
వాలెన్సియా: తొలిసారి నిర్వహించిన నేషన్స్ కప్ అంతర్జాతీయ మహిళల హాకీ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో సవితా పూనియా నాయకత్వంలోని టీమిండియా 1–0 గోల్ తేడాతో ఆతిథ్య స్పెయిన్ జట్టును ఓడించింది.
ఆరో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గుర్జీత్ కౌర్ గోల్‌గా మలిచింది. ఈ విజయంతో భారత్ 2023–2024 ప్రొ లీగ్‌కు నేరుగా అర్హత సాధించింది. టైటిల్ నెగ్గిన భారత జట్టు సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున హాకీ ఇండియా నగదు పురస్కారం ప్రకటించింది.
చదవండి: FIFA WC 2022: మొరాకోపై ఘన విజయం.. మూడోస్థానం క్రొయేషియాదే