టీమిండియాకు పరాభవం.. వరల్డ్‌కప్‌ నుంచి నిష్క్రమణ | Mens Hockey WC 2023: New Zealand Defeat India in Penalty Shootout | Sakshi
Sakshi News home page

Mens Hockey WC 2023: టీమిండియాకు పరాభవం.. వరల్డ్‌కప్‌ నుంచి నిష్క్రమణ

Published Sun, Jan 22 2023 9:32 PM | Last Updated on Sun, Jan 22 2023 9:32 PM

Mens Hockey WC 2023: New Zealand Defeat India in Penalty Shootout - Sakshi

పురుషుల హాకీ వరల్డ్‌కప్‌-2023 బరిలో నుంచి టీమిండియా నిష్క్రమించింది. న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 22) జరిగిన హోరాహోరీ క్రాస్‌ ఓవర్‌ సమరంలో భారత్‌ పెనాల్టీ షూటౌట్‌లో 4-5 (3-3) తేడాతో ఓటమిపాలై క్వార్టర్స్‌ చేరకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది. క్వార్టర్స్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ఓటమిని కొని తెచ్చుకుంది.

నిర్ణీత సమయంలో ఇరు జట్లు 3-3 గోల్స్‌ తేడాతో సమానంగా నిలువగా.. పెనాల్టీ షూటౌట్‌లో ఆఖరి ఛాన్స్‌ను షంషేర్‌ మిస్‌ చేయడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. న్యూజిలాండ్‌.. జనవరి 24న జరిగే క్వార్టర్‌ ఫైనల్‌లో బెల్జియంతో తలపడనుంది. 

కాగా, పూల్‌-డిలో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్‌ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రా) నేరుగా క్వార్టర్స్‌కు చేరుకోగా.. రెండో స్థానంలో నిలిచిన భారత్‌ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రా).. పూల్‌-సిలో మూడో ప్లేస్‌ ఉన్న న్యూజిలాండ్‌తో క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌ ఆడాల్సి వచ్చింది.

ఇదిలా ఉంటే, ఇవాళే జరిగిన మరో క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌లో స్పెయిన్‌ జట్టు మలేషియాను 2(4)-2(3) గోల్స్‌ తేడాతో ఓడించి, ఈ నెల 24న జరిగే తొలి క్వార్టర్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టేందుకు అర్హత సాధించింది. రేపు జరుగబోయే మరో రెండు క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌ల్లో (జర్మనీ వర్సెస్‌ ఫ్రాన్స్‌, అర్జెంటీనా వర్సెస్‌ దక్షిణ కొరియా) విజేతలు ఈ నెల 25న జరిగే రెండు, మూడు క్వార్టర్‌ ఫైనల్‌లలో ఇంగ్లండ్‌, నెదర్లాండ్స్‌ జట్లతో తలపడతాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement