Indian Womens Hockey Player Tested Positive For Covid: భారత మహిళల హాకీ జట్టులో కరోనా కలకలం రేపింది. సియోల్ వేదికగా జరుగుతున్న ఆసియా మహిళల హకీ టోర్నీలో భాగంగా బుధవారం భారత్, డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగాల్సి ఉండగా.. మ్యాచ్‌కు ముందు జరిపిన వైద్య పరీక్షల్లో భారత క్రీడాకారిణికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆతిధ్య జట్టుతో జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఈ విషయాన్ని దృవీకరించిన ఆసియా హాకీ ఫెడరేషన్.. మహమ్మారి బారిన పడిన క్రీడాకారిణి పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా, ఇదే టోర్నీలో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ను 13-0 గోల్స్ తేడాతో చిత్తు చేసింది.
చదవండి: ఐసీసీ అవార్డు రేసులో వార్నర్, సౌథీ.. టీమిండియా ఆటగాళ్లకు దక్కని చోటు
భారత హాకీ జట్టులో కరోనా కలకలం..
Published Wed, Dec 8 2021 4:25 PM | Last Updated on Wed, Dec 8 2021 6:41 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment