ప్రముఖ లగ్జరీ బైక్ మేకర్ హ్యార్లీ డేవిడ్‌సన్ ఎట్టకేలకు X350 మోటార్‌సైకిల్ విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ప్రస్తుతం కేవలం చైనా మార్కెట్లో మాత్రమే అమ్మకానికి ఉంటుంది. దీని ధర 33,388 యువాన్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 3.93 లక్షలు.
చైనా మార్కెట్లో విజయం పొందిన తరువాత ఇండియా, బ్రెజిల్, థాయ్‌లాండ్ మార్కెట్లలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ బైక్ 353 సీసీ, ట్విన్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి 34 బిహెచ్‌పి పవర్, 31 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో హ్యార్లీ డేవిడ్‌సన్ బైకులు చెప్పుకోదగ్గవి. అయితే ఇప్పుడు విడుదలైన ఎక్స్350 తక్కువ ధరతో లభించే మొదటి బైక్ అవుతుంది. ఈ లేటెస్ట్ బైక్ ముందు వైపు 41 మిమీ యుఎస్‌డి ఫోర్క్స్, వెనుక వైపు మోనో షాక్, ట్రెల్లిస్ ఫ్రేమ్, ట్విన్ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్‌లు పొందుతుంది.
(ఇదీ చదవండి: సింగిల్ ఛార్జ్.. 490 కి.మీ రేంజ్: కొత్త 'హ్యుందాయ్ కోన' వచ్చేస్తోంది)
ఈ కొత్త బైక్ 13.5 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉండటం వల్ల లాంగ్ రైడింగ్‌కి కూడా అనుకూలంగా ఉంటుంది. ముందు, వెనుక వైపు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. అదే సమయంలో జాయ్‌ఫుల్ ఆరెంజ్, షైనింగ్ సిల్వర్, షాడో బ్లాక్ అనే మూడు కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment