Womens hockey tournament
-
జాతీయ మహిళల హాకీ విజేత హరియాణా
పుణే: జాతీయ సీనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌ను హరియాణా సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో షూటౌట్ ద్వారా హరియాణా 3–0తో ఆతిథ్య మహారాష్ట్రను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1 గోల్స్‌తో సమంగా నిలిచాయి. హరియాణా తరఫున దీపిక పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించగా...మహారాష్ట్ర తరఫున అక్షత గోల్‌తో స్కోరు సమం చేసింది. షూటౌట్లో హరియాణా ప్లేయర్లలో నవనీత్ కౌర్, ఉష, సోనిక స్కోర్ చేయగా... మహారాష్ట్ర ప్లేయర్లలో ప్రియాంక, ఆకాంక్ష, రుతుజ గోల్ చేయడంలో విఫలమయ్యారు. -
విజేత భారత్
బార్సిలోనా: స్పెయిన్ హాకీ సమాఖ్య శతాబ్ది ఉత్స వాలను పురస్కరించుకొని నిర్వహించిన మూడు దేశాల మహిళల టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీ లో భారత జట్టు రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని ఎనిమిది పాయింట్లతో అజేయంగా నిలిచి టైటిల్ సాధించింది. ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–0తో స్పెయిన్‌పై గెలిచింది. భారత్ తరఫున వందన కటారియా (22వ ని.లో), మోనిక (48వ ని.లో), ఉదిత (58వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. పురుషుల జట్టుకు కాంస్యం ఇదే టోర్నీ పురుషుల విభాగంలో భారత జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 2–1 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్‌పై గెలిచింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (15వ ని.లో), దిల్‌ప్రీత్ సింగ్ (50వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... నెదర్లాండ్స్ జట్టుకు థియరీ బ్రింక్‌మన్ (25వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. -
నేషన్స్ కప్ మహిళల హాకీ టోర్నీ విజేత భారత్
వాలెన్సియా: తొలిసారి నిర్వహించిన నేషన్స్ కప్ అంతర్జాతీయ మహిళల హాకీ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో సవితా పూనియా నాయకత్వంలోని టీమిండియా 1–0 గోల్ తేడాతో ఆతిథ్య స్పెయిన్ జట్టును ఓడించింది. ఆరో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గుర్జీత్ కౌర్ గోల్‌గా మలిచింది. ఈ విజయంతో భారత్ 2023–2024 ప్రొ లీగ్‌కు నేరుగా అర్హత సాధించింది. టైటిల్ నెగ్గిన భారత జట్టు సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున హాకీ ఇండియా నగదు పురస్కారం ప్రకటించింది. చదవండి: FIFA WC 2022: మొరాకోపై ఘన విజయం.. మూడోస్థానం క్రొయేషియాదే -
భారత హాకీ జట్టులో కరోనా కలకలం..
Indian Womens Hockey Player Tested Positive For Covid: భారత మహిళల హాకీ జట్టులో కరోనా కలకలం రేపింది. సియోల్ వేదికగా జరుగుతున్న ఆసియా మహిళల హకీ టోర్నీలో భాగంగా బుధవారం భారత్, డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగాల్సి ఉండగా.. మ్యాచ్‌కు ముందు జరిపిన వైద్య పరీక్షల్లో భారత క్రీడాకారిణికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆతిధ్య జట్టుతో జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఈ విషయాన్ని దృవీకరించిన ఆసియా హాకీ ఫెడరేషన్.. మహమ్మారి బారిన పడిన క్రీడాకారిణి పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా, ఇదే టోర్నీలో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ను 13-0 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. చదవండి: ఐసీసీ అవార్డు రేసులో వార్నర్, సౌథీ.. టీమిండియా ఆటగాళ్లకు దక్కని చోటు -
విజేత భారత్
