ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ నిరసన హింసాత్మంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ నిరసనల్లో అరెస్టైన ‘పశ్చిమ్ బంగా ఛత్ర సమాజ్’ సంస్థ విద్యార్థి నాయకుడికి ఇటీవల కోల్‌కతా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ.. బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కోట్టివేసింది.
ఈ క్రమంలో బెంగాల్ ప్రభుత్వ తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. కేవలం ఒక్క సయన్ లాహిరినే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించింది. ‘‘ ఇది బెయిల్ ఇచ్చే కేసు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలా? వద్దా? అనే విషయంలో విద్యార్థి నేత తల్లి దాఖలు చేసిన పిటిషన్‌లో హైకోర్టు తెలిపింది’ అని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని సుప్రీం కోర్టు పేర్కొంది.
‘‘చలో సెక్రటేరియట్’’ మార్చ్ నిర్వహించిన రోజు రాత్రి ఛత్ర సమాజ్ నిర్వాహకుల్లో ఒకరైన సయన్ లాహిరిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయన తల్లి కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీనిపై బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment