india hockey team
-
హ్యాట్రిక్ గోల్స్.. భారత మహిళల ఘన విజయం
బార్సిలోనా: స్పానిష్ హాకీ ఫెడరేషన్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న టోర్నీలో భారత మహిళల జట్టుకు తొలి విజయం దక్కింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–0 గోల్స్ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. భారత్ తరఫున అన్నీ గోల్స్ తానే సాధించిన లాల్రెమ్సియామి ‘హ్యాట్రిక్’ నమోదు చేయడం విశేషం. మ్యాచ్ 13వ, 17వ, 56వ నిమిషాల్లో ఆమె మూడు ఫీల్డ్ గోల్స్ కొట్టింది. మొదటి, రెండో క్వార్టర్లో ఒక్కో గోల్ సాధించిన భారత్ చివరి క్వార్టర్లో మరో గోల్‌తో ముగించింది. ఈ టోరీ్నలో రౌండ్ రాబిన్ లీగ్ దశలో ఇంగ్లండ్, స్పెయిన్లతో తొలి రెండు మ్యాచ్‌లను భారత్ ‘డ్రా’గా ముగించింది. సవితా పూనియా నాయకత్వంలోని మన జట్టు తమ తర్వాతి పోరులో నేడు స్పెయిన్‌తో తలపడుతుంది. -
వేల్స్‌పై టీమిండియా ఘన విజయం.. అయినా ఖరారు కాని క్వార్టర్స్ బెర్త్
ఒడిశా వేదికగా జరుగుతున్న పురుషుల హాకీ వరల్డ్‌కప్-2023లో టీమిండియా క్వార్టర్ ఫైనల్ దిశగా ఆడుగులు వేస్తుంది. పూల్-డిలో ఇవాళ (జనవరి 19) వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్.. 4-2 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి, క్వార్టర్స్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. పూల్-డిలో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రా) నేరుగా క్వార్టర్స్‌కు చేరుకోగా.. రెండో స్థానంలో నిలిచిన భారత్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రా).. పూల్-సిలో మూడో ప్లేస్ ఉన్న న్యూజిలాండ్‌తో క్రాస్ ఓవర్ మ్యాచ్ (ఆదివారం) ఆడి గెలవాల్సి ఉంటుంది. వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశ్‌దీప్ సింగ్ 2 గోల్స్ చేయగా.. షంషేర్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ తలో గోల్ సాధించారు. వేల్స్ తరఫున గ్యారెత్ ఫర్లాంగ్, జాకబ్ డ్రాపర్ చెరో గోల్ చేశారు. -
నేషన్స్ కప్ మహిళల హాకీ టోర్నీ విజేత భారత్
వాలెన్సియా: తొలిసారి నిర్వహించిన నేషన్స్ కప్ అంతర్జాతీయ మహిళల హాకీ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో సవితా పూనియా నాయకత్వంలోని టీమిండియా 1–0 గోల్ తేడాతో ఆతిథ్య స్పెయిన్ జట్టును ఓడించింది. ఆరో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గుర్జీత్ కౌర్ గోల్‌గా మలిచింది. ఈ విజయంతో భారత్ 2023–2024 ప్రొ లీగ్‌కు నేరుగా అర్హత సాధించింది. టైటిల్ నెగ్గిన భారత జట్టు సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున హాకీ ఇండియా నగదు పురస్కారం ప్రకటించింది. చదవండి: FIFA WC 2022: మొరాకోపై ఘన విజయం.. మూడోస్థానం క్రొయేషియాదే -
'సొంత గడ్డపై భారత జట్టు ప్రపంచ కప్ గెలుస్తుంది’
న్యూఢిల్లీ: వచ్చే నెలలో సొంతగడ్డపై జరిగే హాకీ ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలుస్తుందని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ ఆతిథ్యమిచ్చే ఈ పురుషుల హాకీ టోర్నీ భువనేశ్వర్, రూర్కేలా వేదికలపై జనవరి 13 నుంచి 29 వరకు జరుగనుంది. వరల్డ్ కప్ ట్రోఫీ టూర్లో భాగంగా శుక్రవారం ట్రోఫీ రాజధాని నగరం ఢిల్లీకి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ‘ప్రపంచకప్ సమరం కోసం భారత జట్టు పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. 15 పోటీ జట్ల నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురైనా ధీటుగా ఎదుర్కొంటుంది. భారత్ సన్నాహాలు, సన్నద్ధత చూస్తుంటే మరోసారి ప్రపంచ చాంపియన్ అవుతుందని అనిపిస్తుంది. జట్టు సభ్యులంతా కఠోరంగా శ్రమించారు. అందరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ప్రపంచకప్ మాత్రమే కాదు... పారిస్ ఒలింపిక్స్‌లోనూ భారత జట్టు సత్తా చాటుతుంది’ అని అన్నారు. ఒకప్పుడు హాకీలో భారత్‌కు ఘనచరిత్ర ఉంది. చివరి సారిగా భారత్ 47 ఏళ్ల క్రితం కౌలాలంపూర్ (1975)లో జరిగిన ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది. చదవండి: IND-W vs AUS-W: సిరీస్‌లో నిలవాలంటే.. గెలవాల్సిందే! భారత్ తుది జట్టు ఇదే? -
ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌పై భారత్ విజయం
భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ టోర్నీని భారత జట్టు విజయంతో మొదలు పెట్టింది. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4–3 గోల్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. ఒక దశలో 2–3తో వెనుకబడినా... కోలుకొని భారత్ చివరకు విజేతగా నిలవడం విశేషం. భారత్ తరఫున మన్దీప్ మోర్ (13వ నిమిషం), హర్మన్‌ప్రీత్ సింగ్ (41) రెండు గోల్స్ చేయగా... స్యామ్ లేన్ (23వ నిమిషం, 35) రెండు గోల్స్, జేక్ స్మిత్ (34) ఒక గోల్ సాధించారు. ఫలితంగా మూడో క్వార్టర్ ముగిసే సరికి కివీస్ 3–2తో ముందంలో ఉంది. అయితే నాలుగో క్వార్టర్లో చెలరేగిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మన్దీప్ సింగ్ 51వ, 56వ నిమిషాల్లో గోల్స్ సాధించి జట్టు గెలుపు బాట పట్టించాడు. ఇరు జట్లు అటాకింగ్‌కు ప్రాధాన్యతనివ్వగా, అర్ధ భాగం ముగిసే సరికి స్కోరు 1–1తో సమమైంది. మూడో క్వార్టర్ చివర్లో సుమీత్కు ఎల్లో కార్డు చూపించడంతో 10 నిమిషాలు అతను ఆటకు దూరం కాగా 10 మందితోనే భారత్ పోరాడింది. చదవండి: ISL 2022: ముంబై చేతిలో కేరళ ఓటమి -
పతకం దిశగా దూసుకుపోతున్న భారత అమ్మాయిలు
కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు పతకం దిశగా దూసుకుపోతుంది. క్వార్టర్ ఫైనల్లో భారత అమ్మాయిలు కెనడాపై 3-2 తేడాతో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టారు. ఈ విజయంతో భారత్ ఆరు పాయింట్లతో గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచింది. భారత్ గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఘనాపై 5-0 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించిన భారత్.. ఆతర్వాతి మ్యాచ్‌లో వేల్స్‌పై 3-1 తేడాతో గెలుపొందింది. అయితే ఇంగ్లండ్‌తో తదుపరి జరిగిన మ్యాచ్‌లో 1-3 తేడాతో ఓటమిపాలవ్వడంతో భారత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. అనంతరం కెనడాతో మ్యాచ్‌లో పుంజుకున్న భారత అమ్మాయిలు.. అద్భుతంగా రాణించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్నారు. సలీమా టెటె, నవనీత్ కౌర్, లాల్రెమ్సియామి తలో గోల్ సాధించారు. ఈ విజయంతో భారత్.. కెనడాతో సమానంగా ఆరు పాయింట్లు సాధించినప్పటికీ, ఎక్కువ గోల్స్ చేసిన కారణంగా కెనడా గ్రూప్-ఏలో అగ్ర జట్టు హోదాలో సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే, ఆరో రోజు లవ్‌ప్రీత్ సింగ్ కాంస్యం సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. మరో 3 పతకాలు భారత జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. తదుపరి మ్యాచ్‌ల్లో భారత అథ్లెట్లు ఓడినప్పటికీ కనీసం ఓ రజతం, రెండు కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరనున్నాయి. మహిళల జూడో 78 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన తులికా మాన్ సిల్వర్ మెడల్‌పై కర్చీఫ్ వేయగా.. పురుషుల బాక్సింగ్ 57 కేజీల విభాగంలో హుసముద్దీన్ ముహమ్మద్ కనీసం కాంస్యం, మహిళల 45-48 కేజీల విభాగంలో నీతు మరో కాంస్యాన్ని ఖరారు చేశారు. చదవండి: CWG 2022: మరో మూడు పతకాలు ఖాయం చేసిన భారత అథ్లెట్లు -
కామన్వెల్త్ గేమ్స్‌కు భారత హాకీ జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: ఆసియా క్రీడలు వాయిదా పడటంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అగ్రశ్రేణి ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది. వచ్చే నెల 28 నుంచి బర్మింగ్హమ్లో జరిగే ఈ క్రీడల్లో పాల్గొనే 18 మంది సభ్యులుగల భారత హాకీ జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రకటించింది. ఇటీవల ప్రొ హాకీ లీగ్ మ్యాచ్‌ల కోసం మన్‌ప్రీత్ స్థానంలో అమిత్ రోహిదాస్‌ను జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే చైనాలో కరోనా ఉధృతితో ఈ ఏడాది జరగాల్సిన ఆసియా క్రీడలు వాయిదా పడ్డాయి. దాంతో హాకీ ఇండియా కామన్వెల్త్ గేమ్స్ కోసం అగ్రశ్రేణి ఆటగాళ్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో రెండుసార్లు రజత పతకాలు నెగ్గిన భారత్ ఈసారి పూల్ ‘బి’లో ఇంగ్లండ్, కెనడా, వేల్స్, ఘనా జట్లతో ఆడుతుంది. భారత పురుషుల హాకీ జట్టు: మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), హర్మన్‌ప్రీత్ సింగ్ (వైస్ కెప్టెన్), పీఆర్ శ్రీజేష్, కృషన్ బహదూర్ పాథక్ (గోల్ కీపర్లు), జుగ్రాజ్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, షంషేర్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, మన్దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, వరుణ్ కుమార్, సురేందర్ కుమార్, అమిత్ రోహిదాస్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్. చదవండి: వింబుల్డన్ ఆడేందుకు రష్యా పౌరసత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైన టెన్నిస్ క్రీడాకారిణి -
ప్రొ హాకీ లీగ్.. మూడో స్థానంతో బారత్ ముగింపు
రోటర్‌డామ్: ప్రొ హాకీ లీగ్ 2021–2022 సీజన్‌ను భారత పురుషుల జట్టు మూడో స్థానంతో ముగించింది. నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–2 గోల్స్‌తో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో విజయంతో నెదర్లాండ్స్ చాంపియన్‌గా నిలిచింది. భారత్ తరఫున అభిషేక్ తొలి నిమిషంలోనే గోల్ చేయగా... ఏడో నిమిషంలో నెదర్లాండ్స్ జట్టుకు జాన్సెన్ గోల్ అందించి స్కోరును సమం చేశాడు. 45వ నిమిషంలో జోరిట్ క్రూన్ గోల్‌తో నెదర్లాండ్స్ విజయాన్ని ఖాయం చేసుకుంది. తొమ్మిది జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో భారత్ మొత్తం 16 మ్యాచ్‌లు ఆడి 30 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకుంది. ఎనిమిది మ్యాచ్‌ల్లో నిర్ణీత సమయంలోపు గెలిచిన భారత్, రెండింటిలో ‘షూటౌట్’ ద్వారా విజయం అందుకుంది. ‘షూటౌట్’లో రెండు మ్యాచ్‌ల్లో, నిర్ణీత సమయంలోపు నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి పాలైంది. మరోవైపు మహిళల ప్రొ హాకీ లీగ్‌లో అర్జెంటీనాతో మ్యాచ్ లో భారత్ 2–3తో ఓడిపోయింది. ఈ విజయంతో అర్జెంటీనా టైటిల్‌ను ఖరారు చేసుకుంది. చదవండి: Matteo Berrettini: 'నన్ను పెళ్లి చేసుకుంటావా'.. టెన్నిస్ స్టార్‌కు వింత అనుభవం -
ప్రొ హాకీ లీగ్‌లో బెల్జియంతో భారత్ ‘ఢీ’
అమిత్ రోహిదాస్ కెప్టెన్సీలోని భారత జట్టు నేడు ఆంట్వర్ప్లో జరిగే ప్రొ హాకీ లీగ్‌లో బెల్జియం జట్టుతో ఆడనుంది. రెండు జట్లూ 27 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ప్రదర్శనపైనే అందరి దృష్టి ఉంది. ఈ లీగ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ మొత్తం 16 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1, డిస్నీ–హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. చదవండి:Indonesia Masters 2022: సింధు నిష్క్రమణIndonesia Masters 2022: సింధు నిష్క్రమణ -
దక్షిణ కొరియాతో భారత్ పోరు.. ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...!
జకార్తా: మలేసియాతో గెలవాల్సిన మ్యాచ్‌ను ఆఖరి నిమిషాల్లో ‘డ్రా’ చేసుకున్న భారత్ ఆసియా కప్ హాకీ టోర్నీ సూపర్–4 రౌండ్ రాబిన్ లీగ్ చివరి మ్యాచ్‌లో నేడు దక్షిణ కొరియాతో తలపడనుంది. ఎలాంటి సమీకరణాలపై ఆధారపడకుండా దక్షిణ కొరియాపై విజయం సాధించి దర్జాగా ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. లీగ్ దశలోని రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య సూపర్–4 రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. సూపర్–4 రౌండ్ మ్యాచ్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ చేరుకుంటాయి. ప్రస్తుతం రెండు మ్యాచ్‌లు ముగిశాక కొరియా, భారత్ ఖాతాలో నాలుగు పాయింట్ల చొప్పున సమంగా ఉన్నాయి. మెరుగైన గోల్స్ సగటుతో కొరియా తొలి స్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. రెండు పాయింట్లతో మలేసియా మూడో స్థానంలో, పాయింట్లేమీ సాధించని జపాన్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఫైనల్ రేసు నుంచి జపాన్ నిష్క్రమించగా... నేడు జపాన్‌తో జరిగే మ్యాచ్‌లో మలేసియా గెలిస్తే ఆ జట్టు పాయింట్ల సంఖ్య ఐదుకు చేరుకుంటుంది. ఒకవేళ జపాన్‌తో మ్యాచ్‌ను మలేసియా ‘డ్రా’ చేసుకున్నా, లేదా ఓడిపోయినా... భారత్, కొరియా జట్లకు తమ మ్యాచ్‌కు ముందే ఫైనల్ బెర్త్‌లు ఖరారవుతాయి. చదవండి: ఐదేళ్ల స్నేహం! వివాహ బంధంతో ఒక్కటైన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు -
FIH Hockey Pro League: విజయంతో భారత్ ముగింపు
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో స్వదేశీ అంచె మ్యాచ్‌లను భారత పురుషుల జట్టు విజయంతో ముగించింది. జర్మనీ జట్టుతో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో అమిత్ రోహిదాస్ సారథ్యంలోని భారత్ 3–1తో గెలిచింది. టీమిండియా తరఫున సుఖ్జీత్ సింగ్ (19వ ని.లో), వరుణ్ (41వ ని.లో), అభిషేక్ (54వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. జర్మనీ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను బోయెకెల్ (45వ ని.లో) సాధించాడు. తొమ్మిది జట్లు బరిలో ఉన్న ఈ లీగ్‌లో 12 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్ 27 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... జర్మనీ 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లను ఆంట్వర్ప్లో బెల్జియంతో జూన్ 11, 12న... రోటర్‌డామ్‌లో నెదర్లాండ్స్‌తో జూన్ 18, 19న తలపడుతుంది. చదవండి: IPL 2022: దీపక్ చహర్ ఔట్.. సీఎస్కే అధికారిక ప్రకటన -
తొలి మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతం
భువనేశ్వర్: ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా స్పెయిన్ పురుషుల జట్టుతో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతం చేసింది. ఒక దశలో 1–4తో వెనుకబడి ఓటమి ఖాయమనుకున్న స్థితి నుంచి టీమిండియా అనూహ్యంగా తేరుకుంది. వరుసగా నాలుగు గోల్స్ సాధించి చివరకు 5–4తో విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మరో ఎనిమిది సెకన్లలో ముగుస్తుందనగా హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్‌ను లక్ష్యానికి చేర్చి భారత్‌ను గెలిపించాడు. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (15వ, 60వ ని.లో) రెండు గోల్స్ చేయగా... శిలా నంద్ లాక్రా (41వ ని.లో), షంషేర్ సింగ్ (43వ ని.లో), వరుణ్ కుమార్ (55వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. స్పెయిన్ జట్టుకు కెప్టెన్ మార్క్ మిరాలెస్ (20వ, 23వ, 40వ ని.లో) మూడు గోల్స్, పౌ కునిల్ (14వ ని.లో) ఒక గోల్ అందించారు. మహిళల జట్టూ గెలిచింది... మహిళల ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా స్పెయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2–1తో విజయం సాధించింది. ఆట 18వ నిమిషంలో మార్టా సెగూ గోల్‌తో స్పెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 20వ నిమిషంలో జ్యోతి గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. అనంతరం 52వ నిమిషంలో నేహా చేసిన గోల్‌తో భారత్ 2–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. ప్రొ లీగ్‌లో భారత్‌కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. ఇటీవల ఒమన్‌లో చైనాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలుపొందింది. -
Indian Team: భారత్ ఘనవిజయం
FIH Hockey Pro League- పాచెఫ్స్ట్రోమ్ (దక్షిణాఫ్రికా): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) పురుషుల ప్రొ లీగ్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఫ్రాన్స్ జట్టుతో మంగళవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి క్వార్టర్లో భారత్‌ను గోల్ చేయనీకుండా నిలువరించిన ఫ్రాన్స్ ఆ తర్వాత చేతులెత్తేసింది. భారత్ తరఫున ‘డ్రాగ్ ఫ్లికర్’ హర్మన్‌ప్రీత్ సింగ్ (21వ ని.లో), వరుణ్ కుమార్ (24వ ని.లో), షంషేర్ సింగ్ (28వ ని.లో), మన్దీప్ సింగ్ (32వ ని.లో), కెరీర్లో 200వ మ్యాచ్ ఆడిన ఆకాశ్‌దీప్ సింగ్ (41వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. బుధవారం జరిగే మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ ఆడుతుంది. చదవండి: Ranji Trophy 2022: టీమిండియాలో స్థానం కోసం పోరాటం.. ప్రత్యర్థులుగా రహానే, పుజారా! -
Hockey Pro League: ఫ్రాన్స్‌తో భారత్ ‘ఢీ’
పొచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): ఈ ఏడాది ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్లకు ముందు మేటి జట్లతో మ్యాచ్‌లు ఏర్పాటు చేయడం జట్టుకు కలిసొస్తుందని భారత పురుషుల హాకీ జట్టు వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్‌లో భాగంగా భారత్... దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌లతో తలపడనుంది. మంగళవారం మొదలయ్యే ప్రొ లీగ్ కొత్త సీజన్ తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో భారత్ ఆడనుంది. ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ ‘ఈ సీజన్లో శుభారంభం చేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. మాకు ఎదురుపడే జట్లు గట్టి ప్రత్యర్థులు. మెగా ఈవెంట్ పోటీలకు ఇలాంటి మ్యాచ్‌లు ఉపకరిస్తాయి. సానుకూల ధోరణితో ఈ సీజన్‌ను ఆరంభిస్తాం. కామన్వెల్త్, ఆసియా క్రీడలతో ఈ ఏడాదంతా మాకు బిజీ షెడ్యూల్ ఉంది. ఇందుకోసం మేమంతా బాగా సన్నద్ధమయ్యే వచ్చాం’ అని అన్నాడు. చదవండి: 25 ఏళ్ల తర్వాత పాక్ పర్యటనకు.. జట్టును ప్రకటించిన ఆసీస్ -
సెమీస్‌లో భారత్‌కు షాక్..
ఢాకా: రౌండ్ రాబిన్ లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత పురుషుల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో బోల్తా కొట్టింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 3–5 గోల్స్ తేడాతో జపాన్ చేతిలో ఓడింది. జపాన్ జట్టుకు షోటా యమాడా (1వ ని.లో), రైకి ఫుజిషిమా (2వ ని.లో), యోషికి కిరిషిటా (29వ ని.లో), కొసె కవాబె (35వ ని.లో), ర్యోమా ఊకా (41వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్ (17వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (53వ ని.లో), హార్దిక్ సింగ్ (58వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. నేడు కాంస్య పతకం కోసం పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. తొలి సెమీఫైనల్లో దక్షిణ కొరియా 6–5తో గోల్స్ తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి జపాన్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. చదవండి: IND vs SA: ఎవరికి అవకాశం ఇద్దాం!.. తల పట్టుకుంటున్న కోహ్లి, ద్రవిడ్ -
తొలి పోరులో ఫ్రాన్స్ చేతిలో భారత్ పరాజయం..
భువనేశ్వర్: ప్రతిష్టాత్మక జూనియర్ హాకీ ప్రపంచ కప్ మొదటి పోరులో భారత్ తడబడింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాతో టోర్నీలో అడుగుపెట్టిన భారత జూనియర్ జట్టు... ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. బుధవారం గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 4–5 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ చేతిలో ఓడింది. భారత్ తరఫున సంజయ్ మూడు గోల్స్ (15, 57, 58వ నిమిషాల్లో) చేయగా... ఉత్తమ్ సింగ్ ఒక గోల్ (10వ నిమిషంలో) సాధించాడు. ఫ్రాన్స్ ప్లేయర్ క్లెమెంట్ టిమోతీ మూడు గోల్స్ (1, 23, 32వ నిమిషాల్లో), బెంజమిన్ (7వ నిమిషంలో), కొరెంటిన్ (48వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. రెండు నిమిషాల్లో రెండు గోల్స్ చేసినా... మ్యాచ్ తొలి నిమిషంలోనే భారత రక్షణ శ్రేణిని ఛేదించిన ఫ్రాన్స్ ఆటగాడు టిమోతీ ఫీల్డ్ గోల్ సాధించాడు. మరో ఆరు నిమిషాల తర్వాత బెంజమిన్ మరో ఫీల్డ్ గోల్ చేసి ఫ్రాన్స్‌కు 2–0 ఆధిక్యాన్నిచ్చాడు. ఫ్రాన్స్ అటాకింగ్ నుంచి తేరుకున్న భారత్ వెంట వెంటనే రెండు గోల్స్ చేసి స్కోరును 2–2తో సమం చేసింది. ఆ వెంటనే ఫ్రాన్స్ మరో మూడు గోల్స్ చేసి తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఆట ఆఖరి నిమిషాల్లో వేగం పెంచిన భారత్ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై పదే పదే దాడులు చేసింది. ఈ క్రమంలో భారత్ రెండు నిమిషాల్లో రెండు గోల్స్ చేసి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించేలా కనిపించింది. 57, 58వ నిమిషాల్లో లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా గోల్స్‌గా మలిచిన సంజయ్ ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 5–4కు తగ్గించాడు. అనంతరం మరో గోల్ సాధించడంలో విఫలమైన భారత్ ఓటమిని ఆహ్వానించింది. మ్యాచ్‌లో భారత్‌కు మొత్తం ఏడు పెనాల్టీ కార్నర్స్ లభించగా వాటిలో మూడింటిని మాత్ర మే గోల్స్‌గా మలిచి మూల్యం చెల్లించుకుంది. చదవండి: WI Vs SL: పరాజయం దిశగా విండీస్... విజయానికి నాలుగు వికెట్ల దూరంలో శ్రీలంక.. -
భారత హాకీ ప్లేయర్ల పై కాసుల వర్షం
-
Tokyo Olympics: 49 ఏళ్ల తర్వాత సెమీస్‌లో
జాతీయ క్రీడకు కొత్త ఊపిరి వచ్చింది. విశ్వ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు మెరిసింది. ఏకంగా 49 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లో మళ్లీ టీమిండియా సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత్ ఫైనల్ చేరి స్వర్ణ పతకం సాధించినా... ఆ క్రీడల్లో నాకౌట్ ఫార్మాట్‌ను నిర్వహించలేదు. ఆరు జట్లు మాత్రమే పాల్గొనడంతో లీగ్ ఫార్మాట్ ద్వారా ఫైనలిస్ట్‌లను ఖరారు చేశారు. చివరిసారి భారత్ 1972 మ్యూనిక్ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ చేరింది. సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో 0–2తో ఓడిపోయింది. మూడో స్థానం పోరులో టీమిండియా 2–1తో నెదర్లాండ్స్‌ను ఓడించి కాంస్యం గెల్చుకుంది. టోక్యో: ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తర్వాత భారత జట్టు... అనంతరం జరిగిన తొమ్మిది ఒలింపిక్స్‌లలో క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయింది. ఈసారి మాత్రం పక్కా ప్రణాళికతో, పట్టుదలతో ఆడి సెమీఫైనల్లోకి దూసుకెళ్లి పతకం రేసులో నిలిచింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 3–1తో గ్రేట్ బ్రిటన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్ (7వ ని.లో), గుర్జంత్ సింగ్ (16వ ని.లో), హార్దిక్ సింగ్ (57వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. గ్రేట్ బ్రిటన్ తరఫున ఏకైక గోల్‌ను సామ్ వార్డ్ (45వ ని.లో) సాధించాడు. మంగళవారం జరిగే సెమీఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ బెల్జియం జట్టుతో భారత్ తలపడుతుంది. మరో సెమీఫైనల్లో జర్మనీతో ఆస్ట్రేలియా ఆడుతుంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో బెల్జియం 3–1తో స్పెయిన్‌పై; జర్మనీ 3–1తో అర్జెంటీనాపై గెలుపొందగా... ఆస్ట్రేలియా ‘పెనాల్టీ షూటౌట్’లో 3–0 తో నెదర్లాండ్స్‌ను ఓడించింది. బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో కొన్నిసార్లు డిఫెన్స్‌లో తడబడింది. బ్రిటన్ ఏకంగా ఎనిమిది పెనాల్టీ కార్నర్లు సంపాదించినా ఒక్కసారి మాత్రమే సఫలమైంది. మ్యాచ్ ముగియడానికి మరో మూడు నిమిషాలు ఉందనగా భారత్ 2–1తో ఒక గోల్ ఆధిక్యంలో మాత్రమే ఉంది. అయితే హార్దిక్ సింగ్ గోల్ చేయడంతో భారత ఆధిక్యం 3–1కి పెరిగింది. చివరి మూడు నిమిషాల్లో బ్రిటన్ గోల్ చేయడానికి తీవ్రంగా యత్నించినా భారత జట్టు వారి దాడులను వమ్ము చేసింది. -
టోక్యో ఒలింపిక్స్: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం
టోక్యో: ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ హాకీ పురుషుల జట్టు శుభారంభం చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన 3-2 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలి క్వార్టర్ చివరి వరకు 1-0తో ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్ డిఫెన్స్‌ను బ్రేక్ చేసి భారత ఆటగాళ్లు తొలి క్వార్టర్ చివరన గోల్ ని సాధించి స్కోర్‌ను 1-1తో సమం చేసారు. ఇక రెండవ క్వార్టర్ లో పెనాల్టీ కార్నర్ ద్వారా హర్మన్ ప్రీత్ కొట్టిన గోల్ తో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మూడవ క్వార్టర్ లో భారత్ మరొక గోల్ తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 3-1 తో స్కోర్ ఉంచి ప్రత్యర్థికి మ్యాచ్ ను దూరం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ... భారత డిఫెన్సె ను ఛేదిస్తూ న్యూజిలాండ్ గోల్ ని సాధించి స్కోర్ ని 3- 2కి చేర్చింది. ఇక ఆఖర్లో కాస్త భారత్,న్యూజిలాండ్‌లు వరుస రెఫరల్ లు తీసుకోవడంతో పెనాల్టీ కార్నర్లు దక్కడం సర్వత్రా ఆసక్తిని నెలకొల్పింది. భారత జట్టు తన రెఫరల్ ను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. ఆఖరున మ్యాచ్ ముగుస్తుందనగా న్యూజిలాండ్ ఆఖరి 24 సెకండ్లు మిగిలి ఉండగా పెనాల్టీ కార్నర్ పొందింది. ఏమీ జరగబోతుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా... ఈ సమయంలో భారత కీపర్ శ్రీజేష్ తానెంత కీలక ఆటగాడినో మరోసారి నిరూపిస్తూ... ఫుల్ స్ట్రెచ్ తో న్యూజిలాండ్ ఆశలకు గండి కొడుతూ... భారత్ ను తదుపరి పోటీలో నిలిపాడు. కాగా భారత జట్టు తమ రెండో మ్యాచ్‌లో జూలై 25న పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టోక్యో పిలుపు కోసం...
భువనేశ్వర్: భారత పురుషుల, మహిళల హాకీ జట్లు టోక్యో వెళ్లే దారిలో పడ్డాయి. ఒలింపిక్స్ బెర్తులే లక్ష్యంగా ఇరు జట్లు పోటీలకు సిద్ధమయ్యాయి. ఎఫ్ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో శుక్రవారం పురుషుల జట్టుకు తమకంటే దిగువ ర్యాంకులో ఉన్న రష్యా ఎదురవగా... మహిళల జట్టుకు మాత్రం అమెరికా రూపంలో క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురైంది. ఒలింపిక్స్ పయనంలో భారత జట్లు కేవలం రెండే విజయాల దూరంలో ఉన్నాయి. ఐదో ర్యాంక్‌లో ఉన్న భారత పురుషుల జట్టు 22వ ర్యాంకర్ రష్యాపై గెలవడం ఏమంత కష్టం కాకపోవచ్చు. కానీ భారత కోచ్ గ్రాహం రీడ్ మాత్రం ప్రత్యర్థి అంత సులువని తాము అంచనా వేయబోమని చెప్పారు. ‘మనది కాని రోజంటూ ఉంటే ఒలింపిక్స్ కలలు నీరుగారతాయని మాకు తెలుసు. అందుకే నిర్లక్ష్యానికి, అలసత్వానికి ఏమాత్రం తావివ్వం. ఈ రెండు మ్యాచ్‌లు మాకు కీలకం’ అని అన్నాడు. రీడ్ కోచింగ్‌లో భారత రక్షణ శ్రేణి మెరుగైంది. గత 12 నెలల కాలంలో సురేందర్ కుమార్, హర్మన్‌ప్రీత్ సింగ్‌లతో భారత డిఫెన్స్ పటిష్టమైంది. డ్రాగ్‌ఫ్లికర్లు రూపిందర్ పాల్ సింగ్, బీరేంద్ర లక్రాలు ఫామ్‌లో ఉన్నారు. మైదానంలో పాదరసంలా కదులుతూ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌వైపు దూసుకెళుతున్నారు. మిడ్‌ఫీల్డ్‌లో కెప్టెన్ మన్‌ప్రీత్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, వివేక్‌సాగర్ ప్రసాద్‌లు ఆశించిన స్థాయిలో రాణిస్తే రష్యాపై భారత్ సులభంగానే గోల్స్ సాధిస్తుంది. అలాగే అనుభవజ్ఞుడైన గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ రష్యా దాడుల్ని సమర్థంగా నిరోధించగలడు. అమెరికాతో ఎలాగబ్బా! పురుషుల జట్టుకైతే సులువైన ప్రత్యర్థే! కానీ మహిళల జట్టుకే మింగుడుపడని ప్రత్యర్థి అమెరికా ఎదురైంది. ప్రపంచ 13వ ర్యాంకర్ అమెరికాతో భారత్‌కు 4–22తో పేలవమైన రికార్డు ఉంది. 22 సార్లు ప్రత్యర్థి చేతిలో ఓడిన మహిళల జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందో చూడాలి. కెప్టెన్ రాణి రాంపాల్, డ్రాగ్‌ఫ్లికర్ గుర్జీత్ కౌర్, యువ ఫార్వర్డ్ ప్లేయర్ లాల్రెమ్సియామి, గోల్‌కీపర్ సవితలపై జట్టు ఆశలు పెట్టుకుంది. కోచ్ జోయెర్డ్ మరీనే మాట్లాడుతూ అమెరికాపై భారత్ గెలుస్తుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఈ మ్యాచ్‌ల కోసమే గత ఏడాది కాలంగా నిరీక్షిస్తున్నామని, గెలిచే సత్తా అమ్మాయిల్లో ఉందని చెప్పారు. కెప్టెన్ రాణి రాంపాల్ మాట్లాడుతూ ‘ఆసియా గేమ్స్‌తోనే టోక్యో బెర్తు సాధించాలనుకున్నాం. దురదృష్టవశాత్తు అనుకున్న ఫలితం రాలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం ఒలింపిక్స్ బెర్తు సాధించే తీరతాం’ అని చెప్పింది. -
మరో సంచలనంపై దృష్టి
* నేడు బెల్జియంతో భారత్ సెమీస్ మ్యాచ్ * హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీ రాయ్‌పూర్: అమోఘమైన ఆటతీరుతో గ్రేట్ బ్రిటన్‌పై సంచలన విజయం సాధించిన భారత హాకీ జట్టు మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది. హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీలో శనివారం జరిగే సెమీఫైనల్లో పటిష్టమైన బెల్జియంతో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో పూర్తిగా నిరాశపర్చిన సర్దార్‌సేన ప్రస్తుతం నిలకడలేమితో ఇబ్బంది పడుతోంది. ఈ విషయాన్ని కోచ్ ఓల్ట్మన్ కూడా అంగీకరిస్తున్నారు. అయితే బ్రిటన్‌పై భారత డిఫెన్స్ సమర్థంగా పని చేసింది. ఈ మ్యాచ్‌లో కూడా ఇది కొనసాగితే మరో సంచలనాన్ని ఊహించొచ్చు. లీగ్ దశ నుంచి అద్భుతంగా ఆడుతున్న బెల్జియంను ఓడించడం అనుకున్నంత సులువు కాదు. అన్ని రంగాల్లోనూ ఈ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో హెచ్‌డబ్ల్యూఎల్ సెమీస్‌లో భారత్‌పై గెలవడం వాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. ఊహించని రీతిలో గోల్స్ కొట్టడంలో బెల్జియన్లు సిద్ధహస్తులు. కాబట్టి వాళ్లను నిలువరించాలంటే భారత్ శక్తికి మించి పోరాడాల్సిందే. నెదర్లాండ్స్‌కు షాక్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్ జట్టుకు ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా 3-2 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఆస్ట్రేలియా తరఫున వొతెర్స్పూన్ (8వ ని.లో), బీల్ (22వ ని.లో), గోడ్స్ (42వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... నెదర్లాండ్స్‌కు జోంకర్ (29వ ని.లో), ప్రుసెర్ (33వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. భారత్, బెల్జియంల మధ్య సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా తలపడుతుంది. -
సెమీస్‌లో భారత్
న్యూఢిల్లీ: మహిళల వరల్డ్ లీగ్ రౌండ్-2లో భారత హాకీ జట్టు సెమీఫైనల్స్‌కు చేరింది. వందన కఠారియా హ్యాట్రిక్ గోల్స్ సహాయంతో గురువారం జరిగిన క్వార్టర్స్‌లో 10-0 తేడాతో సింగపూర్‌ను చిత్తుగా ఓడించింది. మొత్తంగా వందన నాలుగు గోల్స్ (17, 48, 56, 57వ నిమిషాల్లో), పూనమ్ రాణి (4వ ని), నవ్‌జ్యోత్ కౌర్ (6వ ని), అనూపా బర్లా (19వ ని), దీపికా (32వ ని), రాణీ రాంపాల్ (35వ ని), జస్ప్రీత్ కౌర్ (51వ ని) ఒక్కో గోల్ సాధించారు. శనివారం జరిగే సెమీస్‌లో భారత జట్టు థాయ్‌లాండ్‌ను ఢీకొంటుంది. -
కుర్రాళ్లకు కఠిన పరీక్ష!
న్యూఢిల్లీ: కొత్త ఆటగాళ్లు... కొత్త కోచ్... కొత్త లీగ్... పునర్వైభవం కోసం పోరాడుతున్న భారత హాకీ జట్టు మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది. అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేకపోతున్న భారత్... సొంతగడ్డపై జరుగుతున్న హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యుఎల్)లోనైనా సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో నేడు జరగబోయే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో రాణించడం ద్వారా ప్రపంచకప్‌నకు సరైన రీతిలో సిద్ధం కావొచ్చని టీమిండియా ప్రణాళికలు వేస్తోంది. ఈ టోర్నీకి భారత్ నేరుగా అర్హత సాధించకపోవడంతో ఆతిథ్య జట్టు హోదా కింద అవకాశం ఇచ్చారు. అయితే ప్రపంచ స్థాయి నాణ్యమైన జట్లు బరిలోకి దిగుతుండటంతో టీమిండియా ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లలో చాలా మందికి అనుభవం తక్కువ. ఆటగాళ్లను గాడిలో పెట్టడంతో పాటు ఫలితాలనూ రాబట్టాల్సి ఉంటుంది కాబట్టి కొత్త విదేశీ కోచ్ టెర్రీ వాల్ష్ కూడా కఠిన పరీక్ష ఎదుర్కోనున్నారు. హెచ్‌డబ్ల్యుఎల్ సెమీఫైనల్లో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న భారత్... గతేడాది ఆసియా కప్‌లో రజతంతో సంతృప్తి పడింది. నిలబడతారా? పూల్-ఎలో భారత్‌తో పాటు ఒలింపిక్ చాంపియన్ జర్మనీ, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లు ఉండగా, పూల్-బిలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, అర్జెంటీనాలు తలపడుతున్నాయి. ఈ జట్లను నిలువరించి ముందుకు పోవడం భారత కుర్రాళ్లకు అంత తేలిక కాదు. కోచ్ వాల్ష్ కూడా దీన్ని అంగీకరిస్తున్నాడు. గాయాల నుంచి కోలుకున్న ఎస్.వి.సునీల్, యువరాజ్ వాల్మీకి మళ్లీ జట్టులోకి రావడం, నికిన్ తిమ్మయ్య, మన్దీప్ సింగ్, యూసుఫ్‌లపై సెలక్టర్లు నమ్మకం పెట్టడంతో ఫార్వర్డ్ లైన్ తాజాగా కనిపిస్తోంది. గోల్‌కీపర్ హర్జోత్ సింగ్ ఎంట్రీ భారత్‌కు కలిసొచ్చే అంశం. కెప్టెన్ సర్దార్తో పాటు ఉతప్ప, ధర్మవీర్ సింగ్, మన్‌ప్రీత్, చింగ్లెన్సనా సింగ్, అయ్యప్పలతో కూడిన మిడ్‌ఫీల్డ్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే బీరేంద్ర లక్రా, రూపిందర్‌పాల్ సింగ్, రఘునాథ్, కొతాజిత్ సింగ్, అమిత్‌లతో కూడిన బ్యాక్‌లైన్ సమస్యలను ఎదుర్కొంటుంది. వీళ్లలో ఏ ఒక్కరు కూడా స్థాయి మేరకు రాణించలేకపోతున్నారు. పెనాల్టీ కార్నర్ నిపుణులు రఘునాథ్, రూపిందర, అమిత్‌లు మెరుపులు మెరిపిస్తే భారత్ విజయం ఖాయం. భారత్ x ఇంగ్లండ్ రాత్రి గం. 8 నుంచి టెన్స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం -
టాప్-10 లక్ష్యంగా...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జూనియర్ ప్రపంచకప్‌లో నాకౌట్ దశకు అర్హత సాధించడంలో విఫలమైన భారత హాకీ జట్టు ఇక టాప్-10లో నిలువడమే లక్ష్యంగా పోరాడనుంది. 9 నుంచి 12 స్థానాల కోసం గురువారం జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో అర్జెంటీనాతో టీమిండియా; దక్షిణాఫ్రికాతో పాకిస్థాన్ తలపడతాయి. ఈ మ్యాచ్‌ల్లో గెలిచిన రెండు జట్లు 14న 9-10వ స్థానం కోసం.. ఓడిన జట్లు 11-12వ స్థానం కోసం పోటీపడతాయి. లీగ్ దశలో భారత్ ఆకట్టుకునే ప్రదర్శన చేసినప్పటికీ కీలకదశలో తడబాటుకులోనై మూల్యం చెల్లించుకుంది. కొరియాతో తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’ చేసుకొని క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.