వేల్స్‌పై టీమిండియా ఘన విజయం.. అయినా ఖరారు కాని క్వార్టర్స్‌ బెర్త్‌ | Mens Hockey World Cup 2023: India Beat Wales | Sakshi
Sakshi News home page

Mens Hockey World Cup 2023: వేల్స్‌పై టీమిండియా ఘన విజయం.. అయినా ఖరారు కాని క్వార్టర్స్‌ బెర్త్‌

Published Thu, Jan 19 2023 9:49 PM | Last Updated on Thu, Jan 19 2023 9:49 PM

 Mens Hockey World Cup 2023: India Beat Wales - Sakshi

ఒడిశా వేదికగా జరుగుతున్న పురుషుల హాకీ వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా క్వార్టర్ ఫైనల్‌ దిశగా ఆడుగులు వేస్తుంది. పూల్‌-డిలో ఇవాళ (జనవరి 19) వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌.. 4-2 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించి, క్వార్టర్స్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది.

పూల్‌-డిలో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్‌ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రా) నేరుగా క్వార్టర్స్‌కు చేరుకోగా.. రెండో స్థానంలో నిలిచిన భారత్‌ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రా).. పూల్‌-సిలో మూడో ప్లేస్‌ ఉన్న న్యూజిలాండ్‌తో క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌ (ఆదివారం) ఆడి గెలవాల్సి ఉంటుంది.

వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశ్‌దీప్‌ సింగ్‌ 2 గోల్స్‌ చేయగా.. షంషేర్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ తలో గోల్‌ సాధించారు. వేల్స్‌ తరఫున గ్యారెత్‌ ఫర్లాంగ్‌, జాకబ్‌ డ్రాపర్‌ చెరో గోల్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement