
యాంట్‌వర్ప్ (బెల్జియం): ఆరు దేశాల అండర్23 మహిళల అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. శనివారం తొలి మ్యాచ్‌లో భారత్ 41 గోల్స్ తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. ప్రీతి దూబే నాయకత్వంలో బరిలోకి దిగిన భారత జట్టుకు ఈ మ్యాచ్‌లో ఐదో నిమిషంలో షాక్ తగిలింది.
ఎడెల్ నిలాండ్ గోల్‌తో ఐర్లాండ్ 10 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వెంటనే తేరుకున్న భారత్ 11వ నిమిషంలో జ్యోతి గోల్‌తో స్కోరును సమం చేసింది. 22వ నిమిషంలో ముంతాజ్ ఖాన్ భారత ఆధిక్యాన్ని 21కి పెంచగా... 28వ, 37వ నిమిషంలో మన్‌ప్రీత్ కౌర్ రెండు గోల్స్ చేయడంతో భారత విజయం ఖాయమైంది.
Comments
Please login to add a commentAdd a comment