కాన్బెర్రా (ఆ్రస్టేలియా): మూడు దేశాల జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–2 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో భారత్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ జట్లు పాల్గొన్న ఈ టోర్నీ లో భారత్, ఆసీస్ 7 పాయింట్లతో సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా భారత్‌కు (+4) టైటిల్ ఖాయంకాగా... ఆసీస్ (+1) రన్నరప్‌గా నిలిచింది. ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచిన భారత్... ఒకదాంట్లో ఓడి మరొక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. న్యూజిలాండ్ మూడో స్థానంలో నిలిచింది. టోర్నీ మొత్తం అదరగొట్టిన యువ భారత్ చివరి మ్యాచ్‌లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో 1–2తో ఓడిపోయింది. ఆసీస్ తరఫున ఎబిగైల్ విల్సన్ రెండు గోల్స్ చేయగా... భారత్‌కు గగన్‌దీప్ ఒక గోల్ అందించింది. -
చాంపియన్ భారత్
హిరోషిమా: మహిళల హాకీ సిరీస్ ఫైనల్స్ టోర్నీ చాంపియన్‌గా భారత్ అవతరించింది. ఇప్పటికే ఫైనల్స్ చేరడం ద్వారా ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించిన భారత్ హిరోషిమాలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 3–1 గోల్స్ తేడాతో ఆతిథ్య జపాన్‌పై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన తుది పోరులో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న భారత్ జపాన్ను మట్టికరిపించింది. భారత్ తరపున మరోసారి రాణించిన గుర్జిత్ కౌర్ రెండు గోల్స్(45వ, 60వ నిమిషంలో) సాధించి విజయంలో కీలకపాత్ర పోషించింది. రాణి రాంపాల్(3వ నిమిషంలో) మరో గోల్ నమోదు చేసింది. జపాన్ తరపున నమోదైన ఏకైక గోల్‌ను మోరి కనోన్(11వ నిమిషంలో) సాధించింది. మ్యాచ్ మొత్తంలో భారత్ 26 సార్లు జపాన్ రక్షణ వలయంలోకి ప్రవేశించగా, జపాన్ కేవలం 13 సార్లు మాత్రమే భారత్ రక్షణ వలయంలోకి ప్రవేశించింది. మ్యాచ్‌లో భారత్‌కు 8 పెనాల్టీ కార్నర్స్ లభించగా జపాన్‌కు కేవలం 2 మాత్రమే లభించాయి. భారత్ సాధించిన మూడు గోల్స్ కూడా పెనాల్టీ కార్నర్ల రూపంలో రావడం విశేషం. టోర్నీలో అపజయం ఎరుగని భారత్ మొత్తం 27 గోల్స్ చేయగా కేవలం 4 గోల్స్‌ను మాత్రమే ప్రత్యర్థులకు సమర్పించుకుంది. భారత కెప్టెన్ రాణి రాంపాల్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలవగా, గుర్జీత్ కౌర్ టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచింది. అంతకుముందు 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో చిలీ 3–1తో పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 3–3 గోల్స్‌తో సమంగా ఉండటంతో షూటౌట్లో విజేతను నిర్ణయించారు. -
మహిళల హాకీ జట్టు బోణీ
యాంట్‌వర్ప్ (బెల్జియం): ఆరు దేశాల అండర్23 మహిళల అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. శనివారం తొలి మ్యాచ్‌లో భారత్ 41 గోల్స్ తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. ప్రీతి దూబే నాయకత్వంలో బరిలోకి దిగిన భారత జట్టుకు ఈ మ్యాచ్‌లో ఐదో నిమిషంలో షాక్ తగిలింది. ఎడెల్ నిలాండ్ గోల్‌తో ఐర్లాండ్ 10 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వెంటనే తేరుకున్న భారత్ 11వ నిమిషంలో జ్యోతి గోల్‌తో స్కోరును సమం చేసింది. 22వ నిమిషంలో ముంతాజ్ ఖాన్ భారత ఆధిక్యాన్ని 21కి పెంచగా... 28వ, 37వ నిమిషంలో మన్‌ప్రీత్ కౌర్ రెండు గోల్స్ చేయడంతో భారత విజయం ఖాయమైంది. -
ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీకి రజని
ఈనెల 28న జపాన్‌లో మొదలయ్యే ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు రాణి రాంపాల్ నేతృత్వం వహించనుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రజని ఎతిమరపు రెండో గోల్‌కీపర్‌గా జట్టులో స్థానాన్ని నిలబెట్టుకుంది. మరో గోల్‌కీపర్ సవిత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. కొత్త కోచ్ హరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో తొలి టోర్నీలో బరిలోకి దిగుతున్న భారత్ విజేతగా నిలిస్తే వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. -
సెమీస్‌లో భారత్ పరాజయం
బ్యాంకాక్: ఆసియా కప్ అండర్–18 మహిళల హాకీ టోర్నమెంట్లో భారత్ సెమీఫైనల్లో ఓడిపోయింది. జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షూటౌట్లో టీమిండియా 2–4 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. నిర్ణీత సమయానికి రెండు జట్లు 1–1తో సమఉజ్జీగా నిలువడంతో ఫలితం తేలడానికి షూటౌట్‌ను నిర్వహించారు.