కర్నూలు : కర్నూలు జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సమీప బంధువు అయిన నందీష్‌గౌడ్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. రూ.18 లక్షల విలువజేసే హార్లే డేవిడ్సన్ బైక్‌పై నందీష్ డోన్ నుంచి కర్నూలుకు వెళ్తుండగా వెల్దుర్తి సమీపంలో అదుపుతప్పి పడిపోయినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో అతని కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కాగా..సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా శుక్రవారం వెల్దుర్తి ప్రాంతంలోనే కేఈ కృష్ణమూర్తి కార్యక్రమం కూడా ఉండడం గమనార్హం.