
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ మాజీ ఉద్యోగి వివిధ పథకాల పేరుతో 10 మిలియన్ డాలర్లకు పైగా మోసం చేసినట్లు యుఎస్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. కాలిఫోర్నియాలోని శాన్ జోస్లోని ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన ఫైలింగ్ ఆధారంగా భారత సంతతికి చెందిన ధీరేంద్ర ప్రసాదును ఐదు క్రిమినల్ కేసుల ఆధారంగా అరెస్టు చేశారు. దిగ్గజ కంపెనీని మోసగించడానికి ఆపిల్ గ్లోబల్ సర్వీస్ సప్లై చైన్‌లో ఒక కొనుగోలుదారుగా పేర్కొంటూ కంపెనీలో స్థానం సంపాదించారు.
ఆ తర్వాత ఆపిల్ కొనుగోలుదారుగా ప్రసాద్ విక్రేతలతో చర్చలు జరిపి ఆర్డర్స్ పెట్టినట్లు ప్రాసిక్యూటర్లు హైలైట్ చేశారు. అయితే, కంపెనీ కొనుగోలు వ్యవస్థలో అతను నమోదు చేసిన ఇన్వాయిస్ మొత్తాల ఆధారంగా ఆపిల్ చెల్లించింది. ప్రసాద్ ముడుపులు తీసుకొని తప్పుడు రిపేర్ ఆర్డర్లను ఉపయోగించి విడిభాగాలను దొంగిలించాడు. అదే సమయంలో ఆపిల్ కంపెనీ ఎప్పుడూ అందించని వస్తువులు & సేవలకు చెల్లించమని కోరాడు. ప్రాసీక్యూటర్ల ప్రకారం, ఇంకా ప్రసాద్ కూడా పన్నులను ఎగవేశారు. అతను వివిధ పథకాల పేరుతో వచ్చిన 10 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని మనీ లాండరింగ్ చేశాడు.
సమర్పించిన కోర్టు పత్రాల ఆధారంగా, ఒక దశాబ్దం తర్వాత 2018 డిసెంబరులో ప్రసాదును ఆపిల్ తొలగించింది. ఆపిల్ వ్యాపారంలో పాల్గొన్న ఇద్దరు విక్రేతల యజమానులు అలాగే టెక్ కంపెనీని మోసం చేయడంలో పాల్గొన్న ఇద్దరు విక్రేతల యజమానులు డిసెంబర్'లో ఈ ఆరోపణలను అంగీకరించారు. ప్రసాద్ ప్రస్తుతం మోసానికి పాల్పడటం, మనీ లాండరింగ్ కు పాల్పడటం, పన్ను ఎగవేతతో పాటు అమెరికాను మోసం చేయడం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. అతను మార్చి 24న విచారణకు హాజరు కావాల్సి ఉంది. ప్రాసిక్యూటర్ల డిమాండ్ల ప్రకారం.. అతను మిలియన్ల డాలర్ల విలువైన ఆస్తులను కూడా కోల్పోతాడని భావిస్తున్నారు.
(చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..! ప్రపంచంలోనే మొదటి కంపెనీగా..!)
Comments
Please login to add a commentAdd a comment