పోలీసుల అదుపులో ఆషు జాత్
ముంబై/మీరట్ : ప్రముఖుల హత్యలతో సహా 51 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వేషం మార్చి పండ్లు అమ్ముకునే వాడిలా కొత్త అవతారం ఎత్తాడు. పాత నేస్తాల కారణంగా పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆషు జాత్(32) హత్యలు, కిడ్నాప్‌లు, దోపిడీలు వంటి 51 కేసుల్లో ప్రధాన నిందితుడు. నోయిడాకు చెందిన ప్రముఖులు గౌరవ్, హపుర్, బీజేపీ నాయకుడు రాకేశ్ శర్మలను హత్య చేసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ( డ్రగ్స్ కేసు: రియా చక్రవర్తి అరెస్టు! )
ఉత్తరప్రదేశ్‌నుంచి ముంబైకి మకాం మార్చాడు. వేషం మార్చి పండ్లముకునే వాడిలా అవతారం ఎత్తాడు. అయితే అతడు ముంబైలోనే ఉంటున్నట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులకు సమాచారం అందింది. కానీ, ఆషు వేషంలో మార్పు కారణంగా అతడ్ని కనుక్కోవటం కష్టంగా మారింది. వేషం మార్చినా అతడు పాత స్నేహితులతో సంబంధాలు తెంచుకోలేదు. ఓ రోజు యూపీలోని అతడి సహచరుడికి ఫోన్ చేయటంతో ట్రాక్ చేసిన పోలీసులు శనివారం ఆషుని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment