హీరో కరిజ్మా మళ్లీ వచ్చింది | Hero Moto Karizma ZMR is back, prices at Rs 1.08 lakh | Sakshi
Sakshi News home page

హీరో కరిజ్మా మళ్లీ వచ్చింది

Published Mon, Jul 30 2018 7:54 PM | Last Updated on Mon, Jul 30 2018 7:54 PM

Hero Moto Karizma ZMR is back, prices at Rs 1.08 lakh - Sakshi

సాక్షి, ముంబై: భారత మోటారుసైకిల్ తయారీ దిగ్గజ సంస్థ హీరో మోటోకార్ప్ తన పాపులర్‌ మోడల్‌ బైక్‌ను తిరిగి లాంచ్‌ చేసింది.  కరిజ్మా జెడ్‌ఎంఆర్‌ బైక్‌ను ఇండియన్  మార్కెట్లో తీసుకువచ్చింది. ఈ బైక్‌ స్టాండర్డ్‌ వెర్షన్‌ను 1.08 లక్షల రూపాయల ధరతో, డ్యూయల్-టోన్ మోడల్  బైక్‌ను​రూ. 1.10 లక్షలు (ఎక్స్ షోరూమ్ ) ధర వద్ద అందుబాటులో ఉంచింది.భారతీయ విఫణిలో మొట్టమొదటి 225 సిసి సింగిల్ సిలిండర్ బైక్‌ గా గుర్తింపు పొందిన కరిజ్మా బైక్‌ను పేలవమైన విక్రయాల కారణంగా ఇండియన్‌ మార్కెట్‌లో సేల్స్‌నిలిపివేసింది. అయినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో  విక్రయాలు మెరుగ్గానే ఉన్నాయి. మెకానికల్‌ మార్పులు చేయనప్పటికీ, కాస్మొటిక్‌​అప్‌డేట్స్‌తో సరికొత్తగా లాంచ్‌ చేసింది. 223సీసీ సింగిల్‌ ఇంజీన్‌, 20బీహెచ్‌పీ పవర్‌, 19.7 ఎన్‌ఎమ్‌ గరిష్ట టార్క్‌ , 5 మాన్యువల్‌ గేర్‌ బాక్స్‌  ఈ బైక్‌ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.  నాలుగు రంగుల్లో ఆకర్షణీయంగా   అందుబాటులోకి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement