shoot out
-
Hockey WC 2023: 13 ఏళ్ల తర్వాత సెమీస్‌లోకి జర్మనీ
పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో జర్మనీ జట్టు 13 ఏళ్ల తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. భువనేశ్వర్‌లో బుధవారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో జర్మనీ ‘షూటౌట్’ లో 4–3తో ఇంగ్లండ్‌ను ఓడించింది. నిరీ్ణత సమయం వరకు రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. 2010 తర్వాత ఈ మెగా టోరీ్నలో జర్మనీ సెమీఫైనల్ చేరింది. మరో క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 5–1తో కొరియాను ఓడించి సెమీస్ చేరింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో ఆ్రస్టేలియాతో జర్మనీ; బెల్జియంతో నెదర్లాండ్స్ ఆడతాయి. -
ప్రొ హాకీ లీగ్.. మూడో స్థానంతో బారత్ ముగింపు
రోటర్‌డామ్: ప్రొ హాకీ లీగ్ 2021–2022 సీజన్‌ను భారత పురుషుల జట్టు మూడో స్థానంతో ముగించింది. నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–2 గోల్స్‌తో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో విజయంతో నెదర్లాండ్స్ చాంపియన్‌గా నిలిచింది. భారత్ తరఫున అభిషేక్ తొలి నిమిషంలోనే గోల్ చేయగా... ఏడో నిమిషంలో నెదర్లాండ్స్ జట్టుకు జాన్సెన్ గోల్ అందించి స్కోరును సమం చేశాడు. 45వ నిమిషంలో జోరిట్ క్రూన్ గోల్‌తో నెదర్లాండ్స్ విజయాన్ని ఖాయం చేసుకుంది. తొమ్మిది జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో భారత్ మొత్తం 16 మ్యాచ్‌లు ఆడి 30 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకుంది. ఎనిమిది మ్యాచ్‌ల్లో నిర్ణీత సమయంలోపు గెలిచిన భారత్, రెండింటిలో ‘షూటౌట్’ ద్వారా విజయం అందుకుంది. ‘షూటౌట్’లో రెండు మ్యాచ్‌ల్లో, నిర్ణీత సమయంలోపు నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి పాలైంది. మరోవైపు మహిళల ప్రొ హాకీ లీగ్‌లో అర్జెంటీనాతో మ్యాచ్ లో భారత్ 2–3తో ఓడిపోయింది. ఈ విజయంతో అర్జెంటీనా టైటిల్‌ను ఖరారు చేసుకుంది. చదవండి: Matteo Berrettini: 'నన్ను పెళ్లి చేసుకుంటావా'.. టెన్నిస్ స్టార్‌కు వింత అనుభవం -
సర్వీస్ రివాల్వర్‌తో జవాను ఆత్మహత్య
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గడ్‌లో బిఎస్ఎఫ్ జవాను సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. కంకెర్ జిల్లాలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 157 బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పంకన్జోర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. చనిపోయిన జవాన్‌ను సురేష్ కుమార్‌గా గుర్తించినట్లు తెలిపారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు. ( వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికెళ్లిన మహిళపై.. ) బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ 157వ బెటిలియన్ బృందం శుక్రవారం సంగం గ్రామంలో నిర్వహించిన నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లోనూ సురేష్ కుమార్ పాల్గొన్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ శిబిరానికి 200 మీటర్ల దూరంలో ఉన్న ఘోడా , దోటమెటా గ్రామాల మధ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన దగ్గర ఉన్న సర్వీస్ రివాల్వర్ ఏకే-47 రైఫిల్‌తో కాల్చుకోవడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. స్వగ్రామం ఉత్తరప్రదేశ్ నుంచి తిరిగి వచ్చిన సురేష్ కుమార్‌ను కొన్ని వారాల క్రితం క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. అంతేకాకుండా శుక్రవారం ఇదే బెటాలియన్‌కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎఎస్ఐ) కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా వస్తుందేమో అన్న డిప్రెషన్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. (హిమాచల్ ప్రదేశ్‌లో కేరళ తరహా ఘటన ) -
ఎదురుకాల్పుల్లో నేరస్తుడికి గాయాలు
బరంపురం: గంజాం జిల్లా రంబాలో పోలీసుల ఎదురు కాల్పుల్లో మోస్ట్‌వాంటెడ్ క్రిమి నల్ సంతోష్ బెహరా గాయా లపాలయ్యాడు. ఈ సందర్భం గా డీఐజీ ఆశిష్ కుమార్‌సింగ్ అందించిన సమాచారం ప్రకా రం వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం తెల్లవారు జామున 4.30 గంటలకు గంజాం పోలీ స్ జిల్లా, రంబా పోలీస్‌స్టేషన్ పరిధి బలియాగడ, పాలురి జంక్షన్ రోడ్లో పోలీసుల లిస్ట్‌లో మోస్ట్‌వాంటెడ్‌గా తప్పించుకు తిరుగుతున్న నేరస్తుడు సంతో ష్ బెహరా పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో తారసపడ్డాడు. పోలీసులు వచ్చినట్లు పసిగట్టిన నేరస్తు డు సంతోష్ బెహరా తొలుత పోలీసులపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణగా ఎదురు కాల్పులు జరపడంతో నేరస్తుడు సంతోష్ బెహరా రెండు కాళ్లకు గాయాలయ్యాయి. ఎదురుకాల్పుల అనంతరం నేరస్తుడి నుంచి 1 మౌజర్ (పిస్టల్), 3 పేలని గుళ్లు, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని నేరస్తుడు సంతోష్ బెహరాకు రంబా ప్రభుత్వ అస్పత్రి లో ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎంకేసీజీ మెడికల్ కళాశాలకు తరలించారు. నేరస్తుడు సంతోష్ బెహరాపై గంజాం, నయగడ్, కొందమాల్ జిల్లాల్లో సుమారు 19కి పైగా దోపిడీలు, దొంగతనాలు, హత్యాయత్నాల వంటి కేసులు ఉన్నాయని డీఐజీ ఆశిష్‌కుమార్ సింగ్ తెలియజేశారు. -
యూట్యూబ్ ఆఫీస్ వద్ద కాల్పులు
శాన్ బ్రూనో, కాలిఫోర్నియా : యూట్యూబ్ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం(అమెరికా కాలమానం ప్రకారం) ఓ మహిళ కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. కాల్పుల శబ్దంతో యూట్యూబ్ ఉద్యోగులు హడలిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. కాల్పుల అనంతరం మహిళ తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాల్పుల జరిగిన ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను శాన్ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. బుల్లెట్ గాయాలైన వారిలో మహిళ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నట్లు తెలిపారు. ఆత్మహత్యకు ముందు హ్యాండ్ గన్‌తో మహిళ బాయ్‌ఫ్రెండ్‌పై కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో యూట్యూబ్ ఉద్యోగులు కార్యాలయ ఆవరణలో పార్టీ చేసుకుంటున్నారని వివరించారు. మహిళ 10 రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన ట్రంప్ సకాలంలో స్పందించి బాధితులను ఆదుకున్న అధికారులను అభినందించారు. -
అమెరికాలో మళ్లీ కాల్పులు
న్యూ ఓర్లియాన్స్: అమెరికాలో మరో కాల్పుల సంఘటన చోటుచేసుకుంది. న్యూ ఓర్లియాన్స్ ప్రాంతంలోని ఓ పార్కులో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. ప్రతి వీకెండ్ లాగే బన్నీ ఫ్రెండ్ ప్లేగ్రౌండ్ సందడిగా ఉంది. రాత్రి 7 కావస్తున్నా చిన్నారులు, యువకులు ఆటలాడుతూనే ఉన్నారు. చిన్నపాటి వ్యాయామాలతో వృద్ధులు మాట్లాడుకుంటున్నారు. దాదాపు 500 మందితో నిండినా ఆ ఫ్రెండ్స్ పార్కులోకి తుపాకులు చేతబట్టిన ఇద్దరు దుండగులు ప్రవేశించారు. గేటు నుంచి లోపలికి ప్రవేశిస్తూనే కొందరిని టార్గెట్ చేసుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. న్యూ ఓర్లియాన్స్ లో ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం) చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో సుమారు 16మంది గాయపడినట్లు తెలిసింది. క్షతగాత్రులను పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, దీని వెనుక ఉగ్రవాదుల ప్రమేయం లేదని, రెండు గ్యాంగుల మధ్య తలెత్తిన విబేధాలే కాల్పులకు దారితీశాయని పోలీసులు చెబుతున్నారు. పారిస్, మాలీల్లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో ఓర్లియాన్స్ కాల్పుల సంఘటన అమెరికాను కలవరపాటుకు గురిచేసింది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సిఉంది.