ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ 2017లో కంపెనీ హెడ్‌క్వార్టర్స్‌ను కాలిఫోర్నియాలో యాపిల్ పార్క్ పేరిట ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పార్క్ సుమారు 64 ఎకరాల్లో విస్తరించి ఉంది. కోవిడ్-19 రాకతో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంకు పరిమితమయ్యారు. కరోనా ఉదృత్తి తగ్గడంతో తిరిగి ఉద్యోగులను ఆఫీసులకు పిలిచేందుకు సిద్ధమైంది. అయితే తాజాగా యాపిల్ పార్క్ క్యాంపస్ లోపల ఒక చిన్న కవర్ కలకలం సృష్టించింది.
దెబ్బకు ఖాళీ..!
యాపిల్ పార్క్ క్యాంపస్ లోపల తెల్లటి పొడి పదార్థంతో కూడిన ఒక ఎన్వలప్ కవర్‌ను యాపిల్ సిబ్బంది గుర్తించారు. దీంతో ఉద్యోగులు హైరనా పడిపోయారు.కవర్‌లో ఎదో ఉందనే భయంతో ఉద్యోగులను పార్క్ నుంచి పాక్షికంగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఈ విషయాన్ని లోకల్ శాంటా క్లారా కౌంటీ ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇచ్చారు. అయితే ఎన్వలప్‌లో ప్రమాదకరమైనది ఏమీ లేదని వారు కనుగొన్నారు. దీంతో ఉద్యోగులంతా ఊపిరిపిల్చుకున్నారు. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి అదుపులోకి రావడంతో ఉద్యోగులను తిరిగి ప్రాంగణంలోకి అనుమతించారు. అయితే ఆ పౌడర్ ఏంటనేది స్పష్టంగా తెలియరాలేదు.
ది వెర్జ్ ప్రకారం..కవరు లోపల "ప్రమాదకరమైన పదార్థాలు లేవని అధికారులు నిర్ధారించారని యాపిల్ ఉద్యోగులకు తెలిపింది. యాపిల్ పార్క్‌లో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని, అన్ని విభాగాలు తెరిచి ఉన్నాయని ఇమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేసింది. ఇక ఏప్రిల్ 11న ప్రారంభమయ్యే కొత్త హైబ్రిడ్ మోడల్ లో ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి తీసుకురావడం ప్రారంభిస్తామని యాపిల్ ఇటీవల ప్రకటించింది. మెల్లమెల్లగా ఉద్యోగులను పూర్తిగా ఆఫీసులకు పిలచే యోచనలో యాపిల్ ఉన్నట్లు సమాచారం.
చదవండి: ఒక్కరోజే డెడ్‌లైన్..! ఇది దాటితే కొత్త ధరలే..! షాక్ ఇచ్చేందుకు సిద్దమైన ఓలా..!
Comments
Please login to add a commentAdd a comment