Mens Hockey World Cup
-
Hockey World Cup 2023: హాకీ జగజ్జేత జర్మనీ
భువనేశ్వర్: 13 ఏళ్ల విరామం తర్వాత జర్మనీ జట్టు పురుషుల హాకీలో జగజ్జేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ప్రపంచకప్ హాకీ టోర్నీ ఫైనల్లో జర్మనీ ‘షూటౌట్’లో 5–4తో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం జట్టును ఓడించింది. నిర్ణీత సమయం ముగిసే సరికి రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో నిర్ణీత ఐదు షాట్ల తర్వాత రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. ‘సడెన్ డెత్’లో తొలి షాట్లో రెండు జట్ల ఆటగాళ్లు సఫలమయ్యాయి. రెండో షాట్లో జర్మనీ సఫలంకాగా... బెల్జియం ఆటగాడు విఫలంకావడంతో జర్మనీ విజయం ఖరారైంది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల తర్వాత మూడుసార్లు ప్రపంచకప్ నెగ్గిన మూడో జట్టుగా జర్మనీ గుర్తింపు పొందింది. జర్మనీ 2002, 2006ల లో టైటిల్ నెగ్గింది. కాంస్య పతకం మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3–1తో ఆస్ట్రేలియాను ఓడించింది. -
టీమిండియాకు పరాభవం.. వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమణ
పురుషుల హాకీ వరల్డ్‌కప్-2023 బరిలో నుంచి టీమిండియా నిష్క్రమించింది. న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 22) జరిగిన హోరాహోరీ క్రాస్ ఓవర్ సమరంలో భారత్ పెనాల్టీ షూటౌట్లో 4-5 (3-3) తేడాతో ఓటమిపాలై క్వార్టర్స్ చేరకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది. క్వార్టర్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ఓటమిని కొని తెచ్చుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 3-3 గోల్స్ తేడాతో సమానంగా నిలువగా.. పెనాల్టీ షూటౌట్లో ఆఖరి ఛాన్స్‌ను షంషేర్ మిస్ చేయడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. న్యూజిలాండ్.. జనవరి 24న జరిగే క్వార్టర్ ఫైనల్లో బెల్జియంతో తలపడనుంది. కాగా, పూల్-డిలో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రా) నేరుగా క్వార్టర్స్‌కు చేరుకోగా.. రెండో స్థానంలో నిలిచిన భారత్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రా).. పూల్-సిలో మూడో ప్లేస్ ఉన్న న్యూజిలాండ్‌తో క్రాస్ ఓవర్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే, ఇవాళే జరిగిన మరో క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు మలేషియాను 2(4)-2(3) గోల్స్ తేడాతో ఓడించి, ఈ నెల 24న జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టేందుకు అర్హత సాధించింది. రేపు జరుగబోయే మరో రెండు క్రాస్ ఓవర్ మ్యాచ్‌ల్లో (జర్మనీ వర్సెస్ ఫ్రాన్స్, అర్జెంటీనా వర్సెస్ దక్షిణ కొరియా) విజేతలు ఈ నెల 25న జరిగే రెండు, మూడు క్వార్టర్ ఫైనల్లలో ఇంగ్లండ్, నెదర్లాండ్స్ జట్లతో తలపడతాయి. -
WC 2023: నెదర్లాండ్స్ సంచలన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి
FIH Men’s Hockey World Cup- భువనేశ్వర్: ప్రపంచ కప్ హకీ టోర్నీలో నెదర్లాండ్స్ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మెగా టోర్నీలో ప్రత్యర్థి జట్టును అత్యధిక గోల్స్ తేడాతో ఓడించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఒడిశా వేదికగా గురవారం నాటి పూల్ సి మ్యాచ్‌లో భాగంగా చిలీని 14-0తో చిత్తు చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది. తద్వారా ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును డచ్ జట్టు బద్దలు కొట్టింది. 2010 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 12-0తో ఓడించింది. కాగా భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో.. నెదర్లాండ్స్ ఆటగాళ్లు హ్యాట్రిక్ వీరడు జిప్ జాన్సెస్, డెర్క్ డి విల్డర్, తిజ్స్ వాన్ డ్యామ్, కెప్టెన్ తెర్రీ బ్రింక్‌మన్, టెరెన్స్ పీటర్స్, కొయెన్ బీజెన్, జస్టెన్ బ్లాక్, ట్యూన్ బీన్స్ గోల్స్ సాధించారు. ఇక చిలీపై విజయంతో ఈ ఎడిషన్‌లో క్వార్టర్స్ చేరిన తొలి జట్టుగా నెదర్లాండ్స్ నిలిచింది. The Netherlands are the first team to be qualified for the quarterfinals of the FIH Odisha Hockey Men's World Cup 2023 in Bhubaneswar-Rourkela. Here are some moments from the game. 🇳🇱NED 14-0 CHI🇨🇱 pic.twitter.com/WISn5Vnhqh — Hockey India (@TheHockeyIndia) January 19, 2023 క్రాస్ ఓవర్’కు భారత్.. ఇక ప్రపంచ కప్ హాకీ టోర్నీలో నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరుకునే లక్ష్యంతో గురువారం వేల్స్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన భారత్... కనీసం 8 గోల్స్ తేడాతో గెలిస్తే ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్ అవసరం లేకుండా నేరుగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టే అవకాశం. కానీ భారత జట్టు అంతటి అత్యుత్తమ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయింది. బలహీన జట్టే అయినా వేల్స్ బాగా పోటీ ఇచ్చింది. భారత హాకీ జట్టు PC: Hockeyindia Twitter చివరకు 4–2తో గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. భారత్ తరఫున షంషేర్ సింగ్ (21వ నిమిషం), ఆకాశ్‌దీప్ సింగ్ (32వ నిమిషం, 45వ నిమిషం), హర్మన్‌ప్రీత్ సింగ్ (59వ నిమిషం) గోల్స్ సాధించగా...వేల్స్ ఆటగాళ్లలో ఫర్లాంగ్ గ్యారెత్ (42వ నిమిషం), డ్రేపర్ జాకబ్ (44వ నిమిషం) గోల్స్ నమోదు చేశారు. గ్రూప్ ‘డి’లో ఇంగ్లండ్‌తో సమానంగా 7 పాయింట్లతో నిలిచినా...ఆడిన 2 మ్యాచ్‌లలో కలిపి మెరుగైన గోల్స్ ప్రదర్శన ఆధారంగా (ఇంగ్లండ్ 9, భారత్ 6) మన జట్టు రెండో స్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే.. నిజానికి బలమైన ప్రత్యర్థి కాకపోయినా వేల్స్ ఒక దశలో భారత్‌ను బెంబేలెత్తించింది. మన టీమ్ కూడా అంది వచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచడంలో విఫలమైంది. 7 పెనాల్టీ కార్నర్లతో పాటు ఆరు సార్లు గోల్ చేసే అవకాశం వచ్చినా మనవాళ్లు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. తొలి క్వార్టర్లో గోల్స్ నమోదు కాకపోగా, రెండో క్వార్టర్లో ఒక గోల్‌తో భారత్ ముందంజ వేసింది. మూడో క్వార్టర్లో రెండు నిమిషాల వ్యవధిలో పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచి వేల్స్ స్కోరు సమం చేసింది. రెండో క్వార్టర్ తొలి నిమిషంలోనే భారత్‌కు పెనాల్టీ లభించగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ దానిని ఉపయోగించుకోలేకపోయాడు. అనంతరం హర్మన్‌ప్రీత్ డ్రాగ్ ఫ్లిక్ డిఫెండర్ స్టిక్కు తగిలి రీబౌండ్ అయి రాగా, ఈ సారి షంషేర్ దానిని గోల్ పోస్ట్‌లోకి పంపించగలిగాడు. మేం సంతృప్తిగా లేము అమిత్ రోహిదాస్ కూడా సరైన సమయంలో స్పందించడంలో విఫలమయ్యాడు. మూడో క్వార్టర్ 11వ నిమిషంలో లభించిన పెనాల్టీని అత ను కూడా విఫలం చేశాడు. చివర్లో కాస్త దూకుడు పెంచిన భారత్ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ఊపిరి పీల్చుకుంది. ‘ఈ విజయంతో మేం సంతృప్తిగా లేము. ఇది మా అత్యుత్తమ ప్రదర్శన కాదు. మరింత బాగా ఆడాల్సింది’ అని మ్యాచ్ అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వ్యాఖ్యానించాడు. ఇక ఆదివారం జరిగే ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడే భారత్ ఆ మ్యాచ్‌లో గెలిస్తే క్వార్టర్స్ చేరుకుంటుంది. ఇతర మ్యాచ్‌లలో మలేసియా 3–2తో న్యూజిలాండ్‌పై, ఇంగ్లండ్ 4–0తో స్పెయిన్‌పై విజయం సాధించాయి. చదవండి: Michael Bracewell: కుటుంబంలో అంతా క్రికెటర్లే! లేట్ అయినా సంచలనాలు సృష్టిస్తూ! కానీ ‘ఈరోజు’ నీది కాదంతే! సెలక్టర్లకు తలనొప్పి! పాపం గిల్! కిషన్‌తో రోజూ గొడవే.. అందుకే తనని బాగా తిడతా.. అయినా కూడా.. It’s time to celebrate the victory. 🤩🕺🏻#IndiaKaGame #HockeyIndia #HWC2023 #StarsBecomeLegends #HockeyWorldCup #INDvsWAL @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/c1ZqtXbR0Q — Hockey India (@TheHockeyIndia) January 19, 2023 -
వేల్స్‌పై టీమిండియా ఘన విజయం.. అయినా ఖరారు కాని క్వార్టర్స్ బెర్త్
ఒడిశా వేదికగా జరుగుతున్న పురుషుల హాకీ వరల్డ్‌కప్-2023లో టీమిండియా క్వార్టర్ ఫైనల్ దిశగా ఆడుగులు వేస్తుంది. పూల్-డిలో ఇవాళ (జనవరి 19) వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్.. 4-2 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి, క్వార్టర్స్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. పూల్-డిలో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రా) నేరుగా క్వార్టర్స్‌కు చేరుకోగా.. రెండో స్థానంలో నిలిచిన భారత్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రా).. పూల్-సిలో మూడో ప్లేస్ ఉన్న న్యూజిలాండ్‌తో క్రాస్ ఓవర్ మ్యాచ్ (ఆదివారం) ఆడి గెలవాల్సి ఉంటుంది. వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశ్‌దీప్ సింగ్ 2 గోల్స్ చేయగా.. షంషేర్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ తలో గోల్ సాధించారు. వేల్స్ తరఫున గ్యారెత్ ఫర్లాంగ్, జాకబ్ డ్రాపర్ చెరో గోల్ చేశారు. -
Hockey WC 2023: ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనున్న భారత్
సొంతగడ్డపై జరుగుతున్న పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో పూల్ ‘డి’లో భాగంగా నేడు ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌పై 2–0తో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌లో 5–0తో వేల్స్‌ను ఓడించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్‌కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. బెల్జియం భారీ విజయం పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. పూల్ ‘బి’లో భాగంగా దక్షిణ కొరియాతో శనివారం జరిగిన మ్యాచ్‌లో బెల్జియం 5–0తో గెలుపొందింది. బెల్జియం తరఫున హెండ్రిక్స్ (31వ ని.లో), కాసిన్స్ (43వ ని.లో), ఫ్లోరెంట్ (50వ ని.లో), సెబాస్టియన్ డాకియర్ (52వ ని.లో), ఆర్థర్ స్లూవెర్ (58వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఇతర మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ 3–1తో చిలీపై, నెదర్లాండ్స్ 4–0తో మలేసియాపై, జర్మనీ 3–0తో జపాన్‌పై విజయం సాధించాయి. -
Men Hockey World Cup 2023: హాకీ ప్రపంచకప్ డ్రా విడుదల
భువనేశ్వర్: వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించే పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌కు సంబంధించిన డ్రా గురువారం విడుదల చేశారు. భువనేశ్వర్, రూర్కెలా వేదికల్లో వచ్చే జనవరి 13 నుంచి 28వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. ప్రపంచ ఐదో ర్యాంకర్, ఆతిథ్య భారత్ ‘పూల్–డి’లో ఇంగ్లండ్, స్పెయిన్, వేల్స్‌లతో తలపడనుంది. ఈ పూల్‌లో మెరుగైన ర్యాంకింగ్ జట్టు భారతే! ఇంగ్లండ్ (6), స్పెయిన్ (8), వేల్స్ (16)లు ఆతిథ్య జట్టుకు దిగువనే ఉన్నాయి. ‘పూల్–ఎ’లో ప్రపంచ నంబర్‌వన్ ఆస్ట్రేలియా, 2016 ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ప్రపంచ చాంపియన్ బెల్జియం ‘పూల్–బి’లో ఉంది. ఈ పూల్‌లో జర్మనీ, కొరియా, జపాన్ మిగతా జట్లు. ‘పూల్–సి’లో గత రన్నరప్ నెదర్లాండ్స్, న్యూజిలాండ్, మలేసియా, చిలీ ఉన్నాయి. -
అర్జెంటీనా సంచలనం
తొలిసారి సెమీస్‌లోకి హాకీ ప్రపంచకప్ ది హేగ్ (నెదర్లాండ్స్): పురుషుల హాకీ ప్రపంచకప్‌లో అర్జెంటీనా కొత్త చరిత్ర సృష్టించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో 5-1తో దక్షిణాఫ్రికాపై గెలిచి తొలిసారి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ గ్రూప్‌లో ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించిన అర్జెంటీనా మొత్తం 12 పాయింట్లతో ఒలింపిక్ చాంపియన్ జర్మనీని వెనక్కి నెట్టి నాకౌట్ దశకు చేరుకుంది. అర్జెంటీనా, నెదర్లాండ్స్ చేతిలో ఓడటం జర్మనీ అవకాశాలను ఘోరంగా దెబ్బతీశాయి. ప్రపంచకప్ చరిత్రలో జర్మనీ సెమీస్‌కు చేరలేకపోవడం ఇది రెండోసారి. గతంలో 1971లో కెన్యా.... పశ్చిమ జర్మనీకి షాకిచ్చి ముందంజ వేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకపక్ష మ్యాచ్‌లో జోక్విమ్ మెనిన్ (20వ ని.), గొంజాగో పిల్లట్ (25, 61వ ని.), లుకాస్ విల్లా (49, 63వ ని.)లు అర్జెంటీనాకు గోల్స్ అందించారు. క్లింటన్ పాంథర్ (57వ ని.) దక్షిణాఫ్రికా తరఫున ఏకైక గోల్ చేశాడు. 1986, 2002 ప్రపంచకప్‌లలో ఆరోస్థానంలో నిలిచిన అర్జెంటీనాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. మరోవైపు భారత్ 9-10వ స్థానం కోసం దక్షిణ కొరియాతో శనివారం తలపడుతుంది.