ముచ్చటైన బండి.. సరదా తీర్చేనండి ! | Justice Bobde Rides Harley Davidson Bike In Nagpur | Sakshi
Sakshi News home page

ముచ్చటైన బండి.. సరదా తీర్చేనండి !

Published Tue, Jun 30 2020 6:21 AM | Last Updated on Tue, Jun 30 2020 6:21 AM

Justice Bobde Rides Harley Davidson Bike In Nagpur - Sakshi

నాగపూర్‌: అత్యంత ఖరీదైన హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌ అంటే ముచ్చటపడని వారు ఉంటారా? ఒక్కసారైనా దానిపై కూర్చోవాలని ఆశ పడుతుంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే్డ సైతం ఆ ముచ్చట తీర్చుకున్నారు. నిత్యం విధి నిర్వహణలో తీరిక లేకుండా గడిపే ఆయన తన సొంత ఊరు మహారాష్ట్రలోని నాగపూర్‌లో హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌పై కాసేపు కూర్చొని సరదా పడ్డారు. సీవీఓ 2020 అనే ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ బండి భారతీయ జనతా పార్టీ నాయకుడు సోన్బా ముసాలే కుమారుడికి చెందినది. అయితే, యజమాని ఎవరనే విషయం జస్టిస్‌ బాబ్డేకు తెలియదు. నాగపూర్‌లోని ఓ వాహన డీలర్‌ ఈ బైక్‌ను జస్టిస్‌ బాబ్డేకు చూపేందుకు తీసుకొచ్చారు. తన పదవీ విరమణ తర్వాత ఇలాంటి బైక్‌ను కొనుక్కోవాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా జస్టిస్‌ బాబ్డే చెప్పారు. మోటార్‌ సైకిళ్లంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement