆమె లేఖపై తుది నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు ప్రొఫెసర్ సెలవులో కొనసాగుతారని చెప్పారు.
ఇక విద్యార్థిని ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న ఘటనపై యూనివర్సిటీ ఐదుగురు సభ్యుల విచారణ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. మహిళా ప్యాకల్టీ ప్యానెల్ తన విచారణలో ప్రొఫెసర్ పాయల్ బెనర్జీ వాదనల్ని ఖండించినట్లు యూనివర్సిటీ అధికారి ఒకరు తెలిపారు.
అదే సమయంలో ఫ్రెషర్స్‌కు స్వాగతం చెప్పేందుకు చేసిన స్కిట్ తప్ప మరొకటి కాదు. అందులో తప్పులు వెతకడం సరైంది కాదని వైస్ ఛాన్సలర్ తపష్ చక్రవర్తి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment