ఎదురుకాల్పుల్లో నేరస్తుడికి గాయాలు | Most Wanted Criminal Shoot out | Sakshi
Sakshi News home page

ఎదురుకాల్పుల్లో నేరస్తుడికి గాయాలు

Published Sat, Apr 7 2018 12:28 PM | Last Updated on Sat, Apr 7 2018 12:28 PM

Most Wanted Criminal Shoot out - Sakshi

పోలీసుల ఎదురు కాల్పుల్లో గాయాలపాలైన నేరస్తుడు సంతోష్‌ బెహరా,పోలీసులు స్వాధీనం చేసుకున్న బైక్‌

బరంపురం: గంజాం జిల్లా రంబాలో పోలీసుల ఎదురు కాల్పుల్లో మోస్ట్‌వాంటెడ్‌ క్రిమి నల్‌ సంతోష్‌ బెహరా గాయా లపాలయ్యాడు. ఈ సందర్భం గా డీఐజీ ఆశిష్‌ కుమార్‌సింగ్‌ అందించిన సమాచారం ప్రకా రం వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం తెల్లవారు జామున 4.30 గంటలకు గంజాం పోలీ స్‌ జిల్లా, రంబా పోలీస్‌స్టేషన్‌ పరిధి బలియాగడ, పాలురి జంక్షన్‌ రోడ్లో పోలీసుల లిస్ట్‌లో మోస్ట్‌వాంటెడ్‌గా తప్పించుకు తిరుగుతున్న నేరస్తుడు సంతో ష్‌ బెహరా పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో తారసపడ్డాడు.

పోలీసులు వచ్చినట్లు పసిగట్టిన నేరస్తు డు సంతోష్‌ బెహరా తొలుత పోలీసులపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణగా ఎదురు కాల్పులు జరపడంతో నేరస్తుడు సంతోష్‌ బెహరా రెండు కాళ్లకు గాయాలయ్యాయి. ఎదురుకాల్పుల అనంతరం నేరస్తుడి నుంచి 1 మౌజర్‌ (పిస్టల్‌), 3 పేలని గుళ్లు, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని నేరస్తుడు సంతోష్‌ బెహరాకు రంబా ప్రభుత్వ అస్పత్రి లో ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎంకేసీజీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. నేరస్తుడు సంతోష్‌ బెహరాపై గంజాం, నయగడ్, కొందమాల్‌ జిల్లాల్లో సుమారు 19కి పైగా దోపిడీలు, దొంగతనాలు, హత్యాయత్నాల వంటి కేసులు ఉన్నాయని డీఐజీ ఆశిష్‌కుమార్‌ సింగ్‌ తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement