రోటర్‌డామ్: ప్రొ హాకీ లీగ్ 2021–2022 సీజన్‌ను భారత పురుషుల జట్టు మూడో స్థానంతో ముగించింది. నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–2 గోల్స్‌తో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో విజయంతో నెదర్లాండ్స్ చాంపియన్‌గా నిలిచింది. భారత్ తరఫున అభిషేక్ తొలి నిమిషంలోనే గోల్ చేయగా... ఏడో నిమిషంలో నెదర్లాండ్స్ జట్టుకు జాన్సెన్ గోల్ అందించి స్కోరును సమం చేశాడు. 45వ నిమిషంలో జోరిట్ క్రూన్ గోల్‌తో నెదర్లాండ్స్ విజయాన్ని ఖాయం చేసుకుంది.
తొమ్మిది జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో భారత్ మొత్తం 16 మ్యాచ్‌లు ఆడి 30 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకుంది. ఎనిమిది మ్యాచ్‌ల్లో నిర్ణీత సమయంలోపు గెలిచిన భారత్, రెండింటిలో ‘షూటౌట్’ ద్వారా విజయం అందుకుంది. ‘షూటౌట్’లో రెండు మ్యాచ్‌ల్లో, నిర్ణీత సమయంలోపు నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి పాలైంది. మరోవైపు మహిళల ప్రొ హాకీ లీగ్‌లో అర్జెంటీనాతో మ్యాచ్ లో భారత్ 2–3తో ఓడిపోయింది. ఈ విజయంతో అర్జెంటీనా టైటిల్‌ను ఖరారు చేసుకుంది.
చదవండి: Matteo Berrettini: 'నన్ను పెళ్లి చేసుకుంటావా'.. టెన్నిస్ స్టార్‌కు వింత అనుభవం
Comments
Please login to add a commentAdd a comment