![National womens hockey champion Haryana - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/24/hocky.jpg.webp?itok=Kngo0vTt)
పుణే: జాతీయ సీనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌ను హరియాణా సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో షూటౌట్ ద్వారా హరియాణా 3–0తో ఆతిథ్య మహారాష్ట్రను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1 గోల్స్‌తో సమంగా నిలిచాయి.
హరియాణా తరఫున దీపిక పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించగా...మహారాష్ట్ర తరఫున అక్షత గోల్‌తో స్కోరు సమం చేసింది. షూటౌట్‌లో హరియాణా ప్లేయర్లలో నవనీత్ కౌర్, ఉష, సోనిక స్కోర్ చేయగా... మహారాష్ట్ర ప్లేయర్లలో ప్రియాంక, ఆకాంక్ష, రుతుజ గోల్ చేయడంలో విఫలమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment