Indian player
-
Rohit And Kohli Retire T20I: వాళ్ల ఆట.. పొట్టి ఫార్మాట్లో ఇక చూడలేం (ఫోటోలు)
-
Candidates Chess 2024: విదిత్ గుజరాతీ విజయం
టొరంటోలో జరుగుతున్న ప్రతిష్టాత్మక క్యాండిడెట్స్ చెస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు విదిత్ గుజరాతీ మరో కీలక విజయాన్ని నమోదు చేశాడు. 9వ రౌండ్లో హికారు నకమురా (అమెరికా)ను విదిత్ ఓడించాడు. ఈ గెలుపుతో ఓవరాల్‌గా 4.5 పాయింట్లతో విదిత్...నకమురా, కరువానాలతో కలిసి నాలుగో స్థానంలో నిలిచారు. మరో వైపు ఇద్దరు భారత ఆటగాళ్లు డి.గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద మధ్య జరిగిన గేమ్ ‘డ్రా’గా ముగిసింది. తాజా ఫలితం తర్వాత గుకేశ్, నెపొమినియాచి 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 4 పాయింట్లతో ప్రజ్ఞానంద తర్వాతి స్థానంలో ఉన్నాడు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి 9వ రౌండ్ గేమ్ ‘డ్రా’ అయింది. హోరాహోరీ పోరు తర్వాత హంపి, రష్యాకు చెందిన కటెరినా లాగ్నో తమ గేమ్‌ను సమంగా ముగించారు. హంపికి మధ్యలో విజయావకాశాలు వచి్చనా కటెరినా తెలివిగా ఆడి తప్పించుకోలిగింది. అయితే మరో భారత ప్లేయర్ ఆర్.వైశాలి...చైనాకు చెందిన జోంగి తన్ చేతిలో ఓటమిపాలైంది. ప్రస్తుతం హంపి 4 పాయింట్లతో ముజిచుక్ (ఉక్రెయిన్)తో కలిసి ఐదో స్థానంలో కొనసాగుతోంది. -
పడి లేచిన కెరటం పంత్
రిషబ్ పంత్.. పరిచయం అవసరం లేని పేరు. ధోనీ తర్వాత క్రికెట్లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా అద్భుతంగా రాణించిన ఆటగాడు పంత్. టెస్టుల్లో.. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత విజయాలు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు పంత్. మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ.. భవిష్యత్ ఆశాకిరణంగా ప్రశంసలు అందుకున్న పంత్.. 2022, డిసెంబరు 31న జరిగిన కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. రూర్కీ సమీపంలో పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి చావు అంచుల దాకా పోయి వచ్చాడు. ఇప్పుడు అదంతా చరిత్ర. కొత్త రికార్డులు సృష్టించేందుకు పంత్ సిద్ధమవుతున్నాడు. గ్రేటేస్ట్ కం బ్యాక్ సాధారణ ఆటగాడిగా అడుగుపెట్టి.. అసాధారణ ఆటతీరుతో భారతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేసుకున్న పంత్.. తిరిగి మైదానంలోకి అడుగుపెట్టడం గొప్పవిషయం అంటోంది బిసిసిఐ. ప్రమాదం నుంచి పంత్ కోలుకున్న తీరు.. ఎందరికో స్పూర్తినిచ్చేలా ఉందంటూ ప్రశంసించింది. ప్రమాదంలో దెబ్బతిన్న పంత్.. పడిలేచిన కెరటాన్ని మరిపిస్తూ మళ్లీ ఆడబోతున్నట్టు ప్రకటించింది. పంత్ కోలుకున్న తీరును ఓ వీడియో రూపంలో రేపు ఉదయం bcci.tvలో ప్రసారం చేయబోతుంది బిసిసిఐ. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించిన బిసిసిఐ.. పంత్‌ను ముంబైకి ఎయిర్‌లిఫ్ట్ చేసింది. అత్యున్నత చికిత్స అందించడంతో పంత్ వేగంగా కోలుకున్నాడు. ప్రస్తుతం.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కసరత్తులు చేసి మళ్లీ ఫిట్నెస్ సాధించాడు పంత్. రానున్న ఐపీఎల్ ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నేతృత్వం వహించనున్నాడు పంత్. ఢిల్లీ టీం తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. మొహాలీలో జరిగే ఆ మ్యాచ్‌లో డీసీ టీమ్.. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. The Greatest Comeback Story This story is about inspiration, steely will power and the single-minded focus to get @RishabhPant17 back on the cricket field. We track all those who got the special cricketer back in shape after a deadly car crash. Part 1 of the #MiracleMan… pic.twitter.com/ifir9Vplwl — BCCI (@BCCI) March 13, 2024 -
ఐదేళ్ల తర్వాత...
న్యూఢిల్లీ: నిరీక్షణ ముగిసింది. ఐదేళ్ల తర్వాత అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ టాప్–100లో మళ్లీ భారత ప్లేయర్ పేరు కనిపించింది. ఆదివారం ముగిసిన చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో విజేతగా నిలిచిన సుమిత్ నగాల్ ఏకంగా 23 స్థానాలు ఎగబాకి తొలిసారి టాప్–100లోకి దూసుకొచ్చాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 26 ఏళ్ల సుమిత్ 630 పాయింట్లతో కెరీర్ బెస్ట్ 98వ ర్యాంక్‌లో నిలిచాడు. 2019లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తర్వాత ఓ భారత టెన్నిస్ ప్లేయర్ ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్–100లోకి రావడం విశేషం. 1973లో ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక భారత్ నుంచి టాప్–100లో నిలిచిన పదో ప్లేయర్‌గా సుమిత్ నగాల్ గుర్తింపు పొందాడు. ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత్‌కే చెందిన రోహన్ బోపన్న వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... గతంలో లియాండర్ పేస్, మహేశ్ భూపతి నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ విభాగంలో సానియా మీర్జా కెరీర్ బెస్ట్ 27వ ర్యాంక్‌లో, డబుల్స్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచింది. -
ATP Rankings: నంబర్‌వన్ బోపన్న
లండన్: సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 21 ఏళ్ల తర్వాత మళ్లీ భారత ప్లేయర్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించాడు. సోమవారం విడుదల చేసిన అధికారిక తాజా ర్యాంకింగ్స్‌లో రోహన్ బోపన్న రెండు స్థానాలు ఎగబాకి తన కెరీర్లో తొలిసారి టాప్ ర్యాంక్‌లో నిలిచి చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. టెన్నిస్ చరిత్రలోనే నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్న అతిపెద్ద వయసు్కడిగా బోపన్న (43 ఏళ్ల 330 రోజులు) ప్రపంచ రికార్డు సృష్టించాడు. అమెరికా దిగ్గజం మైక్ బ్రయాన్ (41 ఏళ్ల 76 రోజులు; 2019లో) పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు. గత శనివారం ఆస్ట్రేలియన్ ఓపెన్ టోరీ్నలో బోపన్న ఆ్రస్టేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్తో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్ నెగ్గి తన కెరీర్లో పురుషుల డబుల్స్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో బోపన్న, ఎబ్డెన్ 8,450 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ తక్కువ టోరీ్న లు ఆడినందుకు బోపన్నకు టాప్ ర్యాంక్ ఖరారుకాగా, ఎబ్డెన్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. చివరిసారి భారత్ నుంచి లియాండర్ పేస్ 2000 మార్చి 13న ... మహేశ్ భూపతి 1999 జూన్ 14న ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచారు. బెంగళూరుకు చెందిన బోపన్న 2003లో ప్రొఫెషనల్‌గా మారాడు. తన 21 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో బోపన్న ఇప్పటిదాకా పురుషుల డబుల్స్‌లో 19 మంది వేర్వేరు భాగస్వాములతో ఆడి 25 టైటిల్స్ సాధించడంతోపాటు 504 మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. 2016లో బెంగళూరులో తన పేరిట టెన్నిస్ అకాడమీని స్థాపించి కుర్రాళ్లకు శిక్షణ ఇస్తున్నాడు. -
ISSF Shotgun World Cup 2023 Doha: పృథ్వీరాజ్‌కు కాంస్యం
దోహాలో జరుగుతున్న వరల్డ్ కప్ షాట్‌గన్ షూటింగ్లో భారత ఆటగాడు పృథ్వీరాజ్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. పురుషుల ట్రాప్ ఈవెంట్ ఫైనల్లో అతను 20 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో ఒగుజాన్ టుజున్ (టర్కీ–33 పాయింట్లు), కోవార్డ్ హాలీ (బ్రిటన్–30 పాయింట్లు)కు స్వర్ణ, రజతాలు దక్కాయి. మరో వైపు మహిళల విభాగంలో శ్రేయాన్షి సింగ్ పతకావకాశాలు కోల్పోయింది. సెమీఫైనల్‌కు అర్హత సాధించిన శ్రేయాన్షియ ఆపై ముందంజ వేయడంలో విఫలమైంది. -
IBSF World Billiards Championship: పంకజ్ ఖాతాలో 25వ ప్రపంచ టైటిల్
కౌలాలంపూర్: క్యూ స్పోర్ట్స్ (బిలియర్స్, స్నూకర్)లో భారత దిగ్గజ ప్లేయర్ పంకజ్ అద్వానీ విశ్వ వేదికపై మరోసారి మెరిశాడు. మలేసియాలో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ 150 పాయింట్ల ఫార్మాట్లో ఈ బెంగళూరు ఆటగాడు చాంపియన్‌గా నిలిచాడు. బిలియర్స్, స్నూకర్లలో వివిధ ఫార్మాట్లలో కలిపి పంకజ్‌కిది 25వ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారితో శనివారం జరిగిన ఫైనల్లో 37 ఏళ్ల పంకజ్ అద్వానీ 4–0 (151–0, 150–31, 153–12, 150–29) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. ఆద్యంతం పూర్తి ఏకాగ్రతతో ఆడిన పంకజ్ ఏదశలోనూ తన ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి ఫ్రేమ్‌లో బ్రేక్ లేకుండా 149 పాయింట్లు స్కోరు చేసిన పంకజ్ ఆ తర్వాతి ఫ్రేమ్‌లలోనూ అదే జోరు కొనసాగించాడు. మ్యాచ్ మొత్తంలో కొఠారి కేవలం 72 పాయింట్లు స్కోరు చేయగా... పంకజ్ 604 పాయింట్లు సాధించడం అతని ఆధిపత్యాన్ని సూచిస్తోంది. ఈ గెలుపుతో పంకజ్ ఒకే ఏడాది జాతీయ, ఆసియా, ప్రపంచ బిలియర్స్ టైటిల్స్‌ను ఐదోసారి సాధించడం విశేషం. ఓవరాల్‌గా 150 పాయింట్ల ఫార్మాట్లో పంకజ్‌దికి ఐదో ప్రపంచ టైటిల్. చివరిసారి ఈ టోర్నీ 2019లో జరిగింది. ఆ ఏడాది కూడా పంకజ్‌కే టైటిల్ దక్కింది. కరోనా కారణంగా గత రెండేళ్లు ఈ టోర్నీని నిర్వహించలేదు. ‘వరుసగా ఐదేళ్లు ప్రపంచ టైటిల్‌ను నిలబెట్టుకోవడం కలలాంటిదే. ఈ ఏడాది ప్రతి టోర్నీలో నా ఆటతీరుపట్ల సంతృప్తి చెందాను. ప్రపంచస్థాయిలో భారత్‌కు మరో టైటిల్ అందించినందుకు ఆనందంగా ఉంది’ అని పంకజ్ వ్యాఖ్యానించాడు. 8: పాయింట్ల ఫార్మాట్లో పంకజ్ సాధించిన ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ (2005, 2008, 2014, 2016, 2017, 2018, 2019, 2022). 8: లాంగ్ ఫార్మాట్లో పంకజ్ గెలిచిన ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ (2005, 2007, 2008, 2009, 2012, 2014, 2015, 2018). 8: స్నూకర్‌లో పంకజ్ సొంతం చేసుకున్న ప్రపంచ టైటిల్స్ (15 రెడ్స్: 2003, 2015, 2107; 6 రెడ్స్: 2014, 2015, 2021), వరల్డ్ టీమ్ కప్ (2018), వరల్డ్ టీమ్ చాంపియన్‌షిప్ (2019). 1: పంకజ్ నెగ్గిన ప్రపంచ బిలియర్డ్స్ టీమ్ టైటిల్స్ సంఖ్య (2014). -
Julius Baer Generation Cup: సెమీఫైనల్లో అర్జున్ ఇరిగేశి
జూలియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు అర్జున్ ఇరిగేశి సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో టైబ్రేకర్ ద్వారా క్రిస్టోఫర్ యూ (అమెరికా)పై విజయం సాధించాడు. నాలుగు ర్యాపిడ్ గేమ్‌ల తర్వాత అర్జున్, క్రిస్టోఫర్ 2–2తో సమంగా నిలిచారు. దాంతో బ్లిట్జ్ టైబ్రేక్ నిర్వహించగా... తొలి గేమ్‌లో అర్జున్ గెలిచాడు. రెండో గేమ్‌ను డ్రా చేసుకున్న అతను సెమీస్ చేరాడు. అయితే మరో భారత ఆటగాడు ఆర్.ప్రజ్ఞానంద క్వార్టర్స్‌లో ఓటమిపాలయ్యాడు. జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ చేతిలో 1–3తో ప్రజ్ఞానంద ఓడాడు. తొలి గేమ్‌ను ఓడి రెండు గేమ్‌లు డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద తప్పనిసరిగా గెలవాల్సిన నాలుగో గేమ్‌లో కూడా పరాజయంపాలయ్యాడు. వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), లీమ్ క్వాంగ్ లీ (వియత్నాం) కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ఆరోనియన్పై కార్ల్సన్, నీమన్‌పై క్వాంగ్ లీ గెలుపొందారు. సెమీస్‌లో కార్ల్సన్తో కీమర్, క్వాంగ్ లీతో అర్జున్ తలపడతారు. -
Malaysia Open: తొలి రౌండ్లోనే అవుట్.. పోరాడి ఓడిన సాయి ప్రణీత్
కౌలాలంపూర్: భారత అగ్రశ్రేణి షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ మలేసియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 19వ ర్యాంకర్ సాయిప్రణీత్ 15–21, 21–19, 9–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జిన్‌టింగ్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ సీజన్లో సాయిప్రణీత్ ఏడు టోర్నీలలో పాల్గొనగా, ఆరింటిలో తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. మరోవైపు సమీర్ వర్మ కూడా తొలి రౌండ్లోనే ఓడిపోగా, ప్రణయ్ శుభారంభం చేశాడు. 2018 ఆసియా క్రీడల చాంపియన్ క్రిస్టీ (ఇండోనేసియా) 21–14, 13–21, 21–7తో సమీర్ వర్మను ఓడించగా... ప్రణయ్ 21–14, 17–21, 21–18తో డారెన్ లూ (మలేసియా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–18, 21–11 తో మాన్ వె చోంగ్–కయ్ వున్ టీ (మలేసియా) జోడీపై గెలి చింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని (భారత్) జంట 15– 21, 11–21తో మత్సుయామ–చిహారు (జపాన్) జోడీ చేతిలో ఓడింది. చదవండి: Wimbledon 2022: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఆ ఘనత సాధించిన ఏకైక మొనగాడిగా రికార్డు -
ప్రపంచ ఆరో ర్యాంకర్‌పై సత్యన్ విజయం
వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో భారత నంబర్‌వన్ సత్యన్ జ్ఞానశేఖరన్ సంచలనం సృష్టించాడు. క్రొయేషియాలో జరుగుతున్న ఈ టోర్నీలో సత్యన్ తొలి రౌండ్లో 6–11, 12–10, 11–9, 12–10తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జార్జిక్ డార్కో (స్లొవేనియా)ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. టాప్–10 ర్యాంకింగ్స్ లోని క్రీడాకారుడిని ఓడించడం సత్యన్ కెరీర్లో ఇది రెండోసారి. -
చతేశ్వర్ పుజారా అజేయ డబుల్ సెంచరీ
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో భాగంగా సస్సెక్స్ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారత ప్లేయర్ చతేశ్వర్ పుజారా అదరగొట్టాడు. డెర్బీషైర్‌తో ‘డ్రా’గా ముగిసిన ఈ మ్యాచ్‌లో పుజారా (201 నాటౌట్; 23 ఫోర్లు), టామ్ హైన్స్ (243; 22 ఫోర్లు) డబుల్ సెంచరీలు సాధించారు. దాంతో ఫాలోఆన్ ఆడుతూ ఓవర్‌నైట్ స్కోరు 278/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సస్సెక్స్ జట్టు 176.1 ఓవర్లలో 3 వికెట్లకు 513 పరుగులు చేసి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. -
IPL Mega Auction 2022: రూ.15.25 కోట్లు.. ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. క్యాష్ రిచ్ లీగ్ వేలం చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. కాగా ఫిబ్రవరి 12న బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్‌ను సొంతం చేసుకుంది. రిటెన్షన్‌లో అతడిని వదిలేసిన ముంబై వేలంలో 15.25 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేయడం విశేషం. కాగా ఇషాన్ కనీస ధర 2 కోట్లు కాగా ముంబై, హైదరాబాద్ పోటీ పడ్డాయి. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన ఇషాన్ కిషన్... ‘‘అందరికి నమస్కారం. ముంబై ఇండియన్స్‌తో మళ్లీ చేరడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. జట్టులోని ప్రతి ఒక్కరు నన్ను తమ కుటుంబ సభ్యుడిలా భావిస్తారు. నిజంగా నా జట్టుతో తిరిగి కలవడం ఎంతో ఎంతో ఆనందంగా ఉంది’’ అంటూ ఉత్సాహంగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ట్విటర్లో షేర్ చేసింది. కాగా ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన భారత ఆటగాళ్లలో యువరాజ్ సింగ్ ముందు వరుసలో ఉన్నాడు. (చదవండి: అప్పుడు రూ.20 లక్షలు.. ఇప్పుడు ఏకంగా రూ.10.75 కోట్లు.. వారెవ్వా హర్షల్!) 2008లో ఢిల్లీ ఫ్రాంఛైజీ అతడిని 16 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు రికార్డు ధర పలికిన ఇషాన్ యువీ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. మరో టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌ను 12.25 కోట్లు పెట్టి కోల్‌కతా కొనుగోలు చేసింది. ఇక విదేశీ ఆటగాళ్లలో క్రిస్ మోరిస్(16 కోట్లు), ప్యాట్ కమిన్స్(15.5 కోట్లు), కైలీ జెమీషన్(15 కోట్లు) తదితరులు గతంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు. 𝐓𝐡𝐞 𝐏𝐨𝐜𝐤𝐞𝐭 𝐃𝐲𝐧𝐚𝐦𝐨 shares a message for the Paltan after coming ℍ𝕆𝕄𝔼 💙#AalaRe #MumbaiIndians #AalaRe #IPLAuction @ishankishan51 pic.twitter.com/Q9QcTQ34gL — Mumbai Indians (@mipaltan) February 12, 2022 -
యూకీ బాంబ్రీ శుభారంభం
టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. పుణేలో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో యూకీ 6–7 (10/12), 6–2, 7–5తో కొవాలిక్ (స్లొవేకియా)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్‌లో యూకీ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. మరో మ్యాచ్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (భారత్) 6–7 (5/7), 2–6తో అల్ట్‌మైర్ (జర్మనీ) చేతిలో ఓడాడు. -
భారత హాకీ జట్టులో కరోనా కలకలం..
Indian Womens Hockey Player Tested Positive For Covid: భారత మహిళల హాకీ జట్టులో కరోనా కలకలం రేపింది. సియోల్ వేదికగా జరుగుతున్న ఆసియా మహిళల హకీ టోర్నీలో భాగంగా బుధవారం భారత్, డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగాల్సి ఉండగా.. మ్యాచ్‌కు ముందు జరిపిన వైద్య పరీక్షల్లో భారత క్రీడాకారిణికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆతిధ్య జట్టుతో జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఈ విషయాన్ని దృవీకరించిన ఆసియా హాకీ ఫెడరేషన్.. మహమ్మారి బారిన పడిన క్రీడాకారిణి పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా, ఇదే టోర్నీలో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ను 13-0 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. చదవండి: ఐసీసీ అవార్డు రేసులో వార్నర్, సౌథీ.. టీమిండియా ఆటగాళ్లకు దక్కని చోటు -
ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు నిరాశ
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ క్వాలిఫయింగ్ బరిలో మిగిలిన చివరి భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. ప్రజ్నేశ్ 3–6, 4–6తో క్రిస్టోఫర్ యుబ్యాంక్స్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. క్రిస్టోఫర్ 14 ఏస్‌లు సంధించగా... ప్రజ్నేశ్ 5 ఏస్‌లను మాత్రమే కొట్టాడు. ఇతర భారత ప్లేయర్లు సుమిత్ నగాల్, రామ్‌కుమార్... మహిళల విభాగంలో అంకిత రైనా తొలి రౌండ్లోనే ఓడారు. -
ఎన్నోఏళ్ల భారత్ కల.. రేపు నిజమయ్యే ఛాన్స్!
అంతా అనుకున్నట్లు జరిగితే... ఎన్నో ఏళ్లుగా ఒలింపిక్స్‌లో భారత్‌ను ఊరిస్తోన్న అథ్లెటిక్స్ పతకం సోమవారం నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మహిళల డిస్కస్ త్రో విభాగంలో భారత క్రీడాకారిణి కమల్‌ప్రీత్ కౌర్ ప్రదర్శన పతకంపై ఆశలు రేకెత్తిస్తోంది. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న 25 ఏళ్ల ఈ పంజాబీ అమ్మాయి శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో మూడో ప్రయత్నంలో నేరుగా ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసే కనీస అర్హత మార్క్‌ను (64 మీటర్లు) అందుకుంది. అంతేకాకుండా ఫైనల్‌కు అర్హత పొందిన మొత్తం 12 మందిలో కమల్‌ప్రీత్ రెండో స్థానంలో నిలువడం విశేషం. భారత్‌కే చెందిన మరో డిస్కస్ త్రోయర్ సీమా పూనియా నాలుగోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నప్పటికీ ఈసారి కూడా క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగి నిరాశపరిచింది. టోక్యో: ఒలింపిక్స్‌లో శనివారం భారత అథ్లెట్స్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డిస్కస్ త్రో ఈవెంట్లో కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్‌కు అర్హత సాధించగా... సీమా పూనియా క్వాలిఫయింగ్‌ను దాటలేకపోయింది. పురుషుల లాంగ్‌జంప్ క్వాలిఫయింగ్‌లో శ్రీశంకర్ ఓవరాల్‌గా 25వ స్థానంలో నిలిచాడు. క్వాలిఫయింగ్ గ్రూప్ ‘బి’లో పోటీపడిన కమల్‌ప్రీత్ మూడో ప్రయత్నంలో డిస్క్‌ను 64 మీటర్ల దూరం విసిరి తన గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. తొలి ప్రయత్నంలో ఆమె డిస్క్‌ను 60.29 మీటర్లు... రెండో ప్రయత్నంలో 63.97 మీటర్ల దూరం విసిరింది. 16 పాల్గొన్న ఈ విభాగంలో వలారీ ఆల్మన్ (అమెరికా) 66.42 మీటర్లతో అగ్రస్థానాన్ని సంపాదించింది. 64 మీటర్ల దూరం విసిరితే నేరుగా ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. 15 మందితో కూడిన గ్రూప్ ‘ఎ’లో పోటీపడ్డ భారత మరో డిస్కస్ త్రోయర్ సీమా డిస్క్‌ను 60.57 మీటర్ల దూరం విసిరి ఆరో స్థానం లో నిలిచింది. మొత్తం రెండు గ్రూప్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 12 మంది ఫైనల్‌కు అర్హత సాధించారు. ఓవరాల్‌గా సీమా 16వ స్థానం లో నిలిచి ఫైనల్ బెర్త్ దక్కించుకోలేకపోయింది. సోమవారం స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం ఫైనల్ జరుగుతుంది. క్వాలిఫయింగ్‌లో కమల్ ప్రీత్ ప్రదర్శన డిఫెండింగ్ చాంపియన్ సాండ్రా పెర్కోవిచ్ (క్రొయేషియా–63.75 మీటర్లు), వరల్డ్ చాంపియన్ వైమి పెరెజ్ (క్యూబా–63.18 మీటర్లు) కంటే మెరుగ్గా ఉండటం విశేషం. దాంతో కమల్‌ప్రీత్ ఇదే ప్రదర్శనను ఫైనల్లోనూ పునరావృతం చేస్తే పతకం వచ్చే అవకాశముంది. ‘తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నందుకు కాస్త నెర్వస్‌గా ఫీలయ్యాను. అయితే తొలి త్రో వేశాక ఆత్మవిశ్వాసం పెరిగింది. ఫైనల్లో నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి భారత్‌కు పతకం అందించమే నా ఏకైక లక్ష్యం’ అని వచ్చే ఏడాది అమెరికాలో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు కూడా అర్హత పొందిన కమల్‌ప్రీత్ వ్యాఖ్యానించింది. ►పురుషుల లాంగ్‌జంప్‌లో భారత ప్లేయర్ శ్రీశంకర్ 7.69 మీటర్ల దూరం దూకి గ్రూప్ ‘బి’లో 13వ స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా 29 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో శ్రీశంకర్‌కు 25వ స్థానం దక్కింది. -
రోజు కూలీగా మారిన అంతర్జాతీయ అథ్లెట్..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 23 ఏళ్ల పంజాబ్ అథ్లెట్ హర్దీప్ కౌర్, ప్రస్తుతం కుటుంబ పోషణ నిమిత్తం దినసరి కూలీగా మారింది. రోజుకు రూ.300 సంపాదన కోసం వరి పొలాల్లో పని చేస్తుంది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో 20కి పైగా పతకాలు సాధించిన ఆమె.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా దుర్భర జీవితం కొనసాగిస్తుంది. ఓ వైపు విద్యను(ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా) అభ్యసిస్తూనే, తల్లిదండ్రులతో కలిసి కూలీ పనులకు వెళ్తుంది. 2018లో మలేషియాలో జరిగిన కరాటే పోటీల్లో స్వర్ణం సాధించిన హర్దీప్కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అప్పటి పంజాబ్ క్రీడామంత్రి రాణా గుర్మీత్ సోధీ హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అమల్లోకి రాకపోవడంతో ఆమె ఆవేదన చెందుతుంది. ఉద్యోగం కోసం ప్రభుత్వ పెద్దలను ఎన్ని సార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని, దీంతో తప్పని పరిస్థితుల్లో పొలం పనులకు వెళ్లాల్సి వస్తుందని వాపోతుంది. తండ్రి నయాబ్ సింగ్, తల్లి సుఖ్విందర్ కౌర్ తన క్రీడా భవిష్యత్తు కోసం చాలా శ్రమించారని, ఉన్నది అమ్ముకుని తనను ఈ స్థాయికి తెచ్చారని, వారి బాధ చూడలేకే తాను వారితో కలిసి పనికి వెళ్తున్నానని చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాక ఇటువంటి పరిస్థితి వస్తుందని తానెప్పుడు ఊహించలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారని ఆమె ఆశగా ఎదురు చూస్తుంది. చదవండి: ఆ ఇంగ్లీష్ బౌలర్ పీక కోస్తానన్నాడు.. అందుకే అలా చేశా -
వాళ్లు నిజంగా జాత్యహంకారులే.. ఇప్పటికీ మన యాసను ఎగతాలి చేస్తారు
న్యూఢిల్లీ: ఇంగ్లీష్ క్రికెటర్ ఓలీ రాబిన్సన్ ఎపిసోడ్‌పై భారత మాజీ వికెట్ కీపర్ ఫరూఖ్ ఇంజినీర్ స్పందించాడు. రాబిన్సన్ ఎనిమిదేళ్ల కిందట చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించాడు. అతని విషయంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) నిర్ణయం సరైందేనని, మున్ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై జీవితకాల నిషేదం విధించాలని ఈసీబీని కోరాడు. ఈ సందర్భంగా రాబిన్సన్ను వెనకేసుకొచ్చిన వారిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. గతంలో తాను లాంకషైర్ కౌంటీకి ప్రాతినిధ్యం వహించే రోజుల్లో జాతి వివక్షను ఎదుర్కొన్నానని, ఇంగ్లీష్ వాళ్లు భారతీయుల పట్ల అహంకారులుగా వ్యవహరించే వాళ్లని తెలిపాడు. వాళ్లు అప్పుడు ఇప్పుడు మన యాసను ఎగతాలి చేస్తున్నారని, వాళ్లలో జాత్యాంహంకారం బుసలు కొడుతుందని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ అయితే తరచూ బ్లడీ ఇండియన్స్ అంటూ సంబోధించేవాడని, అలాంటి వాడిని మన వాళ్లే అందలమెక్కించారని వాపోయాడు. ఈ విషయంలో ఇంగ్లీష్ క్రికెటర్ల తర్వాత ఆసీస్ ఆటగాళ్లుంటారని, వాళ్లు కూడా భారతీయుల పట్ల అహంకారపూరితంగా వ్యవహరిస్తారని పేర్కొన్నాడు. ఒకప్పుడు మనపై వివక్ష చూపిన వాళ్లంతా ఇప్పుడు ఐపీఎల్ పుణ్యమా అని మన బూట్లు నాకుతున్నారని దుయ్యబట్టాడు. ఇంగ్లీష్ క్రికెటర్లు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారని, వాళ్ల నిజస్వరూపమేంటో తనకు తెలుసునని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్ట్ అరంగేట్రం చేసిన రాబిన్సన్.. తాను టీనేజర్‌గా ఉన్న సమయంలో ఆసియా వాసులు, ముస్లింలపై జాతి వివక్ష ట్వీట్లు చేశాడన్న ఆరోపణలపై ఈసీబీ అతన్ని అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: క్రికెట్ చరిత్రలో 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే అత్యుత్తమం -
ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రజ్నేశ్
న్యూఢిల్లీ: ఒర్లాండో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం చేశాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రజ్నేశ్ 6–3, 7–5తో సాడ్లో డుంబియా (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 137వ ర్యాంకర్ ప్రజ్నేశ్ మూడు ఏస్‌లు సంధించడంతోపాటు తన ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. ఇదే టోర్నీలో ఆడుతున్న మరో భారత ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. రామ్‌కుమార్ 3–6, 4–6తో నిక్ చాపెల్ (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. -
రెండో ర్యాంక్‌లోనే రాధ
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల బౌలింగ్ టి20 ర్యాంకుల్లో... భారత ఎడంచేతి వాటం స్పిన్నర్ రాధా యాదవ్ (769 రేటింగ్ పాయింట్లు) తన రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. టాప్ స్థానంలో ఆ్రస్టేలియా బౌలర్ మెగాన్ స్కట్ (773 రేటింగ్ పాయింట్లు) ఉంది. ఇక ఇతర భారత బౌలర్లలో దీప్తి శర్మ ఒక స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోగా... పూనమ్ యాదవ్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్ విభాగంలో భారత ప్లేయర్లు తమ ర్యాంక్‌లను కాపాడుకున్నారు. జెమీమా రోడ్రిగ్స్ నాలుగో స్థానంలో ఉండగా... స్మృతి మంధాన ఐదు, హర్మన్‌ప్రీత్ కౌర్ తొమ్మిదో స్థానాల్లో నిలిచారు. ఇక మహిళల టి20 జట్ల విభాగంలో భారత్ 260 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ్రస్టేలియా 293 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
ఒకేసారి 27 రికార్డులు బద్దలు
దోహా: ఖతర్ కప్ అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ టోర్నమెంట్లో యూత్ ఒలింపిక్స్ చాంపియన్, భారత యువతార జెరెమీ లాల్రినుంగా రజత పతకం సాధించాడు. పురుషుల 67 కేజీల విభాగంలో పోటీపడిన మిజోరం లిఫ్టర్ లాల్రినుంగా మొత్తం 306 (స్నాచ్‌లో 140 కేజీల+క్లీన్ అండ్ జెర్క్‌లో 166 కేజీలు) కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 17 ఏళ్ల లాల్రినుంగా తన పేరిటే ఉన్న ఐదు సీనియర్ జాతీయ రికార్డులను, ఐదు జాతీయ జూనియర్ రికార్డులను, ఐదు జాతీయ యూత్ రికార్డులను, మూడు యూత్ వరల్డ్ రికార్డులను, మూడు ఆసియా యూత్ రికార్డులను, ఆరు కామన్వెల్త్ రికార్డులను బద్దలు కొట్టాడు. -
శభాష్ మానస్
ఫ్లోరిడా (అమెరికా): అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్లో జూనియర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీగా పరిగణించే ఎడ్డీ హెర్ జూనియర్ చాంపియన్‌షిప్ లో సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా మానస్ ధామ్నె చరిత్ర సృష్టించాడు. ఫ్లోరిడాలో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన అండర్–12 బాలుర సింగిల్స్ ఫైనల్లో పుణేకి చెందిన 11 ఏళ్ల మానస్ 3–6, 6–0, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో మాక్స్వెల్ ఎక్స్టెడ్ (అమెరికా)పై విజయం సాధించాడు. డబుల్స్ విభాగంలో మానస్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో మానస్ (భారత్)–ఆరవ్ హడా (నేపాల్) జంట 6–7 (5/7), 2–6తో సె హ్యుక్ చో–మిన్సెక్ మాయెంగ్ (కొరియా) జోడీ చేతిలో ఓడిపోయింది. జూనియర్స్ విభాగంలో ఎడ్డీ హెర్ ఓపెన్, ఆరెంజ్ బౌల్ ఓపెన్ టోర్నీలను గ్రాండ్‌స్లామ్ టోరీ్నలుగా భావిస్తారు. 2008లో యూకీ బాంబ్రీ ఆరెంజ్ బౌల్ ఓపెన్ విజేతగా నిలిచాడు. అదే ఏడాది ప్రపంచ జూనియర్ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఎడ్డీ హెర్ టోర్నీలో 90 దేశాల నుంచి 2 వేల మంది జూనియర్ ఆటగాళ్లు అండర్–12, అండర్–14, అండర్–16 బాలబాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీపడ్డారు. గతంలో షరపోవా (రష్యా), ఆండీ రాడిక్ (అమెరికా) తదితరులు ఈ టోర్నీలో విజేతలుగా నిలిచి ఆ తర్వాత సీనియర్స్ విభాగంలోనూ మెరిపించారు. -
శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ
టరొబా (ట్రినిడాడ్ అండ్ టొబాగో): వెస్టిండీస్ ‘ఎ’తో జరుగుతున్న అనధికారిక మూడో టెస్టులో భారత్ ‘ఎ’ బ్యాట్స్‌మన్ శుబ్‌మన్ గిల్ (204 నాటౌట్; 19 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఈ క్రమంలో శుబ్‌మన్ (19 ఏళ్ల 334 రోజులు) ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పిన్న వయస్కులో డబుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. 17 ఏళ్లుగా గౌతమ్ గంభీర్ పేరిట ఉన్న ఈ రికార్డును శుబ్‌మన్ బద్దలు కొట్టాడు. 2002లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ తరఫున గంభీర్ (20 ఏళ్ల 124 రోజులు) 218 స్కోరు చేశాడు. డబుల్ సెంచరీ చేసే క్రమంలో తెలుగుతేజం, కెప్టెన్ హనుమ విహారి (118 నాటౌట్; 10 ఫోర్లు, 1సిక్స్)తో కలిసి శుబ్‌మన్ అబేధ్యమైన ఐదో వికెట్‌కు 315 పరుగులు జోడించాడు. దీంతో భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌ను 90 ఓవర్లలో 4 వికెట్లకు 365 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం 373 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ‘ఎ’ కడపటి వార్తలందేసరికి రెండో ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 3 వికెట్లకు 242 పరుగులు చేసింది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో జీవన్
న్యూఢిల్లీ: గతవారం దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నమెంట్లో సెమీఫైనల్ చేరినందుకు భారత డబుల్స్ ప్లేయర్ జీవన్ నెడుంజెళియన్‌కు తగిన ఫలితం లభించింది. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో జీవన్ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. చెన్నైకు చెందిన 30 ఏళ్ల జీవన్ భారత్‌కే చెందిన పురవ్ రాజాతో కలిసి దుబాయ్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. గత ర్యాంకింగ్స్‌లో 75వ స్థానంలో ఉన్న జీవన్ ఏడు స్థానాలు ఎగబాకి 68వ ర్యాంక్‌లో నిలిచాడు. పురవ్ రాజా 17 స్థానాలు పురోగతి సాధించి 79వ ర్యాంక్‌కు చేరాడు. రోహన్ బోపన్న 38వ స్థానంలో... దివిజ్ శరణ్ 40వ స్థానంలో... లియాండర్ పేస్ 96వ స్థానంలో ఉన్నారు. సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ మూడు స్థానాలు పడిపోయి 97వ ర్యాంక్‌లో నిలిచాడు. -
తేజస్వినికి స్వర్ణం
అండర్-15 ప్రపంచ స్కూల్ చెస్ పట్టాయ : ప్రపంచ స్కూల్ చెస్ చాంపియన్‌షిప్ అండర్-15 బాలికల విభాగంలో భారత క్రీడాకారిణి తేజస్విని సాగర్ స్వర్ణం సాధించింది. తొమ్మిది రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో ఈ ఔరంగాబాద్ అమ్మాయి ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అండర్-15 బాలుర విభాగంలో ఆనంద్ నాడార్, అండర్-17 బాలికల విభాగంలో సలోని రజతాలు సాధించారు.