అమెరికాలో మళ్లీ కాల్పులు | Shooting at New Orleans Park, america, many fear dead | Sakshi
Sakshi News home page

అమెరికాలో మళ్లీ కాల్పులు

Published Mon, Nov 23 2015 9:17 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికాలో మళ్లీ కాల్పులు - Sakshi

అమెరికాలో మళ్లీ కాల్పులు

న్యూ ఓర్లియాన్స్: అమెరికాలో మరో కాల్పుల సంఘటన చోటుచేసుకుంది. న్యూ ఓర్లియాన్స్ ప్రాంతంలోని ఓ పార్కులో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. ప్రతి వీకెండ్ లాగే బన్నీ ఫ్రెండ్ ప్లేగ్రౌండ్ సందడిగా ఉంది. రాత్రి 7 కావస్తున్నా చిన్నారులు, యువకులు ఆటలాడుతూనే ఉన్నారు. చిన్నపాటి వ్యాయామాలతో వృద్ధులు మాట్లాడుకుంటున్నారు. దాదాపు 500 మందితో నిండినా ఆ ఫ్రెండ్స్ పార్కులోకి తుపాకులు చేతబట్టిన ఇద్దరు దుండగులు ప్రవేశించారు.

 

గేటు నుంచి లోపలికి ప్రవేశిస్తూనే కొందరిని టార్గెట్ చేసుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. న్యూ ఓర్లియాన్స్ లో ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం) చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో సుమారు 16మంది గాయపడినట్లు తెలిసింది. క్షతగాత్రులను పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు.

కాగా, దీని వెనుక ఉగ్రవాదుల ప్రమేయం లేదని, రెండు గ్యాంగుల మధ్య తలెత్తిన విబేధాలే కాల్పులకు దారితీశాయని పోలీసులు చెబుతున్నారు. పారిస్, మాలీల్లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో ఓర్లియాన్స్ కాల్పుల సంఘటన అమెరికాను కలవరపాటుకు గురిచేసింది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement