ఢాకా: రౌండ్ రాబిన్ లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత పురుషుల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో బోల్తా కొట్టింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 3–5 గోల్స్ తేడాతో జపాన్ చేతిలో ఓడింది. జపాన్ జట్టుకు షోటా యమాడా (1వ ని.లో), రైకి ఫుజిషిమా (2వ ని.లో), యోషికి కిరిషిటా (29వ ని.లో), కొసె కవాబె (35వ ని.లో), ర్యోమా ఊకా (41వ ని.లో) ఒక్కో గోల్ అందించారు.
భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్ (17వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (53వ ని.లో), హార్దిక్ సింగ్ (58వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. నేడు కాంస్య పతకం కోసం పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. తొలి సెమీఫైనల్లో దక్షిణ కొరియా 6–5తో గోల్స్ తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి జపాన్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది.
చదవండి: IND vs SA: ఎవరికి అవకాశం ఇద్దాం!.. తల పట్టుకుంటున్న కోహ్లి, ద్రవిడ్
Comments
Please login to add a commentAdd a comment