ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఉత్పత్తులంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడుతారు. ఆ కంపెనీ ఉత్పత్తులు మన చేతిలో ఉంటే చాలా రిచ్'గా కూడా ఫీల్ అవుతారు. రిచ్ సంగతి ఎలా ఉన్నా ఆపిల్ ఉత్పత్తులు ఇప్పుడు మనిషి ప్రాణాల్ని కూడా కాపాడుతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.. అచ్చం చిత్రలహరి సినిమా తరహాలోనే ఆపిల్ వాచ్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
జనవరి 22 ఉదయం 1:30 గంటల సమయంలో కాలిఫోర్నియాలో ఎలక్ట్రిక్ బైక్ నడుపుతున్న ఒక వ్యక్తి ఆకస్మికంగా కింద పడటంతో హెర్మోసా బీచ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు కాల్ వచ్చినట్లు ఫాక్స్ న్యూస్ నివేదించింది. కాల్ వచ్చిన వెంటనే పోలీసులు స్పందించి అక్కడికి చేరుకున్నారు. ఆ వ్యక్తి పడటం డిటెక్షన్ చేసిన వాచ్ స్వయంచాలకంగా అత్యవసర సేవల నంబర్'కు డయల్ చేసింది. పోలీసులు సకాలంలో ఆ ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు ఆ వాచ్ యజమాని బైక్ పక్కన రక్తం మడుగులో పడి ఉండటం చూశారు. తక్షణమే పోలీసులు అతనికి సంఘటనా స్థలంలో తాత్కాలిక చికిత్స చేసి, వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆ వ్యక్తిని విడుదల చేశారు.
యాపిల్ వాచ్ ఎస్ఈ/యాపిల్ వాచ్ 4 సిరీస్ కంటే ఎక్కువ వాచ్‌లలో ప్రమాదం జరిగినప్పుడు గుర్తించే డిటెక్షన్ ఫీచర్స్ ఉంటాయి. మీరు అలాంటి వాచ్ ధరించి పడిపోయినప్పుడు మీకు ఒక అలారం లాంటి సౌండ్ మీకు వస్తుంది. అలాగే, డిస్ ప్లే మీద అలర్ట్ మెసేజ్ కూడా కనిపిస్తుంది. మీరు కదిలే స్థితలో ఉంటే దాని నుంచి అత్యవసర సేవలకు సంప్రదించవచ్చు. ఒకవేళ, ప్రమాదంలో పడిపోయి వ్యక్తి ఒక నిమిషం పాటు కదలకుండా ఉన్నారని వాచీ గుర్తించినట్లయితే, వాచ్ స్వయంచాలకంగా అత్యవసర సేవలకు కాల్ చేస్తుంది. బైక్ పై నుంచి పడిపోయిన వ్యక్తి విషయంలో ఇదే జరిగింది.
(చదవండి: ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో ముగ్గురు తెలుగు కుర్రాళ్లకు చోటు!)
Comments
Please login to add a commentAdd a comment