ప్రత్యేక వీడియో చేసిన బిసిసిఐ
పంత్ కోలుకున్న తీరు అమోఘమని ప్రశంస
రిషబ్ పంత్.. పరిచయం అవసరం లేని పేరు. ధోనీ తర్వాత క్రికెట్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా అద్భుతంగా రాణించిన ఆటగాడు పంత్. టెస్టుల్లో.. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత విజయాలు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు పంత్. మూడు ఫార్మాట్‌లలో నిలకడగా రాణిస్తూ.. భవిష్యత్ ఆశాకిరణంగా ప్రశంసలు అందుకున్న పంత్.. 2022, డిసెంబరు 31న జరిగిన కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. రూర్కీ సమీపంలో పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి చావు అంచుల దాకా పోయి వచ్చాడు. ఇప్పుడు అదంతా చరిత్ర. కొత్త రికార్డులు సృష్టించేందుకు పంత్ సిద్ధమవుతున్నాడు.
గ్రేటేస్ట్ కం బ్యాక్
సాధారణ ఆటగాడిగా అడుగుపెట్టి.. అసాధారణ ఆటతీరుతో భారతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకున్న పంత్.. తిరిగి మైదానంలోకి అడుగుపెట్టడం గొప్పవిషయం అంటోంది బిసిసిఐ. ప్రమాదం నుంచి పంత్ కోలుకున్న తీరు.. ఎందరికో స్పూర్తినిచ్చేలా ఉందంటూ ప్రశంసించింది. ప్రమాదంలో దెబ్బతిన్న పంత్.. పడిలేచిన కెరటాన్ని మరిపిస్తూ మళ్లీ ఆడబోతున్నట్టు ప్రకటించింది. పంత్ కోలుకున్న తీరును ఓ వీడియో రూపంలో రేపు ఉదయం bcci.tvలో ప్రసారం చేయబోతుంది బిసిసిఐ. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించిన బిసిసిఐ.. పంత్‌ను ముంబైకి ఎయిర్‌లిఫ్ట్ చేసింది. అత్యున్నత చికిత్స అందించడంతో పంత్ వేగంగా కోలుకున్నాడు. ప్రస్తుతం.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కసరత్తులు చేసి మళ్లీ ఫిట్‌నెస్ సాధించాడు పంత్. రానున్న ఐపీఎల్ ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నేతృత్వం వహించనున్నాడు పంత్. ఢిల్లీ టీం తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. మొహాలీలో జరిగే ఆ మ్యాచ్‌లో డీసీ టీమ్.. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
The Greatest Comeback Story
— BCCI (@BCCI) March 13, 2024
This story is about inspiration, steely will power and the single-minded focus to get @RishabhPant17 back on the cricket field. We track all those who got the special cricketer back in shape after a deadly car crash.
Part 1 of the #MiracleMan… pic.twitter.com/ifir9Vplwl
Comments
Please login to add a commentAdd a comment