Harley Davidson bikes
-
భారత్‌లో అత్యంత ఖరీదైన బైకులు ఇవే! (ఫోటోలు)
-
ఈ బైక్ ధర తెలిస్తే ఎగిరి గంతేస్తారు? మరీ ఇంత తక్కువా!
Harley Davidson X440: భారతీయ మార్కెట్లో 'హార్లే డేవిడ్సన్' (Harley Davidson) బైకులు ఎంత ఖరీదైనవో అందరికి తెలుసు. అయితే ఇప్పుడు కంపెనీ కనీవినీ ఎరుగని రీతిలో చాలా తక్కువ ధరకే ఎక్స్440 (X440) బైక్ లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & వేరియంట్స్ హార్లే డేవిడ్సన్ ఎక్స్440 మొత్తం మూడు వేరియంట్లలో విడుదలైంది. అవి 'డెనిమ్, వివిడ్, ఎస్' వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ. 2.29 లక్షలు, రూ. 2.49 లక్షలు, రూ.2.69 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ బైక్ ధర ఎవర్ గ్రీన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కంటే కేవలం రూ. 35,000 ఎక్కువ. డిజైన్ & ఫీచర్స్ హార్లే డేవిడ్సన్ ఎక్స్440 డిజైన్ పరంగా చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. బేస్ వేరియంట్ వైర్-స్పోక్ రిమ్స్, మినిమల్ బ్యాడ్జింగ్ కలిగి ఉంటుంది. మిడ్ వేరియంట్ అల్లాయ్ వీల్స్ కలిగి డ్యూయల్-టోన్ పెయింట్ ఆప్షన్లతో వస్తుంది. చివరగా టాప్ వేరియంట్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, మెషిన్డ్ ఇంజన్ కూలింగ్ ఫిన్స్, 3D బ్యాడ్జింగ్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీతో కలర్ TFT డాష్, నావిగేషన్ మొదలైన వాటిని పొందుతుంది. (ఇదీ చదవండి: ఆస్తులమ్మినా ఈ ఒక్క వైన్ బాటిల్ కొనలేరు.. ధర ఎన్ని కోట్లంటే?) ఇంజిన్ వివరాలు ఎక్స్440 ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ 440 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి 6,000 rpm వద్ద 27 hp పవర్ & 4,000 rpm వద్ద 38 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ వంటివి ఇండియన్ రోడ్లకు సరిపోయే విధంగా ఉంటాయి. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) ప్రత్యర్థులు నిజానికి భారతీయ మార్కెట్లో హార్లే డేవిడ్సన్ ఇంత తక్కువ ధరకు ఎప్పుడు బైక్ చేయలేదు. కావున దేశీయ విఫణిలో తక్కువ ధరకు లభించే ఏకైన హార్లే డేవిడ్సన్ బైక్ ఎక్స్440 కావడం విశేషం. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైకుకి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. -
బ్రాండ్ బాబులు!
సాక్షి, హైదరాబాద్: కొత్త బ్రాండు, హైఎండు.. నగరంలోకి వస్తే చాలు.. హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇందుకోసం ఎంత ఖర్చయినా చేసేందుకు సిటీలోని సంపన్నులు, యువత వెనుకాడటం లేదు. అందుకే సిటీలోకి ఏ కొత్త మోడల్ కారు వచ్చినా.. బైక్ వచ్చినా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. బుకింగ్‌లు వెల్లువెత్తుతున్నాయి.కొన్ని రోజుల క్రితమే నగరంలో షోరూంలను ప్రారంభించిన ఎంజీ హెక్టార్, కియా కార్లకు పెరిగిన డిమాండ్ దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. వీటి కోసం నెలలు ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంది. హైఎండ్ దూకుడు.. హై ఎండ్ కార్లు, బైక్‌ల అమ్మకాలు జోరు మీదున్నాయి. ధర ఎంత ఉన్నా కొనడానికి వాహన ప్రియులు వెనుకాడటంలేదు. 2017 నుంచి 2019 గణాంకాల ప్రకారం.. మెర్సిడెజ్ బెంజ్‌కు చెందిన జీఎల్ఎస్ 350డీ 4 మాటిక్ వాహనాలు 203 రిజిస్టరయ్యాయి. దీని ధర రూ.65 లక్షలకు పైనే ఉంది. అటు బీఎండబ్ల్యూ ఎక్స్ 5 ఎక్స్‌డ్రైవ్ 30డీ డీపీఈ విత్ ఎట్ 55 వాహనాలు 100 వరకు అమ్ముడయ్యాయి. దీని ధర రూ.55లక్షల వరకు ఉంది. వోల్వో ఎక్స్ సీ90 డీ5 వాహనాలు.. 80, బీఎండబ్ల్యూ 520డీ లగ్జరీ డబ్ల్యూ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 69, వోల్వో ఎక్స్ సీ60 డీ5 వాహనాలు 61 చొప్పున ఈ రెండేళ్లలో అమ్ముడయ్యాయి. గతేడాది హై ఎండ్ కార్ల విక్రయాలు వెయ్యి దాటాయి. ద్విచక్రంలో దీనిదే పైచేయి.. హైఎండ్ ద్విచక్ర వాహనాల్లో హార్లీడేవిడ్సన్ రారాజులా దూసుకుపోతోంది. హార్లీడేవిడ్సన్ ఎక్స్‌జీ 750 వాహనాలు అత్యధికంగా 88 వరకు విక్రయించారు. హార్లిడేవిడ్‌సన్ ఎక్స్‌జీ 750ఏ వాహనాలు 73 వరకు అమ్ముడయ్యాయి. దీని ధర రూ.8.8లక్షల వరకు ఉంది. డీఎస్కే మోటార్ వీల్స్ టీఎన్‌ఏటీ 600 బ్రాండ్, కవాసకి హెవీ ఇండస్ (జపాన్), ఇండియా కవాసకి మోటార్స్‌కు చెందిన నింజా 650 తదితర బైక్‌ల అమ్మకాలు బాగా జరిగాయి. ఆర్టీఏ లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో రూ.10 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన బైక్‌లు 426 ఉండగా, రూ.50 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన హై ఎండ్ కార్లు 5,061 రిజిస్టరయ్యాయి. అటు రెగ్యులర్ బైక్‌లు, కార్ల అమ్మకాలు గత కొద్ది రోజులుగా 15 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గినట్లు నగరంలోని పలువురు ప్రముఖ షోరూమ్ డీలర్లు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా వచ్చిన మార్పుల్లో భాగంగానే హైదరాబాద్‌లోనూ రెగ్యులర్ మోడళ్ల అమ్మకాలు మందగించాయని చెప్పారు. కాగా, 2020 ఏప్రిల్ నుంచి బీఎస్ –6 మోడల్ మార్కెట్లోకి రానున్న దృష్ట్యా చాలామంది వినియోగదారులు కార్ల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. -
టారిఫ్ వార్ దెబ్బకు హార్లీ డేవిడ్సన్...
అమెరికాకు, యూరోపియన్ యూనియన్‌కు మధ్య నెలకొన్న టారిఫ్ వార్ దెబ్బ, అమెరికా అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీదారి హార్లీ డేవిడ్ సన్ తగిలింది. టారిఫ్ వార్ నుంచి బయటపడేందుకు హార్లీ డేవిడ్సన్ కీలక నిర్ణయం తీసుకుంది. తన బైక్‌ల కొంత ఉత్పత్తిని అమెరికా వెలుపల చేపట్టాలని నిర్ణయించింది. దీంతో అమెరికాకు కౌంటర్‌గా యూరోపియన్ యూనియన్ విధించే టారిఫ్‌ల నుంచి అది తప్పించుకోబోతుంది. ఈ విషయాన్ని హార్లీ డేవిడ్సన్ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా అమెరికాకు, ఇతర దేశాలకు భారీ ఎత్తున్న టారిఫ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా విధిస్తున్న టారిఫ్‌లకు కౌంటర్‌గా ఆయా దేశాలు కూడా టారిఫ్‌లు విధిస్తున్నాయి. గత వారంలోనే అమెరికా ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ 3.2 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. అమెరికా విధించిన స్టీల్, అల్యూమినియం టారిఫ్‌లకు ప్రతిగా ఈ టారిఫ్‌లను ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ విధించిన టారిఫ్ ఉత్పత్తుల్లో హార్లీ డైవిడ్సన్ బైక్‌లు కూడా ఉన్నాయి. వీటి టారిఫ్‌లు కూడా 6 శాతం నుంచి 31 శాతం పెరిగాయి. దీంతో అమెరికా నుంచి ఎగుమతి అయ్యే ఒక్కో మోటార్ సైకిల్‌పై 2,200 డాలర్ల ప్రభావం పడనుంది. ఈ క్రమంలోనే హార్లీ డేవిడ్సన్ తమ ఉత్పత్తుల తయారీని అమెరికా నుంచి యూరోపియన్ యూనియన్‌కు తరలించాని నిర్ణయించింది. ‘టారిఫ్‌లు పెరగడంతో, హార్లీ డేవిడ్సన్ వ్యయాలు కూడా పెరగనున్నాయి. ఒకవేళ ఈ వ్యయాలను డీలర్లకు, రిటైల్ కస్టమర్లకు బదిలీ చేస్తే, తమ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. హార్లీ డేవిడ్సన్ ఉత్పత్తులకు కస్టమర్ యాక్సస్ కూడా తగ్గిపోతుంది’ అని కంపెనీ రెగ్యులేటరీలో పేర్కొంది. అమెరికా వెలుపలకు హార్లీ డేవిడ్సన్ ఉత్పత్తుల తయారీని బదిలీ చేసే ప్రక్రియకు 18 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే హార్లీ తీసుకున్న నిర్ణయంపై ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘హర్లీ డేవిడ్సన్ నిర్ణయం ఆశ్చర్యం కలిగిచింది. నేను వారికోసమే పోరాడుతున్నాను. చివరికి వారు ఈయూకి ఎగుమతి చేసే ఉత్పత్తులపై ఎలాంటి సుంకాలు చెల్లించరు. వాణిజ్యపరంగా మాకు 151 బిలియన్ డాలర్ల నష్టం కలుగుతోంది. సుంకాలపై హార్లే ఓపికగా ఉండాలి’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. -
భారత్‌పై ట్రంప్ అసహనం.. మోదీపై సెటైర్లు
వాషింగ్టన్: హార్లీ–డేవిడ్సన్ బైక్‌లపై దిగుమతి సుంకం విషయంలో భారత్ తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా దిగుమతి చేసుకుంటున్న వేల కొద్ది భారత మోటర్ సైకిళ్లపైనా దిగుమతి సుంకాన్ని భారీగా పెంచేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. స్టీల్ పరిశ్రమపై కాంగ్రెస్ సభ్యుల బృందంతో సమావేశం సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో హార్లీ డేవిడ్సన్ బైకులపై దిగుమతి సుంకాన్ని భారత్ 75 నుంచి 50 శాతానికి తగ్గించింది. అయితే ఇది ఏమాత్రం సరిపోదని.. భారత్ నుంచి వస్తున్న మోటర్ సైకిళ్లపై అమెరికా పన్ను వసూలు చేయటం లేదన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ఇదే విధానాన్ని భారత్ కొనసాగించాలన్నారు. ‘చాలా దేశాల్లో మన వస్తువులు తయారవుతున్నాయి. అందుకోసం వారికి భారీగానే చెల్లింపులు చేస్తున్నాం. అలాంటిది.. మన దగ్గర తయారైన హార్లీ డేవిడ్సన్ మోటర్ సైకిల్ వారి వద్దకెళ్లినా భారీగా పన్నులు చెల్లించాల్సి వస్తోంది’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘రెసిప్రోకల్ ట్యాక్స్’... మోదీపై సెటైర్ ఇటీవల మోదీతో జరిగిన సంభాషణను పరోక్షంగా గుర్తుచేస్తూ.. ‘ఇండియా నుంచి ఓ గ్రేట్ జెంటిల్మన్ ఫోన్ చేసి మోటర్ సైకిళ్లపై గతంలో ఉన్న 100 శాతం పన్నును మొదట 75 శాతానికి ప్రస్తుతం 50 శాతానికి తగ్గించామని చెప్పారు’ అని తెలిపారు. భారత్ నుంచి వస్తున్న మోటర్ సైకిళ్లపై తాము ఏమాత్రం పన్ను వసూలు చేయటం లేదని చెబుతూ.. అమెరికాతో ‘రెసిప్రోకల్ ట్యాక్స్’ (పరస్పర సమానమైన పన్ను) విధానాన్ని అమలుచేయని దేశాలతో కఠినంగా వ్యవహరించాలన్నారు. ‘ఇలాంటి కేసుల్లో మనం రెసిప్రోకల్ ట్యాక్స్‌ను అమలుచేయాల్సిందే. నేను భారత్‌ను తప్పుబట్టడం లేదు. ఆయా దేశాలు ఈ ట్యాక్స్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాయనిపిస్తోంది’ అని ట్రంప్ పేర్కొన్నారు. రెసిప్రోకల్ ట్యాక్స్‌ను అమలుచేయాలని ట్రంప్ మొదటినుంచీ వాదిస్తున్నారు. కాగా, తన వేతనంలోని నాలుగో వంతును (2017లో తీసుకున్న వేతనంలో) రవాణాశాఖ మౌలికవసతులను మెరుగుపరుచుకునేందుకు విరాళంగా ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీనికి సంబంధించి లక్ష డాలర్ల చెక్కును అందజేశారు. ఏడాదికి ట్రంప్ వేతనం 4 లక్షల డాలర్లు (రూ.2.56కోట్లు). ఆ పోర్న్‌స్టార్‌కు 1.3లక్షల డాలర్లు ఇచ్చా! ట్రంప్‌తో శారీరక సంబంధం ఉన్నట్లు ప్రకటించిన పోర్న్‌స్టార్ స్టెఫానీ క్లిఫార్డ్‌కు 1.3 లక్షల డాలర్ల (రూ. 83.5లక్షలు) చెల్లించినట్లు ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది మైకెల్ కోహెన్ న్యూయార్క్ టైమ్స్‌కు వెల్లడించారు. తన సొంత డబ్బును క్లిఫార్డ్‌కు ఇచ్చానని.. ఇంతవరకు ట్రంప్‌గానీ, ఆయన ప్రచార విభాగం గానీ.. ఈ డబ్బును తిరిగి ఇవ్వలేదన్నారు. పోర్న్‌స్టార్ దీనిపై మాట్లాడకుండా ఉండేందుకు నవంబర్ 2016 ఎన్నికలకు ముందు ఈ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసినట్లు పేర్కొన్నారు. -
డ్రగ్స్‌కు బానిసై...
బంజారాహిల్స్ : ట్రయల్ పేరుతో షోరూం నిర్వాహకులను బురిడీ కొట్టించి హార్లీ డేవిడ్సన్ బైక్‌తో ఉడాయించిన తొర్లపాటి కిరణ్ గత కొంత కాలం నుంచి డ్రగ్స్‌కు అలవాటుపడినట్లు అతని తండ్రి ప్రకాశ్ పోలీసుల విచారణలో వెల్లడించారు. హైదరాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయంలో ఎస్ఎస్సీ వరకు చదివిన కిరణ్ ఐఐటీలో జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించిన ఉత్తమ విద్యార్థిగా గుర్తింపు పొందాడని అలాంటి వాడు ఇటీవల డ్రగ్స్‌కు అలవాటుపడి జీతం సరిపోక అడ్డదారులు తొక్కుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. గత కొంత కాలంగా కిరణ్ ప్రవర్తనలో మార్పులు గమనిస్తున్నామని అయితే దొంగతనం చేసే స్థాయిలో ఉంటుందని తాము ఊహించలేకపోయామని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. తమ పరువు ప్రతిష్టలు గంగలో కలిశాయని ముఖం చూపించుకోలేకపోతున్నామని విలపించారు. * 6 లక్షల విలువైన బైక్‌తో ఉడాయించిన కిరణ్‌ను ముంబైలో బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే బైక్‌ను అమ్మే ప్రయత్నం చేస్తుండగానే పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో కిరణ్ పథకం బెడిసికొట్టింది. ఐఐటీ చదివి ముంబైలోని ఓఎన్జీసీలో రూ. 1.50 లక్షల జీతంతో పని చేస్తున్న కిరణ్‌కు ప్రతి నెలా మత్తు పదార్థాలకే రూ. 1.50 లక్ష దాకా ఖర్చవుతున్నాయని పోలీసుల విచారణలో తెలిసింది. ఈ బైక్‌ను అమ్మి ఇందులో పట్టుబడకపోతే వచ్చే నెలలో మరో చోరీకి పథకం వేసినట్లు కూడా పోలీసులు గుర్తిం్చరు. గతంలో కిరణ్ ఇలాంటి దొంగతనాలు చేశాడా అనే విషయం అతను ఇక్కడికి వచ్చాక తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.