యూట్యూబ్‌ కార్యాలయం వద్ద కాల్పులు | Nasim Aghdam shoots 3 before killing herself at San Bruno HQ | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌ కార్యాలయం వద్ద కాల్పులు

Published Thu, Apr 5 2018 3:12 AM | Last Updated on Thu, Apr 5 2018 3:12 AM

Nasim Aghdam shoots 3 before killing herself at San Bruno HQ - Sakshi

వాషింగ్టన్‌: యూఎస్‌లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న యూట్యూబ్‌ ప్రధాన కార్యాలయం వద్ద బుధవారం నజాఫి అఘ్డం (39) అనే మహిళ జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉద్యోగులు గాయపడ్డారు. ఆ తర్వాత తోపులాట చోటుచేసుకుని మరొకరికి గాయమైంది. అనంతరం ఆమె తనను తానే కాల్చుకుని చనిపోయింది. యూట్యూబ్‌ అనుసరిస్తున్న విధానాలపై నజాఫి అసంతృప్తిగా ఉండేదనీ, యూట్యూబ్‌ విధానాల వల్ల తన వీడియోలకు డబ్బులు రావడం లేదని ఆమె ఎప్పుడూ బాధపడుతుండేదని పోలీసులు చెప్పారు. ఈ కారణంగానే ఆమె యూట్యూబ్‌ ప్రధాన కార్యాలయం వద్దకు వచ్చి కాల్పులు జరిపి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. యూట్యూబ్‌ విధానాలతో తన కూతురు అసంతృప్తిగా, కోపంగా ఉందనీ, ప్రధాన కార్యాలయానికి వెళ్లాలని కూడా అనుకుంటోందనీ ఆమె తండ్రి ఇంతకుముందే పోలీసులు సమాచారమిచ్చారు. ఈ ఘటనపై దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విచారం వ్యక్తం చేశారు. నలుగురు ఉద్యోగులు గాయపడటం బాధాకరమని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement