![Men Hockey World Cup 2023: India drawn with England, Wales and Spain in Pool D - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/9/hockey-india.jpg.webp?itok=_9BvYz0x)
భువనేశ్వర్: వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించే పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌కు సంబంధించిన డ్రా గురువారం విడుదల చేశారు. భువనేశ్వర్, రూర్కెలా వేదికల్లో వచ్చే జనవరి 13 నుంచి 28వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. ప్రపంచ ఐదో ర్యాంకర్, ఆతిథ్య భారత్ ‘పూల్–డి’లో ఇంగ్లండ్, స్పెయిన్, వేల్స్‌లతో తలపడనుంది. ఈ పూల్‌లో మెరుగైన ర్యాంకింగ్ జట్టు భారతే!
ఇంగ్లండ్ (6), స్పెయిన్ (8), వేల్స్ (16)లు ఆతిథ్య జట్టుకు దిగువనే ఉన్నాయి. ‘పూల్–ఎ’లో ప్రపంచ నంబర్‌వన్ ఆస్ట్రేలియా, 2016 ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ప్రపంచ చాంపియన్ బెల్జియం ‘పూల్–బి’లో ఉంది. ఈ పూల్‌లో జర్మనీ, కొరియా, జపాన్ మిగతా జట్లు. ‘పూల్–సి’లో గత రన్నరప్ నెదర్లాండ్స్, న్యూజిలాండ్, మలేసియా, చిలీ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment