ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. మోటో కార్ప్ సంస్థ టూవీలర్ల తయారీలో రోబో టెక్నాలజీని వినియోగించాలని, తద్వారా మరింత ఉత్పాదకత సాధించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగానే గత కొంత కాలంగా సంస్థలో ఉద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు హీరో మోటోకార్ప్ ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో హీరో మోటోకార్ప్ ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ప్రకటించింది. ఉద్యోగులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్, వేరియబుల్ పే, మెడికల్ కవరేజ్, కంపెనీ అందించే కారుకు అద్దె చెల్లింపులు వంటి వాటితోపాటు ఇతర ప్రోత్సహాకాలు ఉంటాయని హీరో మోటోకార్ప్ తెలిపింది.
ఇక గత రెండేళ్లలో మార్కెటింగ్, ఆర్‌అండ్‌డీ, హెచ్‌ఆర్, ఎలక్ట్రిక్ వాహనాలు విభాగాలకు కొత్త సీఈవోలను సంస్థలోని వారిని ఎంపిక చేసింది. ఫైనాన్స్, ఎలక్ట్రిక్ వాహన విభాగానికి బయటి వ్యక్తులను సీఈవోలుగా నియమించింది. తాజాగా వీఆర్‌ఎస్ అంశాన్ని తెరపైకి తెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment