ప్రపంచంలోనే ఖరీదైన బైక్‌! కానీ.. | Worlds Costliest Bike By Harley Davidson For Bucherer | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే ఖరీదైన బైక్‌! కానీ..

Published Sun, May 20 2018 4:58 PM | Last Updated on Sun, May 20 2018 5:25 PM

Worlds Costliest Bike By Harley Davidson For Bucherer - Sakshi

భూగోళం మీద ఇప్పటిదాకా తయారుచేసినవాటిలో అత్యంత ఖరీదైన బైక్‌ ఇది. ధర మన కరెన్సీలో అక్షరాల 12కోట్ల రూపాయలు! ‘వజ్రవైఢూర్యములు పొదగబడిన కంఠాభరణములు... రత్నమాణిక్యములు కూర్చబడిన కంకణములు...’ అంటూ బ్రహ్మీ చెప్పిన డైలాగ్‌ తరహాలో ఈ బైక్‌కు.. 350 వజ్రాలు, బంగారు రేకులు, విలువైన రంగురాళ్లు తదితర హంగులన్నీ అద్దారు. ఈ అరుదైన సృష్టి మరెవరిదోకాదు.. ప్రఖ్యాత హార్లే డేవిడ్సన్‌ కంపెనీదే. సరే, బైక్‌ అంటే ప్రాణమించ్చే కొందరు.. రిస్క్‌ చేసైనా దీన్ని సొంతం చేసుకోవాలనుకుంటారు. కానీ అది సాధ్యమయ్యే పనికాదు. ఎందుకంటే..

హార్లే డేవిడ్సన్‌ బ్లూ ఎడిషన్‌ అనే పేరుతో రూపొందిన ఈ మోడల్‌ను.. ప్రఖ్యాత చేతి గడియారాల కంపెనీ ‘బుకెరర్‌’  ప్రత్యేకంగా తయారుచేయించింది. ఖరీదైన గడియారాలు రూపొందించే బుకెరర్‌.. అతిత్వరలోనే సరికొత్త వాచ్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఆ వాచ్‌ ప్రమోషన్‌ కోసం ఏకంగా బైక్‌ను వాడేసుకుందిలా. అఫ్‌కోర్స్‌, హార్లే డేవిడ్సన్‌ కంపెనీ కూడా తన ఖ్యాతికి తగ్గట్లుగా బ్లూ ఎడిషన్‌ను అత్యద్భుతంగా తయారుచేసిందనుకోండి. ఎప్పటికీ (రోడ్డుమీదికి) మార్కెట్‌లోకి రాదన్నమాటేగానీ.. ఆ ఠీవీ, లుక్కు సూపర్‌ కదా! (వీడియో కింద ఫొటో గ్యాలరీ చూడండి)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/14

2
2/14

3
3/14

4
4/14

5
5/14

6
6/14

7
7/14

8
8/14

9
9/14

10
10/14

11
11/14

12
12/14

13
13/14

14
14/14

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement