శాన్‌బ్రూనోలోని యూట్యూబ్ ప్రధానకార్యాలయం వద్ద కాల్పుల శబ్దంతో పరుగులు తీసున్న పోలీసులు
శాన్ బ్రూనో, కాలిఫోర్నియా : యూట్యూబ్ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం(అమెరికా కాలమానం ప్రకారం) ఓ మహిళ కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. కాల్పుల శబ్దంతో యూట్యూబ్ ఉద్యోగులు హడలిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు.
కాల్పుల అనంతరం మహిళ తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాల్పుల జరిగిన ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు.
బుల్లెట్ గాయాలైన వారిలో మహిళ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నట్లు తెలిపారు. ఆత్మహత్యకు ముందు హ్యాండ్ గన్‌తో మహిళ బాయ్‌ఫ్రెండ్‌పై కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో యూట్యూబ్ ఉద్యోగులు కార్యాలయ ఆవరణలో పార్టీ చేసుకుంటున్నారని వివరించారు.
మహిళ 10 రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన ట్రంప్ సకాలంలో స్పందించి బాధితులను ఆదుకున్న అధికారులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment