న్యూఢిల్లీ: వచ్చే నెలలో సొంతగడ్డపై జరిగే హాకీ ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలుస్తుందని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ ఆతిథ్యమిచ్చే ఈ పురుషుల హాకీ టోర్నీ భువనేశ్వర్, రూర్కేలా వేదికలపై జనవరి 13 నుంచి 29 వరకు జరుగనుంది. వరల్డ్ కప్ ట్రోఫీ టూర్‌లో భాగంగా శుక్రవారం ట్రోఫీ రాజధాని నగరం ఢిల్లీకి చేరుకుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ‘ప్రపంచకప్ సమరం కోసం భారత జట్టు పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. 15 పోటీ జట్ల నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురైనా ధీటుగా ఎదుర్కొంటుంది. భారత్ సన్నాహాలు, సన్నద్ధత చూస్తుంటే మరోసారి ప్రపంచ చాంపియన్ అవుతుందని అనిపిస్తుంది.
జట్టు సభ్యులంతా కఠోరంగా శ్రమించారు. అందరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ప్రపంచకప్ మాత్రమే కాదు... పారిస్ ఒలింపిక్స్‌లోనూ భారత జట్టు సత్తా చాటుతుంది’ అని అన్నారు. ఒకప్పుడు హాకీలో భారత్‌కు ఘనచరిత్ర ఉంది. చివరి సారిగా భారత్ 47 ఏళ్ల క్రితం కౌలాలంపూర్ (1975)లో జరిగిన ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది.
చదవండి: IND-W vs AUS-W: సిరీస్‌లో నిలవాలంటే.. గెలవాల్సిందే! భారత్ తుది జట్టు ఇదే?
Comments
Please login to add a commentAdd a comment