భూగోళం మీద ఇప్పటిదాకా తయారుచేసినవాటిలో అత్యంత ఖరీదైన బైక్ ఇది. ధర మన కరెన్సీలో అక్షరాల 12 కోట్ల రూపాయలు! ‘వజ్రవైఢూర్యములు పొదగబడిన కంఠాభరణములు... రత్నమాణిక్యములు కూర్చబడిన కంకణములు...’ అంటూ బ్రహ్మీ చెప్పిన డైలాగ్ తరహాలో ఈ బైక్‌కు.. 350 వజ్రాలు, బంగారు రేకులు, విలువైన రంగురాళ్లు తదితర హంగులన్నీ అద్దారు